Remove ads
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
నాహన్ హిమాచల్ ప్రదేశ్ లోని పట్టణం. సిర్మౌర్ జిల్లా ముఖ్య పట్టణం. ఇది పూర్వ సిర్మూర్ సంస్థానానికి రాజధానిగా ఉండేది. నాహన్ 30.55°N 77.3°E ఇర్దేశాంకాల వద్ద [2] సముద్రమట్టం నుండి 932 మీటర్ల ఎత్తున ఉంది.
2001 భారత జనగణన ప్రకారం, [3] నాహన్ తహసీల్ జనాభా 35,000. ఇందులో పురుషులు 54%, స్త్రీలు 46%. అక్షరాస్యత 85%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 86%, స్త్రీల అక్షరాస్యత 79%. నాహన్ జనాభాలో 11% మంది ఆరేళ్ళ లోపు వయస్సు గలవారు. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, నాహన్ జనాభా 56,000. ప్రతి వెయ్యి మంది పురుషులకు 916 మంది మహిళలు ఉన్నారు. అక్షరాస్యత రేటు 83.4%, పురుషుల అక్షరాస్యత 87.01%, స్త్రీ అక్షరాస్యత 76.71%.
శీతోష్ణస్థితి డేటా - Nahan (1971–2000, extremes 1953–2011) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 26.9 (80.4) |
28.8 (83.8) |
34.8 (94.6) |
39.1 (102.4) |
40.6 (105.1) |
43.0 (109.4) |
41.0 (105.8) |
36.8 (98.2) |
36.0 (96.8) |
33.6 (92.5) |
30.2 (86.4) |
28.8 (83.8) |
43.0 (109.4) |
సగటు అధిక °C (°F) | 17.6 (63.7) |
20.5 (68.9) |
25.1 (77.2) |
30.8 (87.4) |
34.7 (94.5) |
35.0 (95.0) |
29.5 (85.1) |
28.5 (83.3) |
28.7 (83.7) |
27.8 (82.0) |
23.7 (74.7) |
18.8 (65.8) |
26.7 (80.1) |
సగటు అల్ప °C (°F) | 6.5 (43.7) |
8.0 (46.4) |
11.9 (53.4) |
17.3 (63.1) |
20.8 (69.4) |
22.6 (72.7) |
21.6 (70.9) |
21.1 (70.0) |
20.0 (68.0) |
16.6 (61.9) |
12.0 (53.6) |
8.4 (47.1) |
15.6 (60.0) |
అత్యల్ప రికార్డు °C (°F) | −0.9 (30.4) |
0.1 (32.2) |
4.1 (39.4) |
6.1 (43.0) |
10.0 (50.0) |
10.5 (50.9) |
13.7 (56.7) |
12.8 (55.0) |
11.5 (52.7) |
7.9 (46.2) |
2.6 (36.7) |
0.5 (32.9) |
−0.9 (30.4) |
సగటు వర్షపాతం mm (inches) | 51.9 (2.04) |
59.7 (2.35) |
54.1 (2.13) |
39.4 (1.55) |
36.5 (1.44) |
145.2 (5.72) |
436.4 (17.18) |
461.7 (18.18) |
166.3 (6.55) |
38.6 (1.52) |
15.3 (0.60) |
41.1 (1.62) |
1,546.2 (60.88) |
సగటు వర్షపాతపు రోజులు | 2.6 | 3.4 | 3.5 | 2.1 | 2.9 | 6.7 | 14.3 | 15.1 | 7.3 | 1.9 | 0.9 | 1.6 | 62.3 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) | 67 | 63 | 53 | 45 | 35 | 53 | 80 | 86 | 79 | 63 | 60 | 64 | 62 |
Source: India Meteorological Department[4][5] |
సమీప విమానాశ్రయాలు సిమ్లా, చండీగఢ్ లలో ఉన్నాయి. ఈ రెండూ 60 కిలోమీటర్ల లోపు ఉండగా, డెహ్రాడూన్ విమానాశ్రయం 190 కిలోమీటర్ల లోపున ఉంది.
సమీప రైల్వే స్టేషన్లు బరారా, అంబాలా, చండీగఢ్, కల్కాల్లో ఉన్నాయి. బస్సు ద్వారా ఈ స్టేషన్లను చేరుకోవచ్చు. యమునానగర్ రైలు స్టేషను కూడా పట్టణానికి దగ్గర లోనే ఉంది.
నేషనల్ హైవే 7, నేషనల్ హైవే 907 ఎ నాహన్ గుండా పోతాయి. వీటి ద్వారా హిమాచల్, మిగతా దేశం లోని ప్రదేశాలను చేరుకోవచ్చు. [6] రాజ్బన్ నుండి బైలా ద్వారా, డెహ్రా డూన్ నుండి పావోంటా సాహిబ్ ద్వారా; చండీగఢ్ నుండి పంచకుల-నరైన్గఢ్-కాలా అమ్బ్ ద్వారా, హర్యానా నుండి యమునానగర్-హతనికుండ్ ద్వారా, సిమ్లా నుండి సోలన్-కుమార్హట్టి ద్వారా సోలన్ చేరుకోవచ్చు. ఈ పట్టణాలకు సోలన్ నుండి బస్సు సర్వీసులు నడుస్తాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.