పట్టిసం
ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా పోలవరం మండల గ్రామం From Wikipedia, the free encyclopedia
పట్టిసం, ఏలూరు జిల్లా, పోలవరం మండలానికి చెందిన గ్రామం. ఇది ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం. పాపికొండల మధ్య సాగే గోదావరి మధ్యనున్న చిన్న లంక ప్రాంతంలో దేవకూట పర్వతంపైన వీరభద్రస్వామి వారి ఆలయం, భావనారాయణ స్వామివార్ల ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయం తెలుగు సినిమాల చిత్రీకరణకు ఒక ముఖ్య ప్రాంతం. దీన్ని పట్టిసం, పట్టిసంనిధి, పట్టిసీమ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ మహాశివరాత్రికి బ్రహ్మాండమైన ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి. ఈ తీర్ధం లేదా తిరునాళ్ళకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు.
పట్టిసం | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 17°13′14″N 81°39′11″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఏలూరు |
మండలం | పోలవరం |
విస్తీర్ణం | 9.85 కి.మీ2 (3.80 చ. మై) |
జనాభా (2011)[1] | 4,792 |
• జనసాంద్రత | 490/కి.మీ2 (1,300/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 2,382 |
• స్త్రీలు | 2,410 |
• లింగ నిష్పత్తి | 1,012 |
• నివాసాలు | 1,434 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 534315 |
2011 జనగణన కోడ్ | 588108 |
పేరు వ్యుత్పత్తి
పూర్వం దక్ష ప్రజాపతి తాను చేస్తోన్న యజ్ఞానికి తన అల్లుడైన శివుడిని ఆహ్వానించకుండా అవమాన పరుస్తాడు. ఆ విషయమై తండ్రిని నిలదీసిన సతీదేవి, తిరిగి శివుడి దగ్గరికి వెళ్లలేక అగ్నికి తన శరీరాన్ని ఆహుతి చేస్తుంది. దాంతో ఉగ్రుడైన రుద్రుడు . వీరభద్రుడిని సృష్టించి, దక్షుడి తల నరకమని ఆజ్ఞాపిస్తాడు. శివుడి ఆదేశం మేరకు దక్షుడి యజ్ఞ వాటికపై వీరభద్రుడు విరుచుకుపడతాడు. తన ఆయుధమైన 'పట్టసం' ( పొడవైన వంకీ కత్తి ) తో దక్షుడి తల నరికి దానిని గోదావరిలో కడిగాడు. ఈ కారణంగానే ఈ ప్రాంతాన్ని పట్టసమనీ . పట్టిసీమనీ . పట్టసాచల క్షేత్రంని పిలుస్తుంటారు. [2]
భౌగోళికం
ఇది మండల కేంద్రమైన పోలవరం నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కొవ్వూరు నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది.
జనాభాగణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1434 ఇళ్లతో, 4792 జనాభాతో 985 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2382, ఆడవారి సంఖ్య 2410.[3]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4844. ఇందులో పురుషుల సంఖ్య 2425, మహిళల సంఖ్య 2419, గ్రామంలో నివాసగృహాలు 1205 ఉన్నాయి.
రవాణాసౌకర్యాలు
రహదారి
కొవ్వూరు నుండి గోదావరి గట్టుమీదగా ఇక్కడికి చేరుకోవచ్చు.
రైలు
రాజమండ్రి లేదా నిడదవోలులో రైలు దిగవచ్చు. కొవ్వూరు రైలు స్టేషను అతిసమీపం కానీ అక్కడ తగినన్ని రైళ్ళు ఆగవు. రైల్వే కూడలైన నిడదవోలు నుండి పోలవరం వెళ్ళు బస్సులు కూడా పట్టిసం మీదుగా వెళతాయి.
విమానం
రాజమండ్రిలోని కోరుకొండ విమానాశ్రయం ఇక్కడికి సమీపంలో ఉంది. ఈ క్షేత్రం రాజమండ్రి నుండి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది.
జలమార్గం
గోదావరిపై లాంచీల ద్వారా ద్వారా చేరవచ్చు రాజమండ్రి నుండి పాపికొండల విహారయాత్రలో భాగంగా పట్టిసీమ వుంటుంది.
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల పోలవరంలోను, ఇంజనీరింగ్ కళాశాల కొవ్వూరులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ రాజమండ్రిలో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల కొయ్యలగూడెంలోను, అనియత విద్యా కేంద్రం పోలవరంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల రాజమండ్రి లోనూ ఉన్నాయి.
భూమి వినియోగం
పట్టిసంలో 2011 జనగణన ప్రకారం భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 25 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 42 హెక్టార్లు
- బంజరు భూమి: 12 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 906 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 13 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 905 హెక్టార్లు
- కాలువలు: 248 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 405 హెక్టార్లు
- చెరువులు: 252 హెక్టార్లు
ఉత్పత్తి
ప్రాజెక్టు
ఆలయాలు
శ్రీవీరభద్రస్వామి ఆలయం
శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కొలువుదీరిన ఈ దివ్య క్షేత్రానికి, శ్రీ భూ నీలా సమేత భావనారాయణస్వామి క్షేత్ర పాలకుడు. కనకదుర్గ అమ్మవారు . శ్రీ మహిషాసుర మర్ధిని అమ్మవారు ఇక్కడ గ్రామదేవతలుగా దర్శనమిస్తారు. ఇక అనిస్త్రీ . పునిస్త్రీ అనే దేవతలు సంతానాన్ని ప్రసాదించే దేవతలుగా ఇక్కడ పూజలందుకుంటూ వుంటారు.
చిత్రమాలిక
- శ్రీ వీరభధ్రస్వామి దేవాలయం వెనుక భాగం దేవస్థానం, పట్టిసీమ
- శ్రీ వీరభధ్రస్వామి దేవాలయ ఆవరణలో నందీశ్వరుడు
- శ్రీ వీరభధ్రస్వామి దేవాలయ ప్రధాన ముఖద్వారం
- శివరాత్రిరోజు నదిదాటుటకై వేచివున్న వేలాదిభక్తులు
- శివరాత్రికి పోలిసుల రక్షణలో గుడికి లాంచిలో వెళ్ళుచున్న భక్తులు
- పట్టిసం రేవువద్ద క్రొత్తగా నిర్మాణంలోవున్న మినీబ్యారెజి
ఇవీ కూడా చూడండి
మూలాలు
ఇతర లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.