From Wikipedia, the free encyclopedia
నవ తంత్రము (ఆంగ్లం: Navatantra లేదా Neotantra) 1970వ దశకంలో ఆధునిక, పాశ్చాత్య సవరణలతో ఏర్పడ్డ తంత్రము యొక్క మరొక రూపాంతరము. నవ తంత్రము యొక్క ప్రతిపాదకులు కొందరు పురాతన గ్రంథాలని, సాంప్రదాయలనే పాటిస్తూ ఉండగా, మరి కొందరు అసాంప్రదాయిక ఆచారాలని పాటిస్తూ నవ తంత్రము అనగా కేవలం ఆధ్యాత్మిక లైంగికానందమనే ముద్ర పడేలా చేసారు. సాంప్రదాయిక తంత్రములో అత్యంత ప్రాముఖ్యత గల (గురు పరంపర వంటి) వాటిని కొన్నింటిని నవ తంత్రము విస్మరించటం జరిగింది.
ఈ వ్యాసం 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే. లైంగికత గురించి చర్చించటం మూలాన ఈ వ్యాసం చదవటం అందరికీ అమోదయోగ్యం కాకపోవచ్చును . ఇది మీకు సౌకర్యవంతం కాకపోతే దయచేసి తక్షణమే ఈ పుట నుండి నిష్క్రమించ ప్రార్థన. |
“ | నిరతిశయ ప్రేమస్పదత్వం ఆనందత్వం | ” |
“ | స హ ఏతావన్ అస యథ స్త్రీపుమాంసౌ సంపరిస్వక్తౌ | ” |
మర్మస్థానం కాదది మీ జన్మస్థానం
మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం
- ప్రతిఘటన చిత్రంలో తను రచించిన ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో పాటలో వేటూరి సుందరరామ్మూర్తి
నవ తంత్రము యొక్క పదజాలము సంభోగము పై గౌరవాన్ని పెంపొందించేలా, దైవత్వాన్ని ఆపాదించేలా ఉంటుంది. కొని పదాలు -
నవ తంత్రము ఈ క్రింది లక్షణాలు కలిగి ఉంటుంది.
నవ తంత్రముని పాటించువారు లైంగిక అనుభవం భాగస్వాములు ఆధ్యాత్మికంగా ఎదిగేలా దోహదపడుతుందని భావిస్తారు. లైంగిక చర్యలలో పాల్గొనటం మూలాన శక్తి పూజించబడుతుందని, చక్రాలలో చైతన్యం వస్తుందని, కుండలినీ శక్తి జాగృతం అవుతుందని నమ్ముతారు. ఈ దృక్పథంలో నవ తంత్రము కేవలం లైంగికానందాన్ని పెంపొందించుకొనటానికి తద్వారా మానసికంగా ఒకరికొకరు దగ్గర కావటానికి ఉపయోగపడుతుంది అన్న భావన నెలకొన్నది. ఇదిలా ఉంటే నవ తంత్రములో కొందరు గురువులు అపఖ్యాతికి గురి కావటం ఒక విశేషమైతే, అంకిత భావం గల గురువులు ఉండటం మరొక విశేషం.
తాంత్రిక సంభోగములో నియమనిభంధనలు ఉన్నాయి. భాగస్వాములిరువురూ ఒకరినొకరు గౌరవించుకొనవలసి ఉంటుంది. తాంత్రిక సంభోగముకు ముందు గదిని, పుష్పాలతో, సువాసనలతో, ప్రత్యేకమైన రంగు కొవ్వొత్తులలో అలంకరించవలసి ఉంటుంది. వీలైతే భాగస్వాములు కలసి స్నానం చేయవలసి ఉంటుంది. ఒకరి శరీరం మరొకరు శుభ్రపరచవలసి ఉంటుంది. భాగస్వాముల వస్త్రధారణ ప్రత్యేకంగా ఉంటుంది. ఏ లైంగిక చేష్ట జరిపే ముందైననూ భాగస్వామి యొక్క అనుమతిని పొందవలసి ఉంటుంది.
