From Wikipedia, the free encyclopedia
తెలుగు వెలుగు రామోజీరావు స్థాపించిన రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధి కోసం వెలువడుతున్న మాసపత్రిక. ఈ పత్రిక రామోజీ విజ్ఞాన కేంద్రం సహకారంతో సాగుతోంది. తెలుగు భాష కీర్తిని గుర్తుచేస్తూ, భాషకు తగిన ప్రాధాన్యం చేకూర్చటానికి ఇవ్వడానికి చేసిన ప్రయత్నంలో[2] బాలభారతం పత్రికతో పాటు ఈ పత్రిక వెలువడింది. రామోజీ ఫొండేషను అధినేత రామోజీరావు తెలుగు వెలుగును గురించి " కదలబారుతున్న భాషా పునాదులను గట్టి పరచి, మకరందాల ఊటను రేపటితరాలు కోల్పోకుండా చూసేందుకు- తెలుగువారి ఇంటింటి ఆత్మబంధువు ఈనాడు నిష్టగా చేపట్టిన నిబద్ద కృషి తెలుగు వెలుగు " అని అన్నాడు.[3]
ఇది సెప్టెంబరు 2012 సెప్టెంబరు నెలలో తొలిసంచికగా తెలుగు వెలుగు పత్రిక ప్రారంభమైంది. తొలిదశలో కొత్త పత్రిక విడుదలైన నెలకు వెబ్సైట్ లో చేర్చబడేది. మే 2020 లో నేరుగా భౌతిక పత్రికతోపాటు, వెబ్‌లో కూడా విడుదలవుతోంది. చతుర, విపుల పత్రికలు కూడా వెబ్‌లో రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలోకి మార్చబడి వెబ్‌లో విడుదలవుతున్నాయి. ఫ్లిప్బుక్ సాంకేతికాలలో అభివృద్ధి వలన పత్రిక మొబైల్ లో కూడా సులభంగా చదువుటకు వీలైంది. 2021 మార్చి సంచికతో పత్రిక మూతపడింది[1]
ఈ పత్రికలోని రచనలు తెలుగు భాషను, సంస్కృతిని సుసంపన్నం చేసే కోణంలో ఉంటాయి.
Seamless Wikipedia browsing. On steroids.