టి. కృష్ణ

సినీ దర్శకుడు From Wikipedia, the free encyclopedia

టి. కృష్ణ

తొట్టెంపూడి కృష్ణ (1950 మే 08 - 1987 అక్టోబరు 21) తెలుగు చలనచిత్ర దర్శకుడు. ఈయన చలన చిత్ర పరిశ్రమలో టి.కృష్ణ గా ప్రసిద్దుడు.

త్వరిత వాస్తవాలు
టి. కృష్ణ
Thumb
తొట్టెంపూడి కృష్ణ
జన్మ నామంతొట్టెంపూడి కృష్ణ
జననం 1950 మే 08
మరణంఅక్టోబరు 21, 1987(1987-10-21) (aged 37)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
భార్య/భర్తకోటేశ్వరమ్మ
పిల్లలు3, గోపీచంద్, ప్రతిమలతో సహా
మూసివేయి

విశేషాలు

ఈయన 1950లో ప్రకాశం జిల్లా కాకుటూరి వారి పాలెంలో జన్మించాడు. ఇతని తండ్రి మంచి పండితుడు. ఉభయభాషా ప్రవీణుడు. కృష్ణ తన మేనమామ మాజీ మంత్రి టి.హయగ్రీవాచారి ప్రోద్బలంతో నాటకాలలో ప్రవేశించి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. సినిమాలలో పనిచేయాలనే బలమైన కోరికతో ప్రజానాట్యమండలి లో సభ్యుడు గా చేరి అనేక నాటకాలలో నటించారు. 1984లో ఆర్.నారాయణ మూర్తి గారి దర్శకత్వంలో వచ్చిన అర్థరాత్రిస్వతంత్రం సినిమా లో నటించారు. వంగపండు ప్రసాదరావు గారు వ్రాసిన ఏం పిల్లడో ఎల్ద మొస్తవా పాటలో నటించారు టి.కృష్ణ గారు. ఆతరువాత ఉషాకిరణ్ మూవీస్ వారి ప్రతిఘటన చిత్రానికి కథ,మాటలు, అందించడంతో పాటు దర్శకత్వం వహించి సంచలన విజయాన్ని అందుకున్నారు. దర్శకత్వం వహించినవి ఏడు చిత్రాలే అయినప్పటికీ సామాజిక సృహ కలిగిన అద్భుత చిత్రాలు. .. [1]ఈయన ప్రతిఘటన, రేపటి పౌరులు, నేటి భారతం వంటి విజయవంతమైన విప్లవాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించాడు[2]. ఈ తరం పిక్చర్స్ సంస్థని స్థాపించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. ఈయన మలయాళంలో కూడా కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ప్రముఖ తెలుగు నటుడు తొట్టెంపూడి గోపీచంద్ ఈయన కుమారుడే. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 1987 మే 8న టి. కృష్ణ మరణించాడు.

సినిమాలు

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.