From Wikipedia, the free encyclopedia
ది హండ్రెడ్ అనేది, ప్రొఫెషనల్ ఫ్రాంచైజీ ఆధారిత 100-బంతుల క్రికెట్ టోర్నమెంటు. ఇందులో ఇంగ్లండ్, వేల్స్‌లోని ప్రధాన నగరాల్లో ఉన్న ఎనిమిది పురుషుల జట్లు, ఎనిమిది మహిళల జట్లూ ఆడతాయి. ఈ టోర్నమెంటును ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB) నిర్వహిస్తోంది. మొదటి టోర్నమెంటు 2021 జూలై, ఆగస్టుల్లో జరిగింది.
ది హండ్రెడ్ | |
---|---|
దస్త్రం:File:The Hundred (cricket) svg logo.svg | |
దేశాలు |
|
నిర్వాహకుడు | ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ |
ఫార్మాట్ | 100-బంతుల క్రికెట్ |
తొలి టోర్నమెంటు | 2021 |
చివరి టోర్నమెంటు | 2023 |
టోర్నమెంటు ఫార్మాట్ | రౌండ్ రాబిన్ లీగ్, ప్లే ఆఫ్స్ |
జట్ల సంఖ్య |
|
ప్రస్తుత ఛాంపియన్ |
|
అత్యంత విజయవంతమైన వారు |
|
2023 |
ఒక్కో మ్యాచ్ దాదాపు రెండున్నర గంటలపాటు సాగుతుందనే అంచనాతో ఈ ఫార్మాట్‌ను రూపొందించారు.[1] స్కై స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానెల్లో అన్ని మహిళల మ్యాచ్‌లు, కొన్ని పురుషుల మ్యాచ్‌లు ఉచితంగా ప్రసారం చేయడానికి అందుబాటులో ఉండగా, BBC పోటీలను ఉచితంగా ప్రసారం చేసింది.[2][3]
దాదాపు అన్ని మ్యాచ్‌లూ ఒకే రోజు, ఒకే వేదికపై బ్యాక్-టు-బ్యాక్ డబుల్-హెడర్లుగా జరుగుతాయి. ఒక టికెట్టు మీద, పురుషుల, మహిళల గేమ్‌లు రెండూ చూడవచ్చు. పురుషుల జీతాలు మహిళల కంటే నాలుగు రెట్లు ఎక్కువ. కానీ టోర్నమెంటు ప్రైజ్ మనీ మాత్రం ఇద్దరికీ సమానంగానే ఉంటుంది.[4][5][6]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాదిరిగానే కొత్త, నగర-ఆధారిత క్రికెట్ ట్వంటీ 20 పోటీని మొదట 2016 సెప్టెంబరులో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్రతిపాదించింది. 18 ఫస్ట్-క్లాస్ కౌంటీలు, ప్రొఫెషనల్ క్రికెటర్స్ అసోసియేషన్ (PCA), మేరిల్బోన్ క్రికెట్ క్లబ్ (MCC) ల మధ్య ప్రారంభ చర్చల తర్వాత, పోటీకి అనుకూలంగా 16–3తో ఓట్లు వచ్చాయి.[7] 2017 ఏప్రిల్ 26న, ECB సభ్యులు కొత్త పోటీతో ముందుకు సాగడానికి 38–3తో ఓటు వేశారు.[8]
అప్పటికే ప్రబలంగా వ్యాపించి ఉన్న ట్వంటీ20 ఆకృతి నుండి పోటీని పూర్తిగా కొత్త తరహా క్రికెట్‌కి మార్చాలనే ఆలోచనను మొదటగా ECB చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సంజయ్ పటేల్, 2017 అక్టోబరులో సీనియర్ క్రికెట్ అధికారులతో జరిగిన ప్రైవేటు సమావేశంలో ప్రతిపాదించాడు. పోటీని ఆకర్షించాలనుకునే కొత్త ప్రేక్షకులకు వంద బంతుల ఆకృతి సులభంగా అర్థమయ్యేలా ఉంటుందని అతను భావించాడు.[9]
మాజీ ఇంగ్లండ్ ఆటగాడు, నార్తర్న్ సూపర్‌చార్జర్స్ హెడ్ కోచ్ డాని హాజెల్ మాట్లాడుతూ, ఈ టోర్నమెంటు మహిళల ప్రాంతీయ జట్ల నిర్మాణంలో పెట్టుబడి పెట్టేందుకు సహాయపడుతుందని, దేశీయ క్రీడాకారులకు ఈ టోర్నమెంటు ఒక ముఖ్యమైన అభ్యాస అనుభవంగా ఉంటుందనీ పేర్కొంది.[10] COVID-19 మహమ్మారి కారణంగా టోర్నమెంటు ఒక సంవత్సరం ఆలస్యం అయింది.
