తమిళనాడు లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
తూత్తుకూడి జిల్లాను టుటికార్న్ జిల్లా అని కూడా అంటారు. దక్షిణభారతదేశంలోని తమిళనాడురాష్ట్రానికి చెందిన జిల్లాలలో తూత్తుకూడి ఒకటి. జిల్లా ప్రధాన నగరం తూత్తుకూడి. తూత్తుకూడి ముత్యాల పంటకు ప్రసిద్ధి. జిల్లాలోని సముద్రతీరాలలో విస్తారంగా ముత్యాలు పండించబడుతున్నాయి. ఇది తమిళనాడు ముఖద్వారంగా గుర్తించబడుతుంది. ఇది ఒకప్పుడు భారతదృశంలోని అతిపురాతన సామ్రాజ్యమైన పాండ్యసామ్రాజ్యంలో భాగంగా ఉంటూ వచ్చింది. కొర్కై, కులశేఖర పట్టిణం నుండి పురాతనకాలంలో సుదూరంలో ఉన్న రోమునగరానికి నౌకలు నడుపబడ్డాయి. జిల్లాలో ప్రముఖ నగరాలు కోవిల్‌పట్టి, తిరుచెందూరు. ఈ జిల్లా అత్యధికంగా నగరీకరణ చేయబడడమేగాక ఉన్నతమైన సాంఘిక సంపద కలిగి ఉంది. జిల్లాలో టుటికార్న్ నగరం అతిపెద్ద నగరం. తూత్తుకూడి అధికమైన తలసరి ఆదాయం, అక్షరాస్యతలో మిగిలిన తమిళనాడు జిల్లాలకంటే ప్రథమస్థానంలో ఉంది.[2] జిల్లాలో ఉన్న అదిచందూరులో పురాతన తమిళసాంస్కృతిక అవశేషాలు లభిస్తున్నాయి. 2011 భారత జనాభా గణాంకాలను అనుసరించి తూత్తుకూడి జిల్లా జనసంఖ్య 1,750,176. స్త్రీ పురుష లింగ నిష్పత్తి 1023:1000.
Thoothukudi district
தூத்துக்குடி மாவட்டம் Tuticorin district | |
---|---|
district | |
Country | India |
రాష్ట్రం | తమిళనాడు |
Municipal Corporations | Thoothukudi |
ప్రధాన కార్యాలయం | Thoothukudi |
Boroughs | Ettayapuram, Kovilpatti, Ottapidaram, Sathankulam, Srivaikundam, Thoothukkudi, Tiruchendur, Vilathikulam. |
Government | |
• Collector | M.Ravikumar,I.A.S, IAS |
విస్తీర్ణం | |
• Total | 4,745 కి.మీ2 (1,832 చ. మై) |
• Rank | 10 |
జనాభా (2011) | |
• Total | 17,50,176 |
• Rank | 20 |
• జనసాంద్రత | 369/కి.మీ2 (960/చ. మై.) |
భాషలు | |
• అధికార | Tamil |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 628xxx |
టెలిఫోన్ కోడ్ | 0461 |
ISO 3166 code | [[ISO 3166-2:IN|]] |
Vehicle registration | TN-69[1] |
Central location: | 8°48′N 78°8′E |
తూత్తుకూడి (టుటికార్న్) భారతదేశ ముఖ్యమైన నౌకాశ్రయనగరాలలో ఒకటి. తూత్తుకూడి చారిత్రకంగా సా.శ. 6వ శతాబ్దం నుండి ఉనికిలో ఉంది. తూత్తుకూడి జిల్లా దేశానికి పలువురు స్వాతంత్ర్య పోరాటవీరులను అందించింది. వీరిలో జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి, వి.వొ చొనంబరం పిళ్ళై, ఊమదురై, వీరపాండ్యకట్టబొమ్మన్, వెళ్ళైయదేవన్, వీరన్ సుందరలింగం మొదలైన వారు ముఖ్యులు. 1907 జూన్ 1న వి.ఒ . చిదంబరం పిళ్ళై మొదటిసారిగా సుదేశీనౌకను నడిపాడు.
