Remove ads
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
దిందోరి, మధ్యప్రదేశ్ రాష్ట్రం, దిండోరి జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. దీన్ని గతంలో రాంగడ్ అనేవారు. పట్టణ పరిపాలనను నగర పంచాయతీ నిర్వహిస్తుంది. దిండోరిలో అనేక చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రదేశాలలో కొన్ని లక్ష్మణ మాద్వా, కుకర్రామత్, కల్చురి కాళి మందిర్ మొదలైనవి. దిండోరి నుండి కన్హా టైగర్ నేషనల్ పార్క్ 180 కి.మీ దూరం లోను, బాంధవ్‌గఢ్ జాతీయ ఉద్యానవనం 140 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
దిండోరి | |
---|---|
పట్టణం | |
Coordinates: 22.95°N 81.08°E | |
దేశం | India |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | దిండోరి |
Elevation | 640 మీ (2,100 అ.) |
జనాభా (2001) | |
• Total | 17,413 |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | MP-52 |
దిండోరి 22.95°N 81.08°E వద్ద, [1] సముద్ర మట్టం నుండి 640 మీటర్ల ఎత్తున ఉంది.
2001 జనగణ ప్రకారం,[2] దిండోరి జనాభా 5,80,730. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48% ఉన్నారు. దిండోరి అక్షరాస్యత, 71%, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 79%, స్త్రీల అక్షరాస్యత 62%. దిండోరి జనాభాలో 13% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.