తిరువయిందిర పురమ్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరువయిందిర పురమ్ | |
---|---|
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | దెయ్‌వనాయకన్(దేవనాథన్) |
ప్రధాన దేవత: | వైకుంఠనాయకి(హేమాబ్జవల్లి) |
దిశ, స్థానం: | తూర్పు ముఖము |
పుష్కరిణి: | గరుడనది-శేషపుష్కరిణి |
విమానం: | చంద్రవిమానము |
కవులు: | తిరుమంగై ఆళ్వార్ |
ప్రత్యక్షం: | చంద్రునకు, గరుత్మంతునుకు |
విశేషాలు
శ్రీమత్ వేదాంతదేశికులు తపమాచరించిన ప్రదేశము. ఇక్కడ వేదాంత దేశికులు గరుడోపాసన చేసి గరుత్మంతుని వలన హయగ్రీవుల యనుగ్రహము పొందుటకై హయగ్రీవ మంత్రమును పొందాడు. ఇక్కడ ఉన్న కొండపై వారు ఆరాధించిన హయగ్రీవుల సన్నిధి ఉంది. ఈ కొండకు ఔషధాద్రి యనిపేరు. ఈక్షేత్రమున శ్రీమద్వేదాంతదేశికుడు నలుబది సంవత్సరములు నివసించాడు. ఆయన నివాసం స్వహస్తములతో నిర్మించిన నూతి (కిణర్) ఇప్పటికిని ఉంది. ఈక్షేత్రంలోని స్వామిని కీర్తిస్తూ శ్రీవేదాంత దేశికుని దేవనాయక పంచాశత్, అచ్యుతశతకం (ప్రాకృతభాష) -గరుడదండకం, గరుడ పంచాశత్, హయగ్రీవ స్తోత్రములు రచించబడ్డాయి. ఇచట మణవాళమహాముని సన్నిధి ఉంది.
ఉత్సవాలు
మేషము-పౌర్ణమి తీర్థోత్సవము-కన్యాశ్రవణం వేదాంతదేశికుల తిరునక్షత్ర మహోత్సవం చాలా వైభవముగా జరుగును.
సాహిత్యం
శ్లో. శ్రీమత్ తార్ద్య తరజ్గిణీ తటతలే శేషాఖ్య తీర్థాంచితే
దేవ శ్శ్రీమదహేంద్ర పట్టణ వరే చంద్రాఖ్య వైమానగ:|
వైకుంఠాఖ్య రమాయుతో విజయతే శ్రీ దేవనాథ ప్రభు:
ప్రాగాస్య స్థితి రిందు తార్ద్య విషయ స్తుత్య: కలిద్వేషిణ:||
పాశురాలు
పా. మిన్ను మాழிయజ్గై యవన్; శెయ్యవళుఱైతరు తిరుమార్వన్;
పన్ను నాన్మఱైప్పల్ పొరుళాగియ; పరనిడమ్ వరై చ్చారల్;
పిన్ను మాదవి ప్పన్దలిల్; పెడైవర ప్పిణియవిழ் కమలత్తు;
తైన్న వెణ్ఱు వణ్డిన్నిశై ముఱల్‌తరు; తిరువయిన్దిరపురమే.
తిరుమంగై ఆళ్వార్లు-పెరియ తిరుమొழி 3-1-2
వివరాలు
ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
దెయ్‌వనాయకన్ (దేవనాథన్) | వైకుంఠనాయకి (హేమాబ్జవల్లి) | గరుడనది-శేషపుష్కరిణి | తూర్పు ముఖము | నిలచున్న భంగిమ | తిరుమంగై ఆళ్వార్ | చంద్రవిమానము | చంద్రునకు, గరుత్మంతునుకు |
చేరే మార్గం
మద్రాస్ - తిరుచ్చి రైలు మార్గంలో తిరుప్పాప్పు లియూర్ స్టేషన్ నుండి 5 కి.మీ. టౌన్ బస్ ఉంది. మద్రాస్ నుండి మిగతా పట్టణముల నుండి "కడలూరు" బస్ గలదు. అక్కడ నుండి టౌన్ బస్ 5 కి.మీ.
చిత్రమాలిక
ఇవికూడా చూడండి
మూలాలు
వెలుపలి లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.