From Wikipedia, the free encyclopedia
పట్నం మహేందర్ రెడ్డి తెలంగాణ కు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం తెలంగాణ శాసనమండలిలో సభ్యుడు.
పి.మహేందర్ రెడ్డి | |||
తెలంగాణ శాసనమండలి సభ్యుడు | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 19 జూన్ 2019 - ప్రస్తుతం | |||
ముందు | పట్నం నరేందర్ రెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | వికారాబాద్ జిల్లా , తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | 7 జూలై 1956||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత్ రాష్ట్ర సమితి తెలుగుదేశం పార్టీ) | ||
తల్లిదండ్రులు | పట్నం మల్లారెడ్డి, రుక్కమ్మ | ||
జీవిత భాగస్వామి | పట్నం సునీతా రెడ్డి [1] | ||
బంధువులు | సబితా ఇంద్రారెడ్డి (మేనత్త), పట్నం నరేందర్ రెడ్డి (తమ్ముడు) | ||
సంతానం | పట్నం రినీష్ రెడ్డి (కుమారుడు), మనీషా రెడ్డి (కుమారై) | ||
నివాసం | బంజారాహిల్స్. హైదరాబాద్ |
మహేందర్ రెడ్డి వెటర్నరీ సైన్సులో డిగ్రీ పూర్తిచేశాడు. ఇతనికి ఒక కుమారుడు, ఒక కుమారై. మహేందర్ రెడ్డి భార్య పట్నం సునీతా రెడ్డి 2001-06 కాలంలో రంగారెడ్డి జిల్లా పరిషత్తు చైర్‌పర్సన్‌గా పనిచేసింది. ఈమె బంట్వారం నుంచి జడ్పీటీసిగా ఎన్నికైంది.[2]
పట్నం మహేందర్‌రెడ్డి 1994లో తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1999లో వరుసగా రెండవసారి గెలిచి, 2004లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.నారాయణరావు చేతిలో ఓటమి పాలయ్యాడు. పట్నం మహేందర్‌రెడ్డి 2009లో మాజీ మంత్రి ఎం.మాణిక్ రావు కుమారుడు ఎం.రమేష్‌పై 13205 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి మూడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం 2014లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి,రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు.[3] 2019 లో కాంగ్రెస్ కు చెందిన పైలెట్ రోహిత్ రెడ్డి చేతిలో పరాజయం పొందినాడు. ఆయనకు 31 మే 2019లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచాడు.[4] ఆయన ఎమ్మెల్సీగా 19 జూన్ 2019న ప్రమాణ స్వీకారం చేశాడు.[5] ఆయన ఈ పదవిలో 4 జనవరి 2022 వరకు కొనసాగి[6], తిరిగి రెండవసారి 27 జనవరి 2022న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాడు.[7]
పట్నం మహేందర్‌రెడ్డి 2023 ఆగస్ట్ 24న రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై మహేందర్‌రెడ్డితో ప్రమాణస్వీకారం చేయించగా,[8] ఆయనకు గనులు, భూగర్భ వనరులు, సమాచార, పౌర సంబంధాల శాఖలను కేటాయించారు.[9][10] ఆయన ఆగష్టు 30న సచివాలయం మొదటి అంతస్థులోని కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించాడు.[11][12]
పట్నం మహేందర్ రెడ్డిని శాసనమండలి చీఫ్ విప్‌గా బాధ్యతలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2024 అక్టోబర్ 1న ఉత్తర్వులు జారీ చేసింది.[13]
Seamless Wikipedia browsing. On steroids.