తూత్తుకూడి జిల్లా తమిళనాడు రాష్ట్రంలో ఆగ్నేయ భూభాగంలో ఉంది. తూత్తుకూడి జిల్లా ఉత్తర సరిహద్దులో తిరునల్వేలి జిల్లా, విరుదునగర్ జిల్లా, రామనాథపురం ఉన్నాయి. తూర్పు, ఈశాన్య సరిహద్దులో మన్నార్ అఖాతం, పడమర, నైరుతి సరిహద్దులో తిరునెల్వేలి జిల్లాలు ఉన్నాయి. జిల్లా మొత్తం వైశాల్యం 462 చదరపుమైళ్ళు. ప్రధాన నగరమంతా నగరీకరణ చేయబడింది. తూత్తుకూడి ఒకప్పుడు తిరునల్వేలి జిల్లాలో ఒక తాలూకాగా ఉండేది. 1986 అక్టోబరు 20 నుండి తిరునల్వేలి జిల్లా నుండి తూత్తుకూడి జిల్లా రూపొందించబడింది. ఆర్.ఆరుముగం. ఐ.ఎ.ఎస్ జిల్లాకు మొదటి కలెక్టరుగా నియమించబడ్డాడు.
తూత్తుకూడి జిల్లా 3 రెవెన్యూ విభాగాలుగానూ, 8 తాలూకా విభాగాలుగానూ విభజించబడింది.[3] జిల్లాలో 41 రెవెన్యూ ఫిర్కాలు, 480 రెవెన్యూగ్రామాలు ఉన్నాయి.[4]
రెవెన్యు విభాగాలు |
తాలూకాలు | రెవెన్యూ గ్రామాల సంఖ్య |
---|---|---|
తూత్తుకూడి | తూత్తుకూడి | 33 |
శ్రీవైకుంటం | 69 | |
కోవిల్పట్టి | కోవిల్పట్టి | 33 |
ఒట్టపాళయం | 63 | |
ఎట్టయపురం | 56 | |
విలతికుళం | 89 | |
తిరుచందూర్ | తిరుచందూర్ | 58 |
సంతంకుళం | 25 |
తూత్తుకూడి జిల్లా నగర, గ్రామీణపరంగా 12 రెవెన్యూ విభాగాలుగా విభజించబడింది. అవి వరుసగా టుటికార్న్, తిరుచందూరు, ఉదంగుడి, సాతంకుళం, శ్రీవైకుంటం, ఆల్వార్తురునగరి, కరుంకుళం, ఒట్టపాళయం, కోవిల్పట్టి, కయతార్, విలతికుళం, పుదూర్. జిల్లాలో త్తూత్తుకుడి నగరపాలిక ఒకటి, కాయల్పట్టణం, కోవిల్పట్టి అనే రెండు పురపాలికలు ఉన్నాయి. 19 నగర పంచాయుతీలు ఉన్నాయి.[5] అలాగే 430 గ్రామపంచాయితీలు ఉన్నాయి.[6]
తూత్తుకూడి జిల్లాలో తూత్తుకూడి లోక్‌సభ నియోజకవర్గం పేరుతో ఒక పార్లమెంటు నియోజకవర్గం ఉంది. అలాగే 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.[4]
