నాగులవరం (అర్ధవీడు)

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం From Wikipedia, the free encyclopedia

నాగులవరం ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

త్వరిత వాస్తవాలు నాగులవరం (అర్ధవీడు), దేశం ...
నాగులవరం (అర్ధవీడు)
గ్రామం
నాగులవరం (అర్ధవీడు) is located in ఆంధ్రప్రదేశ్
నాగులవరం (అర్ధవీడు)
అక్షాంశ రేఖాంశాలు: 15°37′1.416″N 79°6′6.156″E
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంఅర్ధవీడు
అదనపు జనాభాగణాంకాలు
  లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( )
మూసివేయి

విద్యాసౌకర్యాలు

  • జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  • మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

మౌలిక వసతులు

అంగనవాడీ కేంద్రం.

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో వెంకటలక్ష్మమ్మ, సర్పంచిగా ఎన్నికైంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం

శ్రీ భ్రమరాంబామల్లికార్జునస్వామివారి ఆలయం

నాగులవరం గ్రామ నెరవపై వెలసిన ఈ ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించెదరు.

శ్రీ పాండురంగనాయకస్వామివారి ఆలయం

స్థానిక చెన్నకేశ్వస్వామివారి ఆలయ ప్రాంగణంలో నూతనంగా చేపట్టనున్న ఈ ఆలయ నిర్మాణానికి, 2015,నవంబరు-21వ తేదీ శనివారంనాడు భూమిపూజ నిర్వహించారు. గ్రామస్థులు, స్థానికంగా కొందరు దాతల ఆర్థిక సహకారంతో నిర్మించనున్న ఈ ఆలయ నిర్మాణానికి, కర్నాటక రాష్ట్రంలోని హుబ్లీ నగరానికి చెందిన పలువురు దాతలు ఈ ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించుచున్నారు.

శ్రీ నెమలిగొండ్ల రంగనాయక్లస్వామివారి ఆలయం & శ్రీ కోదండరామస్వామివారి ఆలయం

ఈ ఆలయాలలో నాలుగురోజుల తిరునాళ్ళ, నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమాలు 2017,జూన్-1వతేదీ గురువారంనుండి 4వతేదీ ఆదివారం వరకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో రాష్ట్రస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించి గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసినారు.

పీర్లచావిడి

నాగులవరం గ్రామంలో 2015,మే-30వ తేదీ శనివారంనాడు, పీర్లచావిడి ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు.

మూలాలు

వెలుపలి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.