పరిపాటి జనార్దన్ రెడ్డి

From Wikipedia, the free encyclopedia

పరిపాటి జనార్దన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కమలాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. జనార్దన్ రెడ్డి అన్న పరిపాటి ఉమారెడ్డి (1929-2013)  సోషలిస్ట్ నాయకులు. వరంగల్ మేయర్ గా, ఎమ్మెల్యేగా పనిచేశారు.[1]

త్వరిత వాస్తవాలు నియోజకవర్గం, వ్యక్తిగత వివరాలు ...
పరిపాటి జనార్దన్ రెడ్డి

ఎమ్మెల్యే
పదవీ కాలం
1972 - 1983
నియోజకవర్గం కమలాపూర్ నియోజకవర్గం (ప్రస్తుతం హుజురాబాద్)

వ్యక్తిగత వివరాలు

జననం 1935 జనవరి 1
పోతిరెడ్డిపల్లి, వీణవంక మండలం, కరీంనగర్,తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
మరణం 2022 మార్చి 28
హైదరాబాద్
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ జనతా పార్టీ
జీవిత భాగస్వామి శశిరేఖ
సంతానం 3 కుమారులు
నివాసం హైదరాబాద్
వృత్తి రాజకీయ నాయకుడు
మూసివేయి

జననం, విద్యాభాస్యం

పరిపాటి జనార్దన్ రెడ్డి 1935 జనవరి 1న తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్, వీణవంక మండలం, పోతిరెడ్డిపల్లి గ్రామంలో జనించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఏ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

పరిపాటి జనార్ధనరెడ్డి 1959 నుంచి 1971 వరకు హుజూరాబాద్ తహసీల్ సమితి ఛైర్మన్‌గా పనిచేశాడు. ఆయన 1972లో శాసనసభ ఎన్నికల్లో కమలాపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1977లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హన్మకొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. జనార్దన్ రెడ్డి 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కమలాపూర్ నియోజకవర్గం నుండి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

సామజిక కార్యక్రమాలు

పరిపాటి జనార్దన్ రెడ్డి 1984-85లో ఈ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు ఆదర్శ డిగ్రీ కళాశాలను స్థాపించాడు. ఆయన 1988లో జమ్మికుంట పట్టణంలో హిందూ కుష్టు నివారణ సంఘ్ ఏర్పాటు చేసి, కుష్టు బాధితులకు చికిత్సాలయం ఏర్పాటు చేసి వేల మంది కుష్టు వ్యాధిగ్రస్తులకు సేవలందించాడు. పిల్లలకు ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేశాడు. జనార్దన్ రెడ్డి కుష్టు భాదితులకు జమ్మికుంట మండలం తనుగుల గ్రామ శివారులో నివాసాలను ఏర్పాటు చేసి, పరిమళ కాలనీగా నామకరణం చేశాడు. ఆయన రైతులకు సేవలందించే లక్ష్యంతో 1992లో జమ్మి కుంటలో కృషి విజ్ఞాన కేంద్రాన్ని (కేవీకే)ను నెలకొల్పి కరీంనగర్, వరంగల్ జిల్లాల రైతులకు విశిష్ట సేవలందించినందుకుగానూ 2008 సంవత్సరంలో జాతీయ స్థాయిలో ఉత్తమ కృషి విజ్ఞాన కేంద్రం అవార్డు అందుకున్నాడు.

మరణం

పరిపాటి జనార్దన్ రెడ్డి 2022 మార్చి 28న హైదరాబాద్‌లోని అపోలో దవాఖానలో వృద్ధాప్య సమస్యలతో ఆనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు భార్య శశిరేఖ, ముగ్గురు కుమారులు ఉన్నారు.[2][3]

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.