2011 భారత జనాభా గణాంకాలను అనుసరించి తూత్తుకూడి జిల్లా జనసంఖ్య 1,750,176. స్త్రీ పురుష నిష్పత్తి 1023:1000. దేశ స్త్రీ పురుష నిష్పత్తి 992:1000 కంటే ఇది అధికం. [7] ఇందులో 6 సంవత్సరాలకు లోబడిన పిల్లల సంఖ్య మొత్తం 1,83,763. వీరిలో ఇందులో 6 సంవత్సరాలకు లోబడిన బాలుర సంఖ్య 93,605, బాలికల సంఖ్య 90,158. వెనుకబడిన తరగతి 19.88% శాతం, వెనుకబడిన జాతులు 28% మంది ఉన్నారు. అలాగే సరాసరి అక్షరాస్యత శాతం 77.12%. జాతీయ సరాసరి అక్షరాస్యత 72.99%.[7] జిల్లాలో మొత్తం 4,62,010 కుటుంబాలు ఉన్నాయి. జిల్లాలో ఉన్న మొత్తం శ్రామికులు 748,095. వీరిలో రైతులు 44,633 ఉండగా, 161,418 మంది వ్యవసాయ కూలీలు, పరిశ్రమలలో పనిచేసే వారు 17,872, ఇతర శ్రామికులు 433,524, మార్జినల్ శ్రామికులు 90,648 ఉన్నారు. సన్నకారు రైతులు 3,882 ఉండగా, సన్నకారు వ్యవసాయ కూలీలు 39,226. గృహా పరిశ్రమలలో పనిచేసేవారు 4,991. ఇతర శ్రామికులు 42,549 ఉన్నారు.[8]
వి.ఒ చిదంబరం పోర్ట్ ట్రస్ట్ తమిళనాడు అభివృద్ధిలో ప్రధాన పాత్రవహిస్తుంది. అత్యధికంగా ఉపాధి కలిగిస్తున్న ఈ నౌకాశ్రయ అభివృద్ధి శాతం 12.08%.
తూత్తుకూడి జిల్లాలో స్పిక్, స్టెరిలైట్, టుటికార్న్ ఆల్కలీస్ కెమికల్స్, హెవీ వాటర్ ప్లాంట్, డి.సి.డబ్ల్యూ, జిర్కోనియం ప్లాంట్, ఉప్పు పలు ప్యాక్ చేసే కంపెనీలు ఉన్నాయి. జిల్లాలో పలు స్థాయిలలో బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలు పనిచేస్తున్నాయి. కోవిల్‌పట్టి తాలూకాలో పలు కుటీరపరిశ్రమలు ఉన్నాయి. వీటిలో అగీపుల్లల వ్యాపారం ప్రధానమైనది.
తమిళనాడులోని ఉప్పూత్పత్తిలో 70% భారతదేశంలో 30% తూతుకుడి జిల్లాలో ఉత్పత్తి చేయబడుతుంది. దేశంలో ఉప్పు ఉత్పత్తిలో తూతూకుడి 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో గుజరాత్ రాష్ట్రానిది.
పుదియంపుదూర్ గ్రామంలో తయారు చేయబడుతున్న రెడీమేడ్ దుస్తులు తమిళనాడులోని ఇతర ప్రాంతాలకే కాక ముంబయి వంటి రాష్ట్రాలకు కూడా సరఫరా చేయబడుతున్నాయి. ఈ పరిశ్రమ దాదాపు 10,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఈ పరిశ్రమకు అవసరమైన ఉద్యోగులు గ్రామం, పరిసర ప్రాంతాల నుండి తీసుకుంటున్నారు.