ది హండ్రెడ్ లాభదాయకత చర్చనీయాంశమైంది. 2016లో, డెలాయిట్ రూపొందించిన నివేదికలో ఈ టోర్నమెంటు సంవత్సరానికి £27 మిలియన్ల లాభం పొందుతుందని అంచనా వేసింది. ECB 2022లో ది హండ్రెడ్ £11.8m లాభాన్ని సంపాదించిందని నివేదించింది. 2023లో చార్టర్డ్ అకౌంటెంట్ అయిన ఫానోస్ హీరా, ECB చైర్మన్ రిచర్డ్ థాంప్సన్ సహాయంతో రూపొందించిన నివేదిక ప్రకారం, మొదటి రెండు సంవత్సరాలలో £9 మిలియన్ల నష్టం వచ్చింది. ఈ గణాంకాల్లో కౌంటీలకూ, మేరిల్బోన్ క్రికెట్ క్లబ్‌కూ వాగ్దానం చేసిన £24.7 మిలియన్లు కలపలేదు. ECB చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్డ్, స్కై స్పోర్ట్స్‌తో 2028 వరకు ఉన్న ప్రస్తుత ఒప్పంద కాలాన్ని దాటి ఈ టోర్నమెంటు "స్థిరంగా నిలబడిపోతుందని" భావిస్తున్నట్లు చెప్పాడు.
ది హండ్రెడ్ మూడవ సీజన్ కోసం, 100-బంతుల క్రికెట్ పోటీ మార్వెల్ కామిక్స్‌తో కలిసి పనిచేస్తున్నట్లు ప్రకటించారు. హల్క్, ఐరన్ మ్యాన్, బ్లాక్ పాంథర్ వంటి మార్వెల్ పాత్రలను కొత్త ప్రేక్షకులకు పోటీని పరిచయం చేయడానికి మొత్తం ఎనిమిది జట్లలోని ఆటగాళ్లతో డిజిటల్ కంటెంట్‌లో ప్రదర్శించబడింది.
వంద-బంతుల క్రికెట్ అనేది పరిమిత ఓవర్ల క్రికెట్ లోనే ఒక రూపం. ఇరు జట్లూ ఒక్కొక్కటి 100 బంతులతో కూడిన ఒకే ఇన్నింగ్స్ ఆడతాయి.[11] ఆట వ్యవధి దాదాపు రెండున్నర గంటల పాటు ఉంటాయి.[12]
ప్రధాన మినహాయింపులతో మామూలు క్రికెట్ చట్టాలు దీనికీ వర్తిస్తాయి. ఆట లోని ప్రధానమైన అంశాలు ఇవి:[13]
పాఠశాల వేసవి సెలవుల్లో ఎనిమిది నగర-ఆధారిత జట్లు పోటీపడతాయి. పురుషుల, మహిళల మ్యాచ్‌లన్నీ ఒకే రోజు ఒకే మైదానంలో జరుగుతాయి. టోర్నీ లీగ్ దశలో మొత్తం 32 మ్యాచ్‌లు ఉంటాయి. ప్రతి జట్టు సొంత మైదానంలో నాలుగు మ్యాచ్‌లు, ప్రత్యర్థుల మైదానాల్లో నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందులో ప్రతి ఇతర జట్టుతో ఒక మ్యాచ్, తమ సమీప ప్రాంతీయ ప్రత్యర్థులతో రెండవ బోనస్ మ్యాచ్ ఉంటుంది.[14]
లీగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కి చేరుకుంటుంది. రెండవ, మూడవ స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ (లేదా సెమీ-ఫైనల్)లో పోటీపడతాయి, విజేత జట్టు ఫైనల్‌కి చేరుకుంటుంది.[15]
కేవలం ఏడు ప్రధాన నగరాల్లోని జట్లతో పూర్తిగా కొత్త ఫార్మాట్ క్రికెట్‌ను రూపొందించాలనే నిర్ణయం పట్ల క్రికెట్ అభిమానులు భిన్నాభిప్రాయాలను ప్రకటించారు. కొందరు కొత్త ఆకృతిని స్వాగతించగా, మరి కొందరు దానికి పూర్తి వ్యతిరేకత చూపారు. ఇంకొందరు, జాగ్రత్తతో కూడిన ఆశావాదం వెలిబుచ్చారు. దాని వలన వచ్చే చిక్కుల గురించి కొందరు సందేహాలు వెలిబుచ్చారు. చారిత్రిక కౌంటీ క్రికెట్ నిర్మాణాన్ని ఇష్టపడే వారిలో చాలా మంది, ది హండ్రెడ్ దాని అస్తిత్వానికి ముప్పు అని భావించారు. ఇంగ్లీష్ దేశీయ క్రికెట్లో మార్పు అవసరమని అంగీకరించినవారిలో కూడా చాలామంది, ఆట లోని భాషలో, ఆకృతిలో సమూలమైన మార్పులు తెచ్చిన ది హండ్రెడ్ గేమ్‌ను సరైన మార్పు అని భావించ లేదు.
