దేశపాత్రునిపాలెం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరంలోని ఒక శివారు ప్రాంతం. From Wikipedia, the free encyclopedia
దేశపాత్రునిపాలెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరంలోని ఒక శివారు ప్రాంతం.[1] మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలన పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతం విశాఖపట్నం ఉక్కు కర్మాగారంకు అతి సమీపంలో ఉంది.[2] ఆహ్లాదకరమైన నివాస కాలనీగా ఉన్న ఈ ప్రాంతం నుండి గాజువాకకు కలుపబడి ఉంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది.[3]
దేశపాత్రునిపాలెం | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17.638844°N 83.124271°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 531021 |
Vehicle registration | ఏపి-31,32 |
భౌగోళికం
ఇది 17.638844°N 83.124271°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
సమీప ప్రాంతాలు
ఇక్కడికి సమీపంలో గొర్లెవానిపాలెం, స్నేహపురి కాలనీ, స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్, స్టీల్ ప్లాంట్ కాలనీ, సింహాద్రి ఎన్క్లేవ్, చింతలపాలెం, దెందేరు, సంతపాలెం, రెల్లి, తుమ్మికపల్లి మొదలైన ప్రాంతాలు ఉన్నాయి. దేశపాత్రునిపాలెం చుట్టూ దక్షిణాన పెందుర్తి మండలం, తూర్పు వైపు ఆనందపురం మండలం, ఉత్తరం వైపు లక్కవరపుకోట మండలం, పశ్చిమాన కె. కోటపాడు మండలం ఉన్నాయి.[4]
రవాణా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో దేశపాత్రునిపాలెం మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్, స్టీల్‌ప్లాంట్ సెక్టార్, మద్దిలపాలెం, రాంబిల్లి, వాడ చీపురుపల్లి, కలెక్టర్ కార్యాలయం, దోసూరు మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో దువ్వాడ రైల్వే స్టేషను, తాడి రైల్వే స్టేషను ఉన్నాయి.[5]
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.