నల్లమల (ఆంగ్లం : The Nallamala) (సాహిత్యపరంగా."నల్ల కొండలు") (ఇంకనూ; నల్లమల శ్రేణి).గుంటూరు జిల్లాలోని గుతికొండలో నల్లమల అడవులు పుట్టాయి. ఇవి తూర్పు కనుమలలో ఒక భాగం. ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ లోని ఐదుజిల్లాలలో (కర్నూలు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, కడప జిల్లా) ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇవి కృష్ణా నది, పెన్నా నదులకు మధ్యన ఉత్తర-దక్షిణ దిశగా దాదాపు 150 కి.మీ. వరకు విస్తరించి యున్నవి. ఈ ప్రాంతానికి నల్లమల అడవులు అని వ్యవహరిస్తారు. ఈ కొండల శ్రేణికి నల్లమల కొండలు అని పిలుస్తారు. వీటి సగటు ఎత్తు 520 మీటర్లు. భైరానీ కొండ ఎత్తు 929 మీటర్లు, గుండ్లబ్రహ్మేశ్వరం వద్ద ఈ కొండల ఎత్తు 903 మీటర్లు.[1]. ఈ రెండు శిఖరాలూ కంభం పట్టణానికి వాయువ్య దిశన గలవు. ఇంకనూ అనేక శిఖరాలు 800 మీటర్ల ఎత్తు గలవి.[2]. నల్లమల మధ్యభాగంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాతంలో పులుల అభయారణ్యం ఉంది. దీనికే రాజీవ్ అభయారణ్యం అని పేరు. ఇది దేశంలోని 19 పులుల సంరక్షణ కేంద్రాలలో ఒకటి.
నల్లమల కొండలు | |
నల్లమల | |
విస్తృతి | |
బొగడ దగ్గరలోని నల్లమల . దొరబావి ఆకృతుల అవశేషాలను కూడా చూడవచ్చు. | |
దేశం | భారతదేశం |
---|---|
Provinces/States | ఆంధ్ర ప్రదేశ్ |
Highest point | భైరానీ కొండ (శిఖరేశ్వరం) |
- ఎత్తు | 3,047 ft (929 m) |
- ఆక్షాంశరేఖాంశాలు | 15°40′41″N 78°47′10″E |
పొడవు | 90 mi (144.84 km), ఉత్తర-దక్షిణ |
Period | ప్రోటోజోయిక్ |
భూగర్భ శాస్త్రము
నల్లమల శ్రేణులలోని రాళ్ళు కడప జిల్లాలో దాదాపు 20,000 2222 2 ss2z6z6xcx6zc ani chepe adugulo అడుగుల మందాన్ని కలిగివున్నవి.[3]. ఈ రాళ్ళలో ప్రాథమికమైనది క్వార్‌జైట్, ఇవి ఒడుగుదిడుగుల పలకల రూపంలో ఉంది. సాండ్ స్టోన్ కూడా లభ్యమవుతున్నది. ఈ రాళ్ళ సవ్యదిశా లేమి కారణంగా వాణిజ్యానికి అంతగా అనువుగా లేదు. ఈ రాళ్ళు ప్రపంచంలోనే ప్రాచీనత కలిగివున్నవి. ఈ రాళ్ళు అగ్నిశిలల వల్ల ఏర్పడినవి.[2]
వాతావరణం
ఈ నల్లమల అడవులలో సంవత్సరం పొడుగునా, వెచ్చని, వేడిమి వాతావరణాన్ని కలిగి ఉన్నాయి. సరాసరి వర్షపాతం 90 సె.మీ. నైఋతీ-ఋతుపవనాలపై ఆధారపడిన అడవులు. శీతాకాలంలో చల్లగానూ పొడిగాను, సరాసరి ఉష్ణోగ్రత 25 సె.గ్రే.ను కలిగి ఉన్నాయి. ఈ అడవుల వర్షపునీరు గుండ్లకమ్మ నదిలో కలుస్తాయి.
భౌగోళికం, నేల ఉపయోగం
ఈ కొండలు దాదాపు అడవులతో నిండివున్నాయి. ఈ అడవులలో వృక్షసంపదను పెంచలేకపోవడానికి కారణ నీటి కొరత. వ్యవసాయం దాదాపు కనుమరుగు. కొన్ని పల్లెటూర్లవద్ద వ్యవసాయం కానవస్తుంది. ఈ అటవీ ప్రాంతం శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఉంది.[4].