కొంతమంది ప్రస్తుత ఇంగ్లండ్ ఆటగాళ్లు ది హండ్రెడ్ పట్ల సానుకూలత ప్రకటించారు. ఆ సమయంలో ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్, ECB ప్రణాళికలను స్వాగతించాడు, ఇది పూర్తిగా కొత్త ప్రేక్షకులను ఆకర్షిస్తుందని అతడు భావించాడు.[16] వన్డే, టీ20 కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.[17] టీ20 మాజీ కెప్టెన్ స్టువర్ట్ బ్రాడ్ కొత్త ఫార్మాట్ పట్ల చాలా ఆశాజనకంగా ఉన్నానని చెప్పాడు.[18] మైఖేల్ వాన్ బ్రాడ్ వ్యాఖ్యలతో ఏకీభవించాడు. ఇది బ్రాడ్కాస్టర్లకు ఆకర్షణీయమైన భావనగా ఉంటుందని భావించాడు. మైఖేల్ అథర్టన్ అయితే T20 మ్యాచ్, మూడు గంటలలో పూర్తవదు, ది హండ్రెడ్‌తో అది సాధ్యమే అన్నాడు.[19]
అయితే, మాజీ MCC చీఫ్ కీత్ బ్రాడ్షా మాట్లాడుతూ, ఈ 100-బంతుల టోర్నమెంటు, "ఏదో ఒకటి కనిపెట్టాలి కాబట్టి కనిపెట్టినట్లు" కాకుండా ఉండాలని ఆశిస్తున్నానని అన్నాడు. ఈ కొత్త ఫార్మాట్ వలన ECB, T20 బూమ్‌ను ఉపయోగించుకోలేకపోతుందని ఆందోళన వ్యక్తం చేశాడు.[20] ఇంగ్లాండ్ అండ్ వేల్స్ ప్రొఫెషనల్ క్రికెటర్స్ అసోసియేషను, మొత్తమ్మీద ఈ టోర్నమెంటు గురించి ఆటగాళ్లు "ఓపెన్ మైండ్‌తో" ఉన్నారని ప్రకటించింది.[21] భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, క్రికెట్ వాణిజ్యీకరణ గురించిన ఆందోళనలను ఉదహరించాడు. ఈ కొత్త వెర్షన్‌కు అతను సంపూర్ణంగా అనుకూలంగా లేడు.[22]
జట్లను, బ్రాండింగునూ ప్రకటించిన తర్వాత, స్థూలకాయ వ్యతిరేక సమూహాలు స్నాక్ ఫుడ్ కంపెనీ KP స్నాక్స్ వారి స్పాన్సర్‌షిప్‌ను విమర్శించాయి.[23]
సోషల్ మీడియా స్పందన కూడా రెండువైపులా ఉంది. 2019 అక్టోబరు 20 న ఆటగాళ్ళను తీసుకునే సందర్భంలో, ట్విట్టరులో "#OpposeThe100" అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.[24] పోటీ ఆకృతిని చూసి నిరాశ చెందిన క్రికెట్ అభిమానులు నిరసన వినిపించారు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో "గట్టి వ్యతిరేకత" కనబడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం ప్రతికూలత తక్కువగా ఉంది,[9]
మహిళా క్రికెటర్లు కొత్త ఆకృతి పట్ల, ప్రత్యేకించి ఒకే ప్రైజ్ మనీతో రెండు పోటీలను సమాంతరంగా నిర్వహించాలనే నిర్ణయం పట్ల చాలా ఉత్సాహం చూపారు. చాలా మంది మొదటిసారి ప్రొఫెషనల్‌గా మారడానికి వీలు కల్పించారు.[25]
