From Wikipedia, the free encyclopedia
రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ (జననం 24 డిసెంబర్ 1967) బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ రాష్ట్రంలోని పలు లోక్‌సభ నియోజకవర్గాల నుండి 1991, 1996, 1999, 2004, 2014లో స్వతంత్ర / ఎస్.పి / లోక్ జనతా పార్టీ / రాష్ట్రీయ జనతా దళ్ అభ్యర్థిగా ఐదు సార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు.[2] పప్పు యాదవ్ ప్రస్తుతం జన్ అధికార్ పార్టీ (లోక్‌తాంత్రిక్) అధ్యక్షుడిగా ఉన్నాడు.[3]
పప్పు యాదవ్ | |||
లోక్‌సభ సభ్యుడు | |||
పదవీ కాలం 16 మే 2014 – 23 మే 2019 | |||
ముందు | శరద్ యాదవ్ | ||
---|---|---|---|
తరువాత | దినేష్ చంద్ర యాదవ్ | ||
నియోజకవర్గం | మాధేపురా | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | పూర్ణియా | 1967 డిసెంబరు 24||
రాజకీయ పార్టీ | జన్ అధికార పార్టీ (లోక్‌తంత్రిక్) (9 మే 2015 – ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | రాష్ట్రీయ జనతాదళ్ | ||
జీవిత భాగస్వామి | రంజీత్ రంజన్[1] | ||
సంతానం | సార్థక్ రంజన్ ప్రకృతి రంజన్ | ||
నివాసం | పూర్ణియా, బీహార్, భారతదేశం |
పప్పు యాదవ్ 24 డిసెంబర్ 1967న బీహార్‌లోని కుమార్ ఖండ్‌లోని ఖుర్దా కర్వేలి గ్రామంలో జన్మించాడు. ఆయన ఆనంద్ మార్గ్ స్కూల్, ఆనంద్ పల్లి, సుపౌల్‌లో చదివాడు. అతను మాధేపురాలోని బి.ఎన్ మండల్ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ & IGNOU నుండి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ హ్యూమన్ రైట్స్‌లో డిప్లొమా పూర్తి చేశాడు.
పప్పు యాదవ్ 1990లో సింగేశ్వర్, మాధేపురా నుండి బీహార్ శాసనసభకు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. ఆయన 1991లో పూర్నియా నుండి 10వ లోక్‌సభకు పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. పప్పు యాదవ్ ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీ, లోక్ జనశక్తి పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయనను 7 మే 2015న ఆర్జేడీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా రాజేష్ రంజన్‌ని ఆర్జేడీ పార్టీ నుండి బహిష్కరించింది, ఆయన ఆ తర్వాత నుఅతనంగా జన్ అధికార్ పార్టీని స్థాపించాడు.[4]
Seamless Wikipedia browsing. On steroids.