పద్మ పురస్కారం
From Wikipedia, the free encyclopedia
పద్మ పురస్కారం భారత ప్రభుత్వంచే అందించబడే అత్యున్నత పురస్కారంలో ఒక పురస్కారం. వివిధ రంగాలైన కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ, ప్రజా జీవితాలు, మొదలగు వాటిలో విశిష్ట సేవ చేసినవారికి ప్రాథమికంగా ఇచ్చే ఈ పౌరపురస్కారం 1954, జనవరి 2న నెలకొల్పబడింది. వివిధ రంగాలలో కృషిచేసిన భారత పౌరులకు పద్మ విభూషణ్ పురస్కారం, పద్మభూషణ్ పురస్కారం, పద్మశ్రీ పురస్కారం పేరిట పురస్కారం ఇవ్వబడుతుంది.[1]
పద్మ పురస్కారం | ||
![]() | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
ఎలాంటి పురస్కారం | పౌర | |
విభాగం | సాధారణ | |
వ్యవస్థాపిత | 1954 | |
మొదటి బహూకరణ | 1954 | |
క్రితం బహూకరణ | 2024 | |
బహూకరించేవారు | భారత ప్రభుత్వం | |
నగదు బహుమతి | ... | |
వివరణ | ... |
ఎంపిక
ప్రతి సంవత్సరం మే 1, సెప్టెంబరు 15 తేదీలలో పద్మ పురస్కారానికి సంబంధించిన సిఫారసులను భారత ప్రధాని ఏర్పాటు చేసిన పద్మ అవార్డుల కమిటీకి సమర్పించబడుతాయి. కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, భారతరత్న, మునుపటి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్, మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర గవర్నర్, పార్లమెంట్ సభ్యులు, తదితరుల నుండి ఈ సిఫార్సులు వస్తాయి. అలా వచ్చిన వాటిని ప్రధానమంత్రి, భారత రాష్ట్రపతికి ఆమోదం కోసం అవార్డు కమిటీ సమర్పిస్తుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డు గ్రహీతలను ప్రకటించి, ప్రతి సంవత్సరం జనవరి 26న రాష్ట్రపతి చేతులమీదుగా పురస్కారాలను అందజేస్తారు.
పద్మ పురస్కారాలు
- పద్మ విభూషణ్ పురస్కారం: ఇది భాతరదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం. ఈ పురస్కారం పతకం రూపంలో వుంటుంది, దీనిపై దేవనాగరి లిపిలో "పద్మ" "విభూషణ్"లు వ్రాయబడి వుంటాయి. 2020 సంవత్సరం వరకు 314 మందికి ఈ పురస్కారం అందజేయబడింది.
- పద్మభూషణ్ పురస్కారం: ఇది భాతరదేశ మూడవ అత్యున్నత పౌర పురస్కారం. ఈ పురస్కారం పతకం రూపంలో వుంటుంది, దీనిపై దేవనాగరి లిపిలో "పద్మ" "భూషణ్"లు వ్రాయబడి వుంటాయి. 2020 సంవత్సరం వరకు 1270 మందికి ఈ పురస్కారం అందజేయబడింది.
- పద్మశ్రీ పురస్కారం: ఇది భారతదేశ నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం. ఈ పురస్కారం పతకం రూపంలో వుంటుంది, దీనిపై దేవనాగరి లిపిలో "పద్మ" "శ్రీ"లు వ్రాయబడి వుంటాయి. 2020 సంవత్సరం వరకు 3005 మందికి ఈ పురస్కారం అందజేయబడింది.[2]
పతకాలు
- పద్మ విభూషణ్ పురస్కార పతకం
- పద్మభూషణ్ పురస్కార పతకం
- పద్మశ్రీ పురస్కార పతకం
- పద్మ విభూషణ్ పతక రిబ్బన్
- పద్మభూషణ్ పతక రిబ్బన్
- పద్మశ్రీ పతక రిబ్బన్
- పద్మశ్రీ పురస్కార ప్రశంసాపత్రం
ఇవికూడా చూడండి
మూలాలు
ఇతర లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.