ప్రారంభ సీజన్ ముగింపులో, 55% టిక్కెట్లను మునుపెన్నడూ కొనుగోలు చేయని వ్యక్తులు కొనుగోలు చేశారనీ, టెలివిజన్ వీక్షణ, మ్యాచ్ హాజరు గణాంకాలకు సంబంధించి, ముఖ్యంగా మహిళల మ్యాచ్‌లకు సంబంధించి అనేక రికార్డులు సృష్టించబడ్డాయనీ తేలింది. ఇంగ్లండ్ మాజీ మహిళా కెప్టెన్ షార్లెట్ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ ఈ టోర్నమెంటు, "ఈ దేశంలో మహిళల క్రికెట్‌ను ఒంటిచేత్తో మార్చేసింది" అని అంది.[26]
రెండవ సీజన్ ముగింపులో, టిక్కెట్ విక్రయాలు 5,00,000 వద్ద స్థిరంగా ఉన్నాయని ప్రకటించారు. అయితే ప్రారంభ సీజన్‌తో పోలిస్తే ప్రసారాలకు వచ్చిన వీక్షణ గణాంకాలు దాదాపు 2 మిలియన్లు తగ్గాయి. 16 మిలియన్ల నుండి 14 మిలియన్లకు పడిపోయాయి.[27]
ఎనిమిది జట్లను నిర్ధారించడానికి ముందు, ఈ జట్లకు, దీర్ఘకాలంగా ఉనికిలో ఉన్న కౌంటీ జట్ల కంటే భిన్నమైన గుర్తింపు ఉంటుందనీ నగరాలు, కౌంటీలు లేదా వేదికల పేరు పెట్టరనీ తెలియవచ్చింది.[28][29] 2019 మేలో, జట్ల పేర్లు ఇవి అని వెల్లడించారు:[30]
జట్టు పేరు | హోమ్ గ్రౌండ్ | లింకైన కౌంటీలు | మహిళా జట్టు కెప్టెన్ [31] | పురుషుల జట్టు కెప్టెన్ [31] |
---|---|---|---|---|
బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ | ఎడ్జ్‌బాస్టన్ (బర్మింగ్‌హామ్, వెస్ట్ మిడ్లాండ్స్) | వార్విక్షైర్, వోర్సెస్టర్షైర్ | ఎవెలిన్ జోన్స్ [32] | మొయిన్ అలీ |
లండన్ స్పిరిట్ | లార్డ్స్ (సెయింట్ జాన్స్ వుడ్, గ్రేటర్ లండన్) | ఎసెక్స్, మిడిల్సెక్స్, నార్తాంప్టన్‌షైర్ | హీథర్ నైట్ [32] | డాన్ లారెన్స్ [33] |
మాంచెస్టర్ ఒరిజినల్స్ | ఓల్డ్ ట్రాఫోర్డ్ (స్ట్రెట్ఫోర్డ్, గ్రేటర్ మాంచెస్టర్) | లాంక్షైర్ | సోఫీ ఎక్లెస్టోన్ [32] | జోస్ బట్లర్ |
ఉత్తర సూపర్ఛార్జర్స్ | హెడింగ్లీ (లీడ్స్, వెస్ట్ యార్క్‌షైర్) | డర్హామ్, యార్క్‌షైర్ | హోలీ ఆర్మిటేజ్ [32] | వేన్ పార్నెల్ [34] |
ఓవల్ ఇన్విన్సిబుల్స్ | ది ఓవల్ (కెన్నింగ్టన్, గ్రేటర్ లండన్) | కెంట్, సర్రే | డేన్ వాన్ నీకెర్క్ [32] | సామ్ బిల్లింగ్స్ |
సదరన్ బ్రేవ్ | రోజ్ బౌల్ (సౌతాంప్టన్, హాంప్‌షైర్) | హాంప్‌షైర్, ససెక్స్ | అన్య ష్రుబ్సోల్ [32] | జేమ్స్ విన్స్ |
ట్రెంట్ రాకెట్స్ | ట్రెంట్ బ్రిడ్జ్ (వెస్ట్ బ్రిడ్ఫోర్డ్, నాటింగ్‌హామ్‌షైర్) | డెర్బీషైర్, లీసెస్టర్‌షైర్, నాటింగ్‌హామ్‌షైర్ | నాట్ స్కివర్-బ్రంట్ [32] | లూయిస్ గ్రెగొరీ |
వెల్ష్ ఫైర్ / ట్యాన్ సిమ్రీగ్ | సోఫియా గార్డెన్స్ (కార్డిఫ్, సౌత్ గ్లామోర్గాన్) | గ్లామోర్గాన్, గ్లౌసెస్టర్షైర్, సోమర్సెట్ | టామీ బ్యూమాంట్ [32] | టామ్ అబెల్ |
