తుక్కా దేవి
From Wikipedia, the free encyclopedia
జగన్మోహిని లేదా తుక్కా దేవి గజపతి వంశ చక్రవర్తి, ప్రతాపరుద్ర గజపతి కూతురు. శ్రీ కృష్ణదేవరాయల మూడవ భార్య.[1]
ఈమె సంస్కృతములో తుక్కా పంచకమనే ఐదు పద్యాలు చెప్పినది. ప్రతాపరుద్ర గజపతి 1519 లో రాయలకు తన కూతురు జగన్మోహిని (తుక్కా) నిచ్చి వివాహము చేసి సంధి చేసుకున్నాడు. తుక్కా పంచకము, కృష్ణరాయ విజయములలో ఈమె పేరు తుక్కాగాను, రాయవాచకములో జగన్మోహినిగాను, కొండవీడు కైఫియత్ లో లక్ష్మీగాను వ్యవహరించబడినది.[2] కొందరు తుక్కాదేవియే చిన్నాదేవి అని అంటారు.
తెలుగు దేశములో ప్రచారములో ఉన్న సాంప్రదాయ గాథల ప్రకారము ఈమె కృష్ణరాయల క్షత్రియ పుట్టుకను శంకించి కృష్ణరాయలకు విషము పెట్టబోయినదని. పన్నాగము బయటపడి రాయలు ఈమెను విడిచివేసినాడని. రాయలు విడిచిన ఈమె కంభం పరిసర ప్రాంతాలలో ఒంటరి జీవితము గడిపినదని ప్రచారములో ఉన్నది.
తుక్కా పంచకములో మొదటి పద్యము [3]–
భ్రమన్వనాంతే నవమంజరీషు
న షట్పదో గంధఫలీ మజిఘ్రత్
సా కిం న రమ్యా స చ కిం న రంతా
బలీయసీ కేవల మీశ్వరేచ్ఛా
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.