Remove ads
ఒడిశా రాష్ట్రం దేవగఢ్ జిల్లా ముఖ్యపట్టణం From Wikipedia, the free encyclopedia
దేవగఢ్ ఒడిషా రాష్ట్రం లోని పట్టణం. 1994 జనవరి 1 న సంబల్పూర్ జిల్లా నుండి విభజించి ఏర్పాటు చేసిన దేబగర్ జిల్లాకు ఇది ముఖ్యపట్టణం.
దేవగఢ్ | |
---|---|
— పట్టణం — | |
దేశం | India |
రాష్ట్రం | ఒడిశా |
జిల్లా | దేవగఢ్ |
జనాభా (2011) | |
- మొత్తం | 52,390 |
భాషలు | |
- అధికారిక | ఒరియా |
Time zone | IST (UTC+5:30) |
PIN | 768108,768109 |
Vehicle registration | OD-28 |
UN/LOCODE | IN DEB |
Nearest city(s) | Sambalpur, Rourkela & Bhubaneswar |
వెబ్సైటు | http://deogarh.nic.in[1] |
దేవగఢ్ 21.53°N 84.73°E వద్ద, [2] సముద్రమట్టం నుండి 192 మీ. ఎత్తున ఉంది.
దేవగఢ్ పట్టణం NH-6లో సంబల్పూర్ నగరానికి తూర్పున 90 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి నెం.6 అంతర్-ప్రాంతీయ వాణిజ్యానికి ప్రధాన మార్గం.
1. వైమానిక: దేవగఢ్ కు సమీపంలో ఉన్న విమానాశ్రయాలు భువనేశ్వర్ (265 కి.మీ.), రాయ్పూర్ (376 కి.మీ.), ఝార్సుగూడా (98 కి.మీ.) .
2. రైలు: దేవగఢ్కు సమీప రైలు స్టేషన్లు సంబల్పూర్ (90 కి.మీ.), హౌరా-ముంబై మార్గం లోని రూర్కెలా-జార్సుగూడ సెక్షన్ లోని బమ్రా (103 కి.మీ.), ఝార్సుగూడా (98 కి.మీ.), రూర్కెలా (115 కి.మీ.)
3. రోడ్డు: ముంబయి - కోల్కతా NH6 ( AH46 లో భాగం), రాయ్పూర్ - చండీఖోలే NH200 లు పట్టణం గుండా పోతున్నాయి. నగరం సంబల్పూర్ నుండి 90 కి.మీ., రూర్కెలా నుండి 115 కి.మీ. భువనేశ్వర్ నుండి 265 కి.మీ. దూరంలో ఉంది.
జనగణన ప్రకారం, [3] దేవగఢ్ జనాభా 52,390. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48%. దేవగఢ్ సగటు అక్షరాస్యత 67%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషుల్లో అక్షరాస్యత 74% కాగా, స్త్రీలలో ఇది 59%. పట్టణ జనాభాలో 12% మంది 6 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.