From Wikipedia, the free encyclopedia
ఉమ్మెత్త (ఆంగ్లం Datura) సొలనేసి కుటుంబానికి చెందిన చిన్న పుష్ప జాతి మొక్క.దత్తూర అనే ఈ మొక్క ఉమ్మెత్త వృక్షానికి చెందింది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమంలో ఈ ఆకు ఐదవది.
దత్తురా ఫాస్టుయొసా మరో రకంగా డెవిల్స్ ట్రంపెట్ లేదా మెటల్ అని అంటారు. ఒక పొద లాంటి శాశ్వత మూలిక. ఈ మొక్కలు ప్రపంచంలోని అన్ని వెచ్చని అడవి ప్రాంతాల్లో పెరుగుతాయి. దినిని మొట్టమొదటచ లిన్నియస్ కనుగొన్నారు. ఈ మొక్క మూడు అడుగులు పెరిగే వార్షిక హెర్బ్.వీటి కాండాలు వంకాయి రంగులో వుండి ఆకులు గుండ్రంగా కాండాలకు అత్తుకుని ఉంటాయి.పువ్వులు 6 నుండి 8 వరకు ఉండి సువాసనను వెదజల్లుతాయి. వీటి పువ్వుల రంగులు క్రీమ్ తెలుపు పసుపు, ఎరుపు,, వైలెట్ మొదలుకుని ఉంటాయి. దత్తురా ఫాస్టుయొసాని దాదాపు వెంట్రుకలు లేని ఆకులు, వృత్తాకారంలో ఉంటాయి.బిరుసైన పండ్లు కలిగి ఉంటాయి. వీటి మొక్కలు పెద్ద, నిటారుగా, బలిసిన హెర్బ్, ఈ మొక్కలకు బ్రాంచ్డ్ టాప్ రూట్ వ్యవస్థను కలిగి వుంటుంది. వీటి ఆకులు సింపుల్, ప్రత్యామ్నాయంగా ఉంటాయి. మొత్తం లేదా లోతుగా తమ్మెలను వెంట్రుకలు లేకుండా కనిపిస్తాయి.
ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం సూదికొనలతో నక్షత్ర ఆకారంలో ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు గుబురుచెట్టుగా పెరుగుతుంది. దీని పుష్పాలు తెల్లగా, ఊదారంగు కలగలసి పొడవుగా సన్నగా ఉంటాయి.
ఈ పత్రి చెట్టు శాస్త్రీయ నామం Datura metal (Family:Solanaceae).
ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.