Remove ads
From Wikipedia, the free encyclopedia
ఈ శతకములో కృష్ణా దేవకీనందనా అనే మకుటముతో 108 పద్యాలు ఉన్నాయి[1]. నామమాత్రము విశిష్టమై మఱుగున పడి ఉన్న ఈ శతకాన్ని గద్వాల సంస్థానములోని పుస్తక భాండాగారములో తాళపత్ర లిఖితమై ఉండుట చూచి గద్వాల మహారాణి ముద్రింపించి ప్రకటించింది. ఈ శతకము ద్రాక్షాపాకములో, వైదర్భీరీతిలో, పండిత పామరుల హృదయంగమంగా ఉంది.
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
దేవకీనందన శతకము | |
---|---|
కవి పేరు | వెన్నెలకంటి జన్నయ్య |
మొదటి ప్రచురణ తేదీ | 1450 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మకుటం | కృష్ణా దేవకీనందనా! |
విషయము(లు) | భక్తి |
పద్యం/గద్యం | పద్యం |
ఛందస్సు | శార్దూల మత్తేభములు |
ప్రచురణ కర్త | గద్వాల మహారాణి |
ప్రచురణ తేదీ | 1929బ్ |
మొత్తం పద్యముల సంఖ్య | 108 |
శా|| పాత్రాపాత్రవివేకముల్ సమసె పాపం బెచ్చెఁబుణ్యంబులే
మిత్రఘ్నత్వము కల్లలాడుటలు స్వామిద్రోహమున్ కొండెమున్
ధాత్రిం బూజ్యములయ్యె సాధువుల చందంబెట్లు రక్షించెదో
సత్రాజిచిత్తనయామనోరమణకృష్ణా, దేవకీనందనా!
శా|| అందెల్ చిన్ని పసిండి గజ్జెలును మ్రోయన్ మేఖలా ఘంటికల్
క్రందై తోఁపఁగ రావిరేకు నుదుటన్ గన్పింప గోపాంగనా
నందంబొందఁగ వెన్నముద్దలకునై వర్తించు నీ బాల్యపున్
చందంబాది విజుల్ నుతింపఁదగుఁగృష్ణా, దేవకీనందనా!
శా|| నీడల్ దేరెడు చెక్కుటద్దములతో నిద్దంపునెమ్మోముతో
కూడీకూడని చిప్పకూఁకటులతో గోపార్భక శ్రేణితో
వ్రీడాశూన్య కటేరమండలముతో వ్రేపల్లెలో నీవు నాఁ
డాడేశైశవమూర్తినేఁ దలఁతుఁగృష్ణా, దేవకీనందనా!
మ|| అమరుల్ పద్మజువ్రాఁత దాఁట రెవఁడొక్కబ్దంబు పెడయ్యె దు
ర్దమదోర్దండ పటు ప్రతాపనిజసంరంభామరానిక వి
క్రమ దుర్వారగజాసుర ప్రళయమింకం జేసిన ట్టీశ్వరున్
సమరక్షోణిజయించు నర్జునుఁడు కృష్ణా, దేవకీనందనా!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.