బుతువు | తేదీ | వేదిక | విజేత | గెలుపు మార్జిన్ | ద్వితియ విజేత |
---|---|---|---|---|---|
2021 | ఆగస్టు 21 | లార్డ్స్, లండన్ | ఓవల్ ఇన్విన్సిబుల్స్ | 48 పరుగుల తేడాతో విజయం సాధించింది | సదరన్ బ్రేవ్ |
2022 | సెప్టెంబరు 3 | లార్డ్స్, లండన్ | ఓవల్ ఇన్విన్సిబుల్స్ | 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది | సదరన్ బ్రేవ్ |
2023 | ఆగస్టు 27 | లార్డ్స్, లండన్ | సదరన్ బ్రేవ్ | 34 పరుగుల తేడాతో విజయం సాధించింది | నార్దర్న్ సూపర్ఛార్జర్స్ |
బుతువు | తేదీ | వేదిక | విజేత | గెలుపు మార్జిన్ | ద్వితియ విజేత |
---|---|---|---|---|---|
2021 | ఆగస్టు 21 | లార్డ్స్, లండన్ | సదరన్ బ్రేవ్ | 32 పరుగుల తేడాతో విజయం సాధించింది | బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ |
2022 | సెప్టెంబరు 3 | లార్డ్స్, లండన్ | ట్రెంట్ రాకెట్స్ | 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది | మాంచెస్టర్ ఒరిజినల్స్ |
2023 | ఆగస్టు 27 | లార్డ్స్, లండన్ | ఓవల్ ఇన్విన్సిబుల్స్ | 14 పరుగుల తేడాతో విజయం సాధించింది | మాంచెస్టర్ ఒరిజినల్స్ |
|
|
స్కోర్ | ఆటగాడు | జట్టు | వ్యతిరేకత | వేదిక | తేదీ | Ref. |
---|---|---|---|---|---|---|
101 * | విల్ స్మీడ్ | బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ | సదరన్ బ్రేవ్ | ఎడ్జ్‌బాస్టన్ | 10 August 2022 | [40] |
108 * | విల్ జాక్స్ | ఓవల్ ఇన్విన్సిబుల్స్ | సదరన్ బ్రేవ్ | ది ఓవల్ | 14 August 2022 | [41] |
118 | టామీ బ్యూమాంట్ | వెల్ష్ ఫైర్ | ట్రెంట్ రాకెట్స్ | సోఫియా గార్డెన్స్ | 14 August 2023 | [42][43][44] |
105 * | హ్యారీ బ్రూక్ | ఉత్తర సూపర్ఛార్జర్స్ | వెల్ష్ ఫైర్ | హెడ్డింగ్లీ | 22 August 2023 | [45][46] |
బౌలరు | జట్టు | ప్రత్యర్థి | గణాంకాలు | వేదిక | తేదీ | మూలం |
---|---|---|---|---|---|---|
ఇమ్రాన్ తాహిర్ | బర్మింగ్‌హాం ఫీనిక్స్ | వెల్ష్ ఫైర్ | 5/25 | ఎడ్జ్‌బాస్టన్ | 9 August 2021 | [47] |
అలానా కింగ్ | ట్రెంట్ రాకెట్స్ | మాంఛెస్టర్ ఒరిజినల్స్ | 4/15 | ఓల్డ్ ట్రాఫోర్డ్ | 13 August 2022 | [48] |
ఇబ్రహీం ఇస్మాయిల్ | వెల్ష్ ఫైర్ | బర్మింగ్‌హాం ఫీనిక్స్ | 3/31 | ఎడ్జ్‌బాస్టన్ | 10 August 2023 | [49] |
టైమల్ మిల్స్ | సదరన్ బ్రేవ్ | వెల్ష్ ఫైర్ | 4/13 | సోఫియా గార్డెన్స్ | 12 August 2023 | [50] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.