Remove ads
సిక్కింలోని లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
నాంచి జిల్లా, భారతదేశం సిక్కిం రాష్ట్రం లోని ఒక జిల్లా. "నాంచి" ఈ జిల్లా ముఖ్యపట్టణం.
నాంచి జిల్లా | |
---|---|
సిక్కిం రాష్ట్ర జిల్లా | |
రాష్ట్రం | సిక్కిం |
దేశం | భారతదేశం |
ముఖ్య పట్టణం | నాంచి |
విస్తీర్ణం | |
• Total | 750 కి.మీ2 (290 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 1,46,742 |
• జనసాంద్రత | 200/కి.మీ2 (510/చ. మై.) |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Website | http://ssikkim.gov.in |
దక్షిణ సిక్కిం సముద్రమట్టానికి 400-2000 ఎత్తులో ఉపస్థితమై ఉంది. సంవత్సరమంతా పర్వతప్రాంతాలలో ఉండే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. నంచి, రవంగ్ల, జోర్తంగ్ బజార్, మెల్లి.
" మీనం - ల" ఔషధాలకు నిధివంటింది. ఈ ప్రాంతంలో అనేక ఆయుర్వేద మూలికలు లభ్యమౌతాయి. హిమాలయ పర్వతాలలో లభించే అమూల్యమైన ఆయుర్వేద మూలికలకు, పర్వతారోహణకు ఇది అనుకూలమైన ప్ర్రంతం. ఈ అరణ్యాలలో ఎర్రని పాండా, గోర్ల్, సెరో, బార్కింగ్ డీర్, మార్బ్లెడ్-క్యాట్ " , చివెట్- క్యాట్, బ్లడ్ ఫీసెంట్, కామన్ హిల్ పార్ట్రిడ్జ్, మ్యాగ్పీ, బ్లాక్ ఈగల్, నీలకంఠ్ పిట్ట, సన్ బర్డ్స్, ఇతర వైవిధ్యమైన జంతువులు నివసిస్తున్నాయి. ఈ శాంక్చ్యురీ వైశాల్యం 36.43 చ.కి.మీ.శాక్చ్యురీ సముద్రమట్టానికి 2400 నుండి 3263 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ శాంక్చ్యురీ తూర్పు భూభాగంలో ప్రవహిస్తున్న సెలఏర్లు తీస్తా నదులో విలీనం ఔతుంటాయి. తిస్తా నదీ జలాలు రంగిత్ నదిలో కలుస్తుంటాయి. ఈ శాంక్చ్యురీ నుండి తిస్తా నది సుదూరంగా కనిపిస్తుంటుంది.
దక్షిణ సిక్కిం జిల్లా తూర్పు సిక్కిం, గాంటక్లతో పోల్చిచూస్తే అభివృద్ధి చెందుతున్న జిల్లాలలో ఒకటిగా భావించవచ్చు. రాష్ట్రంలో జనసాంధ్రత అధికంగా ఉన్న జిల్లాలలో ఇది రెండవ స్థానంలో ఉంది. జిల్లా ప్రజలలో అత్యధికులు వ్యవసయదారులే. ప్రజల ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయమే. మొక్కజొన్నలు, వడ్లు, అల్లం, యాలుకలు, ఆరంజి పండ్లు, ఉర్లగడ్డలు, వాణిజ్య పంటలు పండిస్తున్నారు. వ్యవసాయంతో తరువాత పర్యాటకం, వ్యాపారం, గ్రామసందర్శన పర్యాటకం, టీ తోటల పెంపకం ప్రధానమైనవిగా అంచనా.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య .. | 146,742, [1] |
ఇది దాదాపు... | సెయింట్ లూసియా దేశజసంఖ్యకు సమం [2] |
అమెరికాలోని జనసంఖ్యకు | |
640 భారతదేశ జిల్లాలలో | 600 [1] |
1చ.కి.మీ జనసాంద్రత | 196 .[1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | 11.57%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి | 194:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే | |
అక్షరాస్యత శాతం | 82.06%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
జిల్లా ప్రజలలో అత్యధికులు నేపాలీలు ఉండగా తరువాతి స్థానాలలో లెప్చా, భుటియా ప్రజలు ఉన్నారు. అలాగే అత్యధికమైన ప్రజలు నేపాలీ భాషను మాట్లాడుతున్నారు.
1987లో సిక్కిం జిల్లాలో 35చ.కి.మీ వైశాల్యంలో " మీనం విల్డ్లైఫ్ సాక్ంచ్యురీ " ఏర్పాటు చెయ్యబడింది.[3]
దక్షిణ సిక్కిం 2 ఉపవిభాగాలుగా విభజించబడింది:[4]
పేరు | ప్రధాన కేంద్రం | గ్రామాలసంఖ్య[5] | ప్రాంతం |
నాంచి | నాంచి | ||
రవోంగ్ | రవోంగ్ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.