లైంగిక భాగస్వాములు ఇరువురూ తమ శ్వాస పైనే కాకుండా, భాగస్వామి యొక్క శ్వాస పై కూడా స్పృహ కలిగి ఉంటారు. ఒకరి ఉచ్ఛ్వాస, నిశ్వాసాలని మరొకరు అర్థం చేసుకొంటూ వాటిలో సమతౌల్యతని సాధిస్తారు. వ్యతిరేక స్త్రీ-పురుష శక్తులు సంభోగ సమయంలో తమని తాము అర్థం చేసుకోవటమే కాక, భాగస్వామి యొక్క శారీరక/మానసిక మార్పులని అర్థం చేసుకొంటూ, పరస్పరం ప్రేమించుకొంటూ, ప్రేరేపించుకొంటూ భావప్రాప్తి పొందే సమయానికి ప్రేరేపణలని తాత్కాలితంగా విరమించుతూ, మరల వాటిని పున:ప్రారంభించుతూ పారవశ్యపు పరిధిని పెంచుకొంటారు. నిశ్చలానందానికి బాటలు వేసుకొంటారు.
నిశ్చలానందము పొందుట కొరకు వీటితో బాటు నవ తంత్రములో మరిన్ని ఇతర మెళకువలు, పద్ధతులు, తాంత్రిక సంగీతం, తాంత్రిక నృత్యాలు, వ్యాయామాలు, యోగ-ముద్ర-మంత్ర-తంత్ర-యంత్రాలు ఉన్నాయి.
నవ తంత్రము (ప్రత్యేకించి పురుషులలో) స్ఖలనము, భావప్రాప్తి వేర్వేరు అని బోధిస్తుంది. స్ఖలనము లేకుండానే భావప్రాప్తిని ఎన్ని మార్లైనను పొందవచ్చునని; స్ఖలనము లేని భావప్రాప్తుల వలనే పారవశ్యపు పరిధులు పెరుగుతాయని తెలుపుతుంది. స్ఖలనముని నియంత్రించుకొను విధానాలు బోధిస్తుంది. అయితే వైజ్ఞానిక పరంగా దీనికి ఋజువులు లేవు. వాస్తవానికి వైజ్ఞానికంగా భావప్రాప్తి ఒక మారు వచ్చిననూ, పలు మార్లు వచ్చిననూ పారవశ్యపు పరిధిలో ఏ మాత్రము తేడా ఉండదని తేలినది. అమితమైన తృప్తినిచ్చే భావప్రాప్తి ఒకేమారు రావటం ఆనందదాయకమా, లేక తక్కువ స్థాయిలలో తృప్తినిచ్చే భావప్రాప్తులు పలుమార్లు రావటం ఆనందదాయకమా అన్నది వ్యక్తి ఇష్టాయిష్టాలని బట్టి ఉంటుంది అని విజ్ఞానం తేల్చింది.
నవ తంత్రములో తాంత్రిక మర్దనం ఒక భాగం. స్త్రీ-పురుషులిరువురూ లైంగిక చర్యకి ఉపక్రమించే ముందు ఒకరి శరీరాలని ఒకరు పలు విధాలుగా మర్దన చేసుకొంటారు. లైంగిక చర్యలకి ఉపక్రమించిన తర్వాత భావప్రాప్తికై తొందరపెట్టే శారీరక/మానసిక శక్తిని చక్రాల వైపు దారి మళ్ళించి కుండలనీ శక్తిని జాగృతం చేసేందుకు రెండు చేతులతో ఒకరి గుండెపై మరొకరు చేతులు వేసుకొని మృదువుగా మర్దన చేసుకొంటారు. నవ తంత్రములో పారవశ్యపు పరిధులని పెంచుకొనుటకు, ఇంకనూ ఈ క్రింది మర్దనలు ఉన్నాయి.
పూర్వ లైంగిక సంబంధాల వలన మానసికంగా గాయపడినవారికి నవ తంత్రములో చికిత్సలు ఉన్నాయి. ఈ చికిత్సలు తాంత్రిక గురువులు చేయవచ్చును. దంపతుల మధ్య గురువుల జోక్యం కూడదు అనుకొన్నవారు, శిక్షణ ద్వారా భాగస్వామికి చికిత్స చేయటం కొరకు సంసిద్ధులు కావచ్చును. తాంత్రిక మర్దనాల ద్వారా చక్రాలలో నిగూఢమై ఉన్న వికల భావనలను పారద్రోలవచ్చును. ఆత్మని నూతనంగా ఆవిష్కరించకొనవచ్చును. దీని ద్వారా దంపతులు మధ్య ప్రేమాభిమానాలతో బాటు అన్యోన్యత, అనుబంధం, పరస్పర నమ్మకం, దాంపత్య సుఖాలు పెరుగుతాయి.