పాళయకాయల్, శ్రీవైకుంఠం, సాత్తన్‌కుళం, తిరుచందూరు తాలూకాలలో వరి పండినబడుతుంది. కోవిల్‌పట్టి, విలతికుళం, నాగలాపురం, ఒట్ట్పిడారం, తూతుకుడి తాలూకాలలో సజ్జలు, మొక్కజొన్నలు, ఉలవలు, ఇతర పప్పులు పండింబడుతున్నాయి. కోవిల్‌పట్టి, తిరుచందూరు, సాత్తన్ కుళం తాలూకాలలో వేరుచనగ పంట పండించబడుతుంది. వేరుచనక పిట్టు పశుగ్రాస పొలాలలో పొలాలకు ఎరువుగా ఉపయోగించబడుతుంది. కోవిల్‌పట్టి, ఒట్టపిడారం, తూతుకుడి తాలూకాలలో పత్తి పంట పండించబడుతుంది. నాగలాపురం పూర్తిగా వ్యవసాయ ఆదాయం మీద ఆధారపడుతుంది. ఇక్కడి ప్రధాన వాణిజ్యం మిరపకాయలు, మొక్కజొన్నలు, సజ్జలు, బొగ్గు మొదలైనవి.తమిళనాడు జిల్లాలోని 35% సజ్జలు తూత్తుకూడిలో ఉత్పత్తి చేయబడడం ప్రత్యేకత.[9]
తిరుచందూరు, శ్రీవైకుంఠం, సాత్తన్‌కుళం, విలతికుళం తాలూకాలలో తాటిచెట్లు అధికంగా ఉన్నాయి. శ్రీవైకుంఠం తాలూకాలో శివగలై సమీపంలో ఉన్న కుళం, పెరియకుళం శివగలై గ్రామం, పరిసర వ్యవసాయ భూములకు అవసరమైన జలాలను అందిస్తున్నాయి. తాటి పండ్లరసం నుండి తాటి బెల్లం తయారుచేయబడుతుంది. తాటిబెల్లం తయారీ తిరుచందూరు, సాత్తన్‌కుళం ప్రజలకు ప్రధాన వృత్తిగా ఉంది. తిరుచందూరు, శ్రీవైకుంఠం తాలూకాలలో అరటి, కూరగాయల ఉత్పత్తి అధికంగా జరుగుతుంది. తిరుచందూరు నుండి కులైయ రోడ్డుమార్గంలో ఒకవైపుబ్ అరటితోటలు మరొక వైపు ఉప్పు పొలాలు అధికంగా ఉన్నాయి. ఒక్కో పంటకు ఒక్కో విధమైన జలం అవసరం. తమిళనాడులో అత్యధికంగా అరటితోటలు ఉన్న జిల్లాలలో తూత్తుకూడి ఒకటి.
తూత్తుకూడి జిల్లాలో పెద్ద రిజేవాయర్లు లేవు కనుక తిరునెల్వేలి జిల్లాలో తామ్రపర్ణి నదీ ప్రవాహ ఆనకట్టలు అయిన పాపనాశనం, మణిముత్తూరు ఆనకట్టలు జిల్లాలోని వ్యవసాయభూములకు నీటిని అందిస్తున్నాయి. అదనంగా విలతికుళం తాలూకాలో ఉన్న వైపర్, కరుమేని నదులు సతంకుళం, తిరుచందూరు తాలూకాలలో ప్రవహిస్తూ జిల్లాకు అవసరమైన జలాలను అందిస్తున్నాయి. ఒట్టపిడారం తాలూకాలోని ఎప్పోదుం వేంద్రన్ గ్రామంలో ఒక చిన్న రిజర్వాయర్ కూడా జిల్లాలోని జలవనరులలో ఒకటి. కులైయన్‌కరిసల్ అరటి తోటల పెంపకానికి ప్రసిద్ధిచెంది ఉంది. ఇక్కడి నుడి ఇతర జిల్లాలకు అరటి ఆకులు సరఫరాచేయబడుతున్నాయి.
