హేతువాది, జంతుశాస్త్ర నిపుణులు From Wikipedia, the free encyclopedia
దేవరాజు మహారాజు జీవ శాస్త్ర ప్రొఫెసర్. కవిగా, కథా రచయితగా, నాటక కర్తగా, అనువాదకుడిగా, కాలమిస్టుగా, వ్యాసకర్తగా అందరికి పరిచయం. సమాజంలో శాస్త్రీయ అవగాహనను పెంచడానికి సరళ విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు, వ్యంగ్య రచనలు చేశాడు. ఆయన 2021 సంవత్సరానికి గాను ‘నేను అంటే ఎవరు?’ నాటకానికి బాల సాహిత్య పురస్కారం దక్కింది.[1]
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
దేవరాజు మహారాజు | |
---|---|
జననం | దేవరాజు మహారాజు ఫిబ్రవరి 21, 1951 వరంగల్ జిల్లా కోడూరు |
నివాస ప్రాంతం | Hyderabad |
ప్రసిద్ధి | హేతువాది, జంతుశాస్త్ర ప్రొఫెసర్, కవి, విమర్శకుడు, కథా రచయిత, బాల సాహిత్య కవి |
పదవి పేరు | ప్రొఫెసర్ |
భార్య / భర్త | క్రిషి (కృష్ణకుమారి). |
డా.దేవరాజు మహారాజు ఫిబ్రవరి 21, 1951 న వరంగల్ జిల్లా కోడూరు లో జన్మించారు. స్వగ్రామం వడపర్తి, భువనగిరి, హైదరాబాద్‌లలో వీరి విద్యాభ్యాసం కొన సాగింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1975లో జంతుశాస్త్రంలో ఎంఎస్సీ, 1979లో డాక్టరేట్ అందుకున్నారు. జువాలజీ ఫ్రొపెసర్‌గా పరాన్న జీవులపై పరిశోధనలు చేస్తూ, చేయిస్తూ పిజి విద్యార్థులకు, పరిశోధన విద్యార్థులకు 28 ఏళ్లు మార్గదర్శనం చేసారు. తెలంగాణా ప్రజల భాషలో కవిత కథ చెప్పి మెప్పించి కవిగా, కథకుడిగా స్థిరపడ్డారు. జానపద సాహిత్య పరిశీలన చేశారు. విజ్ఞాన గ్రంథాలను ప్రచురించారు. తెలుగు అకాడమీ పుస్తకాలకు రచయితగా, సంపాదకుడిగా వ్యవహరించారు. భారతీయ వారసత్వం, సంస్కృతి, విజ్ఞాన నాగరికతలు డిగ్రీ పాఠ్య గ్రంథమే అయినా సంపాదకుడిగా దానిని యూపీఎస్సీ స్థాయి పోటీ పరీక్షలకు పనికివచ్చే విధంగా తీర్చిదిద్దారు. ఎయిడ్స్‌పై అవగాహన కోసం తెలుగులో తొలి పుస్తకం రాసి సామాజిక బాధ్యత కవికి ఉండాలని నిరూపించారు. దేవరాజు జాన్ ఎర్నస్ట్ స్టెయిన్ బెక్ నవల 'దిపెరల్'ను తెలుగు పాఠకులకు 'మంచి ముత్యం'గా అoదించారు.
దేవరాజు మహారాజు 150 మంది భారతీయ కవుల్ని, 50 మంది మరాఠి దళిత కవుల్ని కవితాభారతి, మట్టిగుండె చప్పుళ్లు కవితా సంకలనాల ద్వారా పరిచయం చేశారు. అలాగే ఒరియా మహాకవి సీతాకాంత్ మహాపాత్ర కవితలను ఎన్నింటినో అనువదించారు. హిందీ కవి హరివంశ్రాయ్ బచ్చన్ 'మధుశాలి'ని తెలుగులోకి అనువదించారు. 70 మంది భారతీయ కథానికా రచయితల్ని (హరివిల్లు, ఆంధ్రప్రభ వార పత్రిక 1991-92) వారి కథలతో పరిచయం చేశారు. భారతీయ భాషల రచయితలను పరిచయం చేస్తూ స్త్రీవాద ధోరణిలో వెలువడిన వారి కథానికల్ని తెలుగు పాఠకులకందించారు. పిల్లల కోసం రాసిన చైనా జానపద కథలు నాలుగు పుస్తకాలుగా వెలువడినాయి. భారతీయ జానపదం 1994-96లో తెలుగులో అక్షరాలతో దేవరాజు మహారాజు చేసిన అనువాదాలు, పరిచయాలు వివిధ పత్రికలలో ప్రచురించబడుతున్నాయి.
గాయపడ్డ ఉదయం వచన కవితకు తెలుగు విశ్వవిద్యాలయ ప్రధాన అవార్డును 1991లో పొందారు.హరివంశరాయ్ బచ్చన్ కావ్యాన్ని ఆంధ్రప్రదేశ్ హింది ఆకాడమి వారి సౌజన్యంతో ముద్రించారు. అంతేకాకుండా ప్రపంచ ప్రఖ్యాత కథకుల కథల్ని అనువదించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉగాది సత్కారం, తెలుగు విశ్వవిద్యాలయ కవితా పురస్కారం, దాశరథి దంపతుల సత్కారం, తొలి ఎక్స్‌రే పురస్కారం, సురమౌళి అవార్డు, డాక్టర్ పరచుచూరి రాజారాయ్ సాహిత్య పురస్కారం వంటి పురస్కారాలనం దుకున్నారు డాక్టర్ దేవరాజు మహారాజు. తొలిదశలో కథల పోటీల్లో పలు బహుమతులు అందుకున్నారు. ఒక దశాబ్ది కాలంగా నేషనల్ బుక్ట్రస్ట్వారికి (న్యూఢిల్లి) సలహా సంఘ సభ్యులుగా యున్నారు.
దేవరాజు మహారాజు ఆగష్టు 2021లో దేవులపల్లి రామానుజరావు సాహిత్య పురస్కారం అందుకున్నాడు.[2] అదే ఏడాది, మహారాజు రాసిన ‘నేను అంటే ఎవరు?’ నాటకానికి కేంద్ర సాహిత్య అకాడమీ వారి బాల సాహిత్య పురస్కారం సాధించింది.[3]
Seamless Wikipedia browsing. On steroids.