తెలంగాణ, సిద్దిపేట జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
ధూలిమిట్ట మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట జిల్లా లోని మండలం.[1][2] 2016 లో చేసిన తొలి పునర్వ్యవస్థీకరణలో కాకుండా ఆ తరువాత 2020 డిసెంబరు 10న కొత్తగా ఏర్పడింది.[3][4] దానికి ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[5] ప్రస్తుతం ఈ మండలం హుస్నాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా సిద్దిపేట రెవెన్యూ డివిజనులో ఉండేది. ఈ మండలంలో 8 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం, ధూలిమిట్ట.
ధూలిమిట్ట మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, ధూలిమిట్ట మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18.002846°N 79.070202°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సిద్దిపేట జిల్లా |
మండల కేంద్రం | ధూలిమిట్ట |
గ్రామాలు | 8 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 181 km² (69.9 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 38,731 |
- పురుషులు | 19,255 |
- స్త్రీలు | 19,476 |
పిన్కోడ్ | 506367 |
పునర్య్వస్థీకరణ తరువాత దూళిమిట్ట గ్రామం సిద్దిపేట జిల్లాలోని మద్దూరు మండలం పరిధిలో ఉంది.మద్దూరు మండలం లోని 8 గ్రామాలు విడగొట్టి ఈ గ్రామం మండల ప్రధాన కేంద్రంగా దూళిమిట్ట మండలం అనే పేరుతో కొత్త మండలంగా 2020 డిసెంబరు 10 నుండి అమలులోనికితెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[6][7] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 181 చ.కి.మీ. కాగా, జనాభా 38,731. జనాభాలో పురుషులు 19,255 కాగా, స్త్రీల సంఖ్య 19,476. మండలంలో 9,143 గృహాలున్నాయి.[8]
ఈ మండలంలో 8 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[9]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.