మానవ జీవనం
నీటికొరత కారణంగా జనజీవనం అత్యల్పం. ఈ ప్రాంతంలో నగరాలు పట్టణాలు వెలవక పోవడానికి కారణం ఇదే. ఈ ప్రాంతంలో నంద్యాలపట్టణం పెద్దది.
ఈ ప్రాంతంలో అటవిక తెగలు : చెంచులు నివసిస్తున్నారు.
రవాణా
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రాష్ట్ర ప్రధాన రైలు మార్గం గుంటూరు -గుంతకల్లు నల్లమల అడవులలో గుండా పోతున్నది. మహబూబ్ నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళు రహదారి కూడా ఈ అడవుల పశ్చిమ భాగం నుంచి వెళుతుంది.
రాజీవ్ అభయారణ్యం
నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉన్న 9500 చదరపు అడగులలో సుమారు మూడవ వంతు అనగా 3000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం దటమైన అటవీ ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతంలో ఎటుచూసినా కొండలు, లోయలు, ఎత్తయిన చెట్లు ఉన్నాయి. కౄరమృగాలు ముఖ్యంగా పులులకు ఈ ప్రాంతం ఆవాసంగా ఉంది. ఈ కీకారణ్య ప్రాంతమును ప్రభుత్వం రాజీవ్ అభయారణ్యంగా ప్రకటించింది. దేశంలోని 19 పులుల అభయారణ్యాలలో ఇది ఒకటి. ఇక్కడ 80కి పైగా పులులు సంచరిస్తుంటాయి.[5]
ప్రధాన సంఘటనలు
- గతంలో కొందరు శివస్వాములు శ్రీశైలం వస్తూ ఈ అడవుల్లో దారి తప్పిపోతే హెలికాప్టర్ ద్వారా గాలించారు.
- 2004 లో నక్సలైట్లు ( మావోయిస్టులు ) ను చర్చలకు ప్రభుత్వం పిలిస్తే ఈ అడవుల్లోనుంచే వచ్చారని చెబుతారు.
- సెప్టెంబర్ 2, 2009న ఉదయం గం.9.35 ని.లకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నల్లమల అటవీ ప్రాంతంపై నుంచి ప్రయాణిస్తున్న సమయంలో కూలిపోవడంతో రాజశేఖరరెడ్డితో సహా మొత్తం ఐదుగురు మరణించారు.[6] హెలికాప్టర్ కూలిపోయిన దాదాపు 25 గంటల వరకు ఎలాంటి ఆచూకీ తెలియకపోవడంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి సెప్టెంబరు 3న ఈ ప్రాంతంలోనే హెలికాప్టర్ ప్రమాదానికి గురై కూలిపోయినట్లు గుర్తించి మృతదేహాలను తరలించారు. దీనితో ముఖ్యమంత్రి మృతిచెందిన పావురాలగుట్ట (చింతగుండం) ప్రాంతం వార్తల్లోకి వచ్చింది.
- నల్లమలలో యురేనియం అన్వేషణకు, వెలికితీత కు ప్రయత్నాలు జరిగాయి.
చూడదగ్గ ప్రదేశాలు
- శ్రీశైలం : కృష్ణా నది ఒడ్డున గల శ్రీశైలం ప్రాజెక్టు.
- శ్రీశైల క్షేత్రం
- గుండ్ల బ్రహ్మేశ్వర శిఖరం. జలపాతం. నెమలిగుండం.ఓంకారమ్,మహానంది. రుద్రకోడూరు. పావురాలగుట్ట (చింతగుండం)
- ఆత్మకూరు నుండి నంద్యాలకు వెళ్ళే మార్గములో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివంగత నేత డా:వైయస్ రాజశేకరరెడ్డి గారి జ్ఞాపకార్ధం నల్లకలువ గ్రామానికి సమీపంలో వైయస్ఆర్ స్మృతివనాన్ని నిర్మించినది ఈ ప్రదేశము ఎంతో ఆహ్లాదకరమైన టూరిస్ట్ ప్రదేశము
చిత్ర మాలిక
- నల్లమల్ల అడవుల్లో పొద్దున్న
- నల్లమల్ల అడవుల్లో సాయంకాలం
- కదలివనమ్ వెళ్ళు దరిలో
- చేపలు పట్టే మత్సుకారుల జీవనం
- నల్లమల్ల అడవుల్లో సాయంకాలం
ఇవీ చూడండి
- గుండ్లకమ్మ నది
- ప్రకాశం జిల్లా
- కర్నూలు డివిజన్
- గుంటూరు డివిజన్
పాద పీఠికలు
వెలుపలి లంకెలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.