From Wikipedia, the free encyclopedia
దేవిడి ఇక్బాల్ ఉద్-దౌలా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న ఒక రాజభవనం.[1] నిజాం రాజుల వారసత్వ కట్టడం. నిజాం ప్రభువు సర్ వికార్ ఉల్ ఉమ్రా (ఇక్బాల్ ఉద్-డౌలా)కు చెందిన దేవిడి.[2] ఈ చారిత్రక నిర్మాణం ప్రస్తుతం కూలిపోయే స్థితిలో ఉంది.[3][4] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
ఈ భవనాన్ని నిజాం రాజు నవాబ్ ఫక్రుద్దీన్ నిర్మించాడు. యూరోపియన్ దేశాలకు చెందిన చేతివృత్తుల వారు ఈ నిర్మాణాన్ని పూర్తి చేసారు. '20వ శతాబ్దం ప్రారంభంలో నిజాం రాజు బేగంపేటలోని పైగా ప్యాలెస్‌కి నివాసం మార్చిన తర్వాత ఈ రాజభవనం నిరుపయోగంగా మారిందని' ఒమర్ ఖలిది రాసిన 'ఏ గైడ్ టు ఆర్కిటెక్చర్ ఇన్ హైదరాబాద్, డెక్కన్, ఇండియా'లో రాయబడింది.[5]
ఈ భవనంలో నాలుగు తొట్టెలు, ఒక సెంట్రల్ సిస్టర్న్, అనేక గదులు ఉన్నాయి. వీటిలో ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకతను కలిగివున్నాయి. జెనానా, స్లీపింగ్ క్వార్టర్స్, డైనింగ్, డ్రాయింగ్ రూమ్‌లు, ఆఫీసులు కూడా ఉన్నాయి. లోపలి భాగంలోని తలుపుల చుట్టూ, పై భాగంలోనూ, ఒక గది నుఏండి మరో గదికి వెళ్ళే ద్వారా తోరణంకి వివిధ ఆకృతుత్లో డిజైనులు చెక్కబడి ఉన్నాయి.[6]
ఈ భవనం సినిమా షూటింగులకు తరచుగా ఉపయోగిస్తుంటారు. షూటింగ్ చేసేటపుడు రోలింగ్ క్రేన్లు, ఇతర భారీ పరికరాల బరువుల వల్ల భవన ప్రధాన ప్రాంగణం శిథిలమైపోయి, పగిలిపోయింది. భవనం గోడ పక్కన ఒక చెత్త డబ్బా ఉంచబడింది. ఆహారం కోసం వచ్చిన ఎలుకలు ఆ గోడలను త్రవ్వి నాశనం చేస్తున్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.