జిల్లాలో అనేకంగా పాలిటెక్నిక్ కాలేజీలు, పాఠశాలలు తూత్తుకూడి, సమీపప్రాంతాలకు నాణ్యతకలిగిన విద్యను అందిస్తున్నది. 1889 - 85 లో అగ్రికల్చర్ కాలేజ్, రీసెర్చ్ ఇంస్టిట్యూట్ (కిళ్ళికులం) స్థాపించబడింది. ఇది తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్శిటీ పరిధిలో ఉన్న 3వ కాలేజిగా గుర్తించబడింది. ఇది తిరునల్వేలి జిల్లాలో ఉన్న పేట్టైలో ఉన్న హిందూ కాలేజ్ ఆవరణలో అద్దె భవనంలో నిర్వహించబడుతుంది. అందువలన విత్తన ఉత్పత్తి కార్యాలయానికి అవసరమైన భూమి, భవనాలు లలో కిల్లికుళంలో ఏర్పాటుచేయబడ్డాయి. 1986-87 నుండి విద్యాసంబంధిత కార్యాలయాలు కూడా కిల్లికుళానికి తరలించబడింది. 1989 నవంబరు 1 తారీఖున కాలేజీకి అవసరమైన వసతిగృహాల నిర్మాణం పూర్తయింది. తరువాత ఈ ఇంస్టిట్యూట్ అగ్రికల్చర్, రీసెర్చ్ కాలేజ్ స్థాయికి చేరుకుంది. ఈ కాలేజిలో 1990 నుండి పోస్ట్ గ్రాజ్యుయేషన్ టీచింగ్ విద్యను కూడా ప్రవేశించపెట్టబడింది. 1988లో మొదటి సారిగా విద్యార్థుల బృందం ఈ కాలేజి నుండి పట్టా పుచ్చుకున్నాయి. 1990 -91 నుండి ఈ కాలేజీలో కో ఎజ్యుకేషన్ ప్రవేశపెట్టబడింది. తమిళనాడులో జియాలజీ డిద్రీని అందిస్తున్న కళాశాలలలో వి.ఒ.సి కాలేజి ఒకటి.
జాతీయ రహదారి 45బి, 7ఎ, రాష్ట్ర రహదారులు -32, 33, 40, 44, 75, 76, 77, 93, 176 రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానించబడి ఉన్నాయి. ప్రభుత్వ బస్సులు జిల్లాను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతాయి.
రహదారులు - జాతీయ రాదారులు ముడిసరుకు, వాణిజ్యవస్తువులను త్వరితగతిలో నౌకాశ్రయానికి, వ్యాపార కేంద్రాలకు రవాణాచేయడానికి సాఅరిస్తున్నాయి. రాష్ట్ర రహదారి 49 లేక ఈస్ట్ కోస్ట్ రోడ్ తూత్తుకూడి వరకు పొడిగించబడింది. రామనాథపురం తూత్తుకూడి ఇ.సి.ఆర్ 4 దారుల మార్గం నిర్మాణం ప్రతిపాదనలో ఉంది. జిల్లా రహదారులు జిల్లాలోని గ్రామాలన్నింటిని అనుసంధానిస్తున్నాయి. మినీ బస్సులు, ఆటోలు, హేర్ ఆటోలు నగరంలోని పలు ప్రాంతాలను అనుసంధానిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం నడుపుతున్న బసుల ద్వారా ఇక్కడి నుండి ప్రతిదినం చెన్నై నుండి బెంగుళూరు, త్రివేండ్రం, ఎర్నాకుళం, కొల్లం, ఆలప్పుళా, కోఓటయం, వేలూరు, పాండిచ్చేరీ, తిరుపతి వంటి గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.
తూత్తుకూడి నౌకాశ్రయం దక్షిణ భారతదేశంలో కంటైనర్ సేవలను యు.ఎస్.కు (22 రోజులు) అందించడంలో బలహీనంగా ఉన్న ఒకే ఒక నౌకాశ్రయంగా భావించబడుతుంది. ఇక్కడ నుండి దినసరి ఐరోపా (17 రోజులు), చైనా (10 రోజులు), ఎర్ర సముద్రం (8 రోజులు).
విమానాశ్రయం వైగైకుళంలో ఉంది. విస్తరణ పనులు జరుగుతున్నాయి. తూత్తుకూడిని కలుపుతూ ప్రస్తుతం స్పైస్‌జెట్ చెన్నై, బెంగుళూరు, హుబ్లీ, హైదరాబాదు (ఒకే విమానం) లకు, న్యూ డిల్లీ, ముంబయి లకు (వేరు విమానం) రెండు విమానాలను నడుపుతుంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.