గాంగ్‌టక్ జిల్లా, భారతదేశ రాష్ట్రాలాలో ఒకటైన సిక్కిం రాష్ట్రంలోని 4 జిల్లాలలో ఒకటి. భౌగోళికంగా దీనిని తూర్పు సిక్కిం జిల్లా అని కూడా అంటారు. ఇది సిక్కిం రాష్ట్రంలోని ఆగ్నేయ భూభాగంలో ఉంది. జిల్లా కేంద్రం, సిక్కిం రాష్ట్ర రాజధాని గాంగ్‌టక్. రాష్ట్ర నిర్వహణా కార్యక్రమాలకు గాంగ్‌టక్. డిస్ట్రిక్ కలెక్టర్ జిల్లా నిర్వహణా బాధ్యతను వహిస్తాడు. అలాగే మేజర్ జనరల్ మిలటరీ బాధ్యతను వహిస్తాడు. 2011 గణాంకాలను అనుసరించి సిక్కిం రాష్ట్రంలోని 4 జిల్లాలలో తూర్పు సిక్కిం జిల్లాలో జనసాంద్రత అధికంగా ఉంటుంది.[1]

త్వరిత వాస్తవాలు తూర్పు సిక్కిం జిల్లా, రాష్ట్రం ...
తూర్పు సిక్కిం జిల్లా
సిక్కిం రాష్ట్ర జిల్లా
Thumb
టీస్టా నది సిక్కిం మొత్తం పొడవు వరకు ప్రవహిస్తుంది.
Thumb
సిక్కింలోని ప్రాంతం ఉనికి
రాష్ట్రంసిక్కిం
దేశంభారతదేశం
ముఖ్య పట్టణంగాంగ్‌టక్
విస్తీర్ణం
  Total964 కి.మీ2 (372 చ. మై)
Elevation
610 మీ (2,000 అ.)
జనాభా
 (2011)
  Total2,81,293
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Websitehttp://esikkim.gov.in
మూసివేయి

చరిత్ర

తూర్పు సిక్కిం భూభాగం అత్యధిక కాలం సిక్కిం రాజ్యంలో భాగంగా ఉంది. 19వ శతాబ్దంలో ఈ ప్రాంతం భూటాన్ ఆధీనంలో ఉండేది. ఆంగ్లో భూటన్ యుద్ధం తరువాత ఈ భూభాగం బ్రిటిష్ సైన్యాల ఆధీనంలోకి వచ్చింది. 1947 స్వాతంత్ర్య సమరం తరువాత ఈ భూభాగం భారతదేశ రక్షణలో ఉన్న సిక్కిం రాజ్యంలో భాగంగా మారింది. 1962లో జరిగిన చైనా-భారత యుద్ధం సిక్కిం సాక్ష్యంగా నిలిచింది. 1975లో సిక్కిం భారతదేశంలో భాగంగా అలాగే 22 వ రాష్ట్రంగా అయింది.

భౌగోళికం

జిల్లా వైశాల్యం 964 చ.కి.మీ. గాంగ్టక్ తూర్పు సరిహద్దులో చైనాదేశ సరిహద్దు ఉన్నకారణంగా ఈ ప్రాంతంలో సైనికపరమైన ఉద్రిక్తత అత్యధికంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో పర్యటనకు నిషేధాలు అధికంగా ఉన్నాయి. జిల్లాలో గాంగ్టక్ తూర్పు సరిహద్దులో కొన్ని ప్రాంతాలలో మాత్రం పర్యాటకులను అనుమతిస్తున్నారు. త్సాంగ్మో సరసు, బాబా మందిర్, " నాథు లా పాస్ " వంటి ప్రాంతాలు పర్యాటక ఆకర్షణగా ఉన్నాయి. భారతదేశాన్ని లాసాతో అనుసంధానం చేస్తున్న " నాథు లా పాస్ " పురాతనకాలంలో " సిల్క్ రోడ్ "గా గుర్తింపు పొందింది. నాథు లా పాస్, బాబా మందిరాలకు భారతదేశ సందర్శకులకు అనుమతి లభిస్తుంది. ఈ ప్రాంతాలలో ప్రవేశించడానికి ప్రత్యేక అనుమతి తీసుకోవడం అవసరం. ఇన్నర్ లేన్ అనుమతి ఒక్కరోజు ముందుగా మాత్రమే లభిస్తుంది. ఈ అనుమతిని ప్రాంతీయ అధికారుల నుండి పొందవచ్చు. ఇతర పర్యాటక ఆకర్షణలలో గాంగ్టక్ ఉత్తర భూభాగంలో ఉన్న ప్రఖ్యాత ఫోడాంగ్ మొనాస్ట్రి, అంతర్జాతీయ ఖ్యాతి వహించిన " రంతక్ మొనాస్ట్రి " ప్రధానమైనవి.

గణాంకాలు

మరింత సమాచారం విషయాలు, వివరణలు ...
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 281,293, [1]
ఇది దాదాపు... బార్బాడోస్ దేశ జనసంఖ్యకు సమం [2]
అమెరికాలోని జనసంఖ్యకు
640 భారతదేశ జిల్లాలలో 574 [1]
1చ.కి.మీ జనసాంద్రత 295 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 14.79%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి 872:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే
అక్షరాస్యత శాతం 84.67%.[1]
జాతియ సరాసరి (72%) కంటే అధికం
మూసివేయి

వృక్షజాలం, జంతుజాలం

తూర్పు సిక్కిం జిల్లాలో 4 వన్యమృగ అభయారణ్యాలు ఉన్నాయి : బార్సే రోహోడోడెంరాన్, ఫాంబాంగ్ ల్హో, పాంగోలఖా, క్యోంగ్నోస్లా ఆల్ఫైన్. [3]

విభాగాలు

నిర్వహణా విభాగాలు

తూర్పు సిక్కిం జిల్లా 4 విభాగాలుగా విభజించబడింది.[4]

పేరు ముఖ్య పట్టణం గ్రామాల సంఖ్య[5] ప్రాంతం
గాంగ్‌టక్గాంగ్‌టక్
Thumb
పాక్యాంగ్పాక్యోంగ్
Thumb
రోంగ్లీరోంగ్లీ
Thumb

చిత్రమాలిక

మూలాలు

వెలుపలి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.