నిడుముక్కల సుబ్బారావు
From Wikipedia, the free encyclopedia
నిడుముక్కల సుబ్బారావు (మార్చి 10, 1896 - ఏప్రిల్ 17,1968) రంగస్థల నటుడు, మైలవరం బాలభారతి నాటక సమాజంలో ప్రధాన పురుష పాత్రధారి.

జననం
ఈయన 1896 మార్చి 10వ తేదీన విజయవాడలో జన్మించాడు.
రంగస్థల ప్రవేశం
మొట్టమొదట బందరు ‘చిత్రకళాభివర్దిని’ సామాజంలో బాలవేషాలలో నటించి తరువాత మైలవరం కంపెనీలో చేరి అఖండ ఖ్యాతి గడించాడు.
నటించిన పాత్రలు
శ్రీకృష్ణుడు, గయోపాఖ్యానంలో అర్జునుడు, శిశుపాలుడు, అశ్వనీదేవత (సుకన్య), భీష్మ, బబ్బిలి రంగారావు, జలంధరుడు, బిల్వమంగళుడు, ఖడ్గ నారాయణుడు, మన్మధుడు (అనసూయ), శ్రీరాముడు, భరతుడు, నారదుడు, గిరిరాజు (చండిక), క్రూరసేనుడు మొదలైనవి.
బిరుదులు
- రంగభూషణ
- నాట్య విశారద
మరణం
చివరి దశలో లారీ నడిపిస్తూ 1968, ఏప్రిల్ 17న మరణించాడు.
మూలాలు
- నిడుముక్కల సుబ్బారావు, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 658.
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.