తాంత్రిక భాగస్వాములను కేవలము బాహ్య సౌందర్యము వలనో, ధన బలము వలనో, సంఘములో వారికున్న పేరు ప్రఖ్యాతుల వలనో నిర్ణయించబడదు. తాంత్రిక భాగస్వామ్యానికి దేహముతో గానీ వయసుతో గానీ పని లేదు. వివిధ ధ్యాన పద్ధతులలో తాంత్రిక భాగస్వాములని వెదుకుకొనవచ్చును. పదే పదే ధ్యానంలో ప్రత్యక్షమై ఆహ్వానించువారే తాంత్రిక భాగస్వాములు. శ్వేత జాతీయులకు నల్ల జాతి వారు, వయసు తక్కువగా ఉన్నవారికి వయసు పైబడిన వారు, ఇలా వ్యతిరేకులు కూడా తాంత్రిక భాగస్వాములు అవుతారు. తాంత్రిక భాగస్వామ్యం ఇరువురికీ సమ్మతమై ఉండాలి. భాగస్వామ్యంలో ఎటువంటి బలవంతమూ కూడదు. భాగస్వామ్యం పై ఇష్టాయిష్టాలు స్పష్టంగా స్వతంత్రంగా వ్యక్తీకరించుకోగలగాలి.
అయితే బయటి ప్రపంచానికి ఈ పద్ధతి అనైతికంగా, అశ్లీలంగా కనబడుతుంది. కానీ తాంత్రిక భాగస్వామ్యం కేవలం లైంగికానందాన్ని పొందటానికి ఉపయోగించేది కాదని, అమితానందాన్ని స్వంతం చేసుకొనటానికి కేవలం ఇది ఒక దారి అని నవ తంత్రములో ఉన్న ఒక వాదన. శారీరక కలయికే అమితానంద మార్గముగా నవ తంత్రము బోధించదని, తాంత్రిక భాగస్వామ్యం భావోద్రేకాలకి, ఆధ్యాత్మికతకి సంబంధించినదని నవ తంత్రము యొక్క సమర్థన.
తాంత్రిక వివాహము కేవలము హైందవ మతం ప్రకారమో, బౌద్ధ మతం ప్రకారమో ఉండవలసిన అవసరము లేదు. భాగస్వాములకి ఇరువురికీ సమ్మతమైన ఏ వివాహ పద్ధతినైనా నవ తంత్రము అంగీకరిస్తుంది.
ఉదా:
నవ తంత్రము ఎవరైననూ అభ్యసించవచ్చును.
నవ తంత్రము కేవలం వ్యక్తిగత ప్రయోజనాలకే కాక విశ్వశాంతికి కూడా కృషి చేస్తుంది. యుద్ధాలు, దాడులు వంటి వాటి వలన ప్రస్తుత ప్రపంచములో అశాంతి నెలకొన్ని ఉన్నదని; ఇంత అభద్రత గల ఈ సమాజంలో మనిషి ప్రేమ కోసం పరితపించటం ఎక్కువైనదని నవ తంత్రము గుర్తించింది. తన వంతు సాయానికి నడుం బిగించింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడి తర్వాత నవ తంత్ర అనుభవజ్ఞలు బాధితులకి ఆసరాని ఇవ్వటానికి, వారిలో అభద్రతా భావాన్ని తొలగించి ప్రపంచాన్ని ప్రేమమయం చేయటానికి యోగ-నిద్రని అవలంబించటం వంటివి చేశారు. ఇటువంటి వాటి వలన వ్యతిరేక శక్తుల మధ్య ఘర్షణలని తగ్గుతాయని, వాటి మధ్య సమతౌల్యం ఏర్పడుతుందని, ప్రజల మధ్య ప్రేమానుబంధాలు పెంపొందుతాయని వారి నమ్మకం.
నవ తంత్రము పై పాశ్చాత్యులు నిత్యం పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. ఈ పరిశోధనలతో మానవాళికి ఎలా మేలు చేయవచ్చునో ఆలోచిస్తూనే ఉన్నారు.
ఉదా: ఈ క్రింది వ్యాయామాలు రూపొందించారు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.