పవిత్ర ప్రేమ (1979 సినిమా)

From Wikipedia, the free encyclopedia

పవిత్ర ప్రేమ (1979 సినిమా)

పవిత్ర ప్రేమ 1979 అక్టొబరు 19న విడుదలైన తెలుగు చలన చిత్రం. శ్రీలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ కింద పి.క్రాంతి కుమార్, డి. రవీందర్ లు నిర్మించిన ఈ సినిమాకు డి.ఎస్.ప్రకాశరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]

త్వరిత వాస్తవాలు సంగీతం, నిర్మాణ సంస్థ ...
పవిత్ర ప్రేమ
(1979 తెలుగు సినిమా)
Thumb
సంగీతం ఎస్. రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ ఆర్ట్స్
భాష తెలుగు
మూసివేయి

తారాగణం

సుధాకర్

శ్రీలక్ష్మీ

సత్యచిత్ర

సాక్షి రంగారావు

హలం

సాంకేతిక వర్గం

దర్శకుడు: పి. ఎస్. ప్రకాశరావు

సంగీతం: సాలూరి రాజేశ్వరరావు

నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మిఆర్ట్ పిక్చర్స్

నిర్మాతలు: పి క్రాంతికుమారి, పి.రవీందర్

స్క్రీన్ ప్లే : పి.ఎస్. ప్రకాశరావు

సాహిత్యం:కొసరాజు, భావనాచారి,మదన్ మోహన్

నేపథ్య గానం: ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎల్ఆర్ ఈశ్వరి, బి.వసంత, ఎస్ జానకి.

పాటల జాబితా

1.అందాలరాజా అపురూప తేజా అందుకో, రచన: భావనాచారి, గానం.పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

2.అబ్బలాల రామయ్యో మబ్బుకాడ రావయ్యా, రచన: బావనాచారి, గానం.ఎల్.ఆర్ ఈశ్వరి కోరస్

3 ఎవరమ్మా చక్కనివాడు ఈ రాణికి నచ్చినవాడు, రచన: మదన్ మోహన్, గానం.పి . సుశీల, బి.వసంత

4.ఒట్టు తీసి గట్టుమీద పెట్టేసా మూడుముళ్లు , రచన: భావనాచారి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

5.చిక్కడపల్లి చిన్నదోయీ చిటపటలాడుతూ, రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.ఎల్.ఆర్. ఈశ్వరి

6.పరువాల చిరునవ్వులు నా చరణాల సిరిమువ్వలు, రచన: భావనాచారి, గానం.శిష్ట్లా జానకి కోరస్.

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.