తిరువిడందై
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
తిరువిడందై (తమిళం: திருவிடந்தை; ఆంగ్లం: Thiruvidandai) (నిత్య కల్యాణ పెరుమాళ్ దేవాలయం) 108 వైష్ణవ దివ్య దేశాలలో 62-వ ది.[1] ఇది చెన్నపట్నం లోని తిరువాన్మియూరుకి దక్షిణంగా 19 కి. మి. దూరంలో, చెన్నపట్నం నుండి పుదుచ్చేరి వెళ్ళు తూర్పు తీర మార్గము (ఈస్టు కోస్టు రోడ్డు) పై కోవళం బస్సు స్టేషను నుండి 3 కి. మి దూరములో ఉంది.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
నిత్య కళ్యాణ పెరుమాళ్ | |
---|---|
భౌగోళికాంశాలు : | 13.05°N 80.27°E |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
రాష్ట్రం: | తమిళనాడు |
ప్రదేశం: | తమిళనాడు, భారత దేశము |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | నిత్యకల్యాణర్, శ్రీ లక్ష్మీ వరాహస్వామి |
ప్రధాన దేవత: | కోమలవల్లి నచ్చియార్ |
దిశ, స్థానం: | తూర్పుముఖము |
పుష్కరిణి: | కళ్యాణ తీర్థం |
విమానం: | కళ్యాణ విమానం |
కవులు: | తిరుమంగై ఆళ్వార్ |
ప్రత్యక్షం: | మార్కండేయ మహర్షి |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | ద్రావిడ నిర్మాణం |
ఇదియొక వరాహ క్షేత్రము. వివాహార్థులు ఇచట స్వామి వారిని కొలిచెనేని వివాహములు శిఘ్రముగ కుదురునని ఆస్తికుల నమ్మిక.
ఇక్కోవెల పల్లవ రాజులచే నిర్మింపబడెను. ఇది సముద్ర తీరమునకు సమీపమున ఉంది. ఇక్కోవెలకు ముందు భాగమున పెద్ద పుష్కరిణి ఒకటి ఉంది. దాని పేరు కల్యాణ తీర్థము. ఇచ్చటి మూలవిరాట్టు శ్రీ నిత్య కల్యాణ పెరుమాళ్, అఖిలవల్లి అమ్మవారు. స్వామి వారు ఆదిశేషునిపైనుండి అఖిలవల్లి అమ్మవారిని తన ఎడమ తొడపై కూర్చుండబెట్టికొని దర్శనమిత్తురు. గర్భగుడికి కుడిప్రక్కన కోమళవల్లి అమ్మవారి సన్నిధియును ఎడమప్రక్కన ఆండాళ్ళమ్మవారి సన్నిధుయును ఉంది. శ్రీ రంగనాథస్వామికిని ప్రత్యేక సన్నిధి గలదు.ఇక్కోవెల తెనాచార్య సంప్రదాయమును అనుసరించును.
గవళ మహర్షికి 360 మంది కుమార్తెలు. వారి వివాహము చేయ నిశ్చయించినవాడై విష్ణుమూర్తిని వేడుకొనెను. తాను ఆ 360 మంది కన్యలను వివాహమాడగలనని శ్రీ మహావిష్ణువు వరమొసంగెను. దినమునకొక్కరు చొప్పున సంవత్సర పర్యంతము స్వామివారు వివాహమాడుచుండిరి. కావున వారికి నిత్య కల్యాణ పెరమాళ్ అను పేరు వచ్చెను. 360 మందిని వివాహమాడిన పిమ్మట వారెల్లరిని ఒక్కరిగ మార్చెను కావున అమ్మవారికి అఖిలవల్లి అను పేరు వచ్చెను. అమ్మవారిని తన ఎడమ తొడపై కూర్చుండబెట్టికొనెను. కావున ఈ ప్రెదేశానికి తిరువిడందై అను పేరు ఏర్పడెను.
తిరుమంగై ఆళ్వార్ ఈ నిత్యకళ్యాణ పెరుమాళ్ గురించి కీర్తించిన పాశురము:
పా. తుళమ్బడు ముఱువల్ తోழிయర్కరుళాళ్
తుణైములైశాన్దు కొణ్డడియాళ్
కుళమ్బడు కువళై క్కణ్ణిణై యెழுదాళ్
కోలనన్మలర్ కుழఱ్కణియాళ్;
వళమ్బడు మున్నీర్ వై యమున్నళన్ద
మాలెన్నుం మాలినమొழிయాళ్
ఇళమ్బడి యివళుక్కెన్నినైన్దిరున్దా
యిడై వెన్దై యెన్దపిరానే!
తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 2-7-2
ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
నిత్యకల్యాణర్ | కోమలవల్లి త్తాయార్ | కల్యాణ తీర్థము | తూర్పు ముఖము | నిలచున్న భంగిమ | తిరుమంగై ఆళ్వార్ | కల్యాణ విమానము | మార్కండేయ మహర్షికి |
చెన్నై నుండి మహాబలిపురమునకు వెళ్ళే పలు బస్సులు తిరువిడందై మిదుగా వెళ్తాయి. చెన్నై నుండి కడలూరు, పుదుచ్చేరి, వేళంగణ్ణి, కుంభకోణము మొదలగు ప్రాంతాలకు వెళ్ళే దూరప్రాంతపు బస్సులు కూడా తిరువిడందై మీదుగా వెళ్తాయి. నగర బస్సుల వివరములు
బస్సు సంఖ్య | బస్సు వివరములు | కాల వ్యవధి | మార్గము |
---|---|---|---|
S517 | పల్లావరము-- వడనెమ్మేలి | 30 ని | క్రోంపేట, తాంబరము, పెరుంగళత్తూరు, వండలూరు, కండ్రిగ, మాంబాకము, పుదుపాకము, కేళంబాకము, కోవళము, చెమ్మంజేరి కుప్పము |
S599 | త్యా.నగరు-మహాబలిపురం | 32 ని | సైదాపేట, గిండి, అడైయాఱు, తిరువాన్మియూరు, కొట్టివాకము, పాలవాకము, నీలాంగరై, ఈంజంబాకము, కోవళము, చెమ్మంజేరి కుప్పము |
S588 | అడైయాఱు-మహాబలిపురం | 43 ని | తిరువాన్మియూరు, కొట్టివాకము, పాలవాకము, నీలాంగరై, చోళమండలము, ఈంజంబాకము, ఉత్తాండి, కోవళము, చెమ్మంజేరి కుప్పము |
Z568C | కోయంబేడు-మహాబలిపురం | 60 ని | గిండి, అడైయాఱు, తిరువాన్మియూరు, కొట్టివాకము, పాలవాకము, చోళమండలము, ఈంజంబాకము, కోవళము, చెమ్మంజేరి కుప్పము |
S589 | వేళచ్చేరి—మహాబలిపురం | 170 ని | తిరువాన్మియూరు, కొట్టివాకము, పాలవాకము, నీలాంగరై, చోళమండలము, ఈంజంబాకము, ఉత్తాండి, కోవళము, చెమ్మంజేరి కుప్పము |
Z599 | త్యా.నగరు-మహాబలిపురం | 190 ని | సైదాపేట, గిండి, అడైయాఱు, తిరువాన్మియూరు, కొట్టివాకము, పాలవాకము, నీలాంగరై, ఈంజంబాకము, కోవళము, చెమ్మంజేరి కుప్పము |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.