తిరుక్కోళూరు
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.
తిరుక్కోళూరు భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరుక్కోళూరు | |
---|---|
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
అక్షాంశ రేఖాంశాలు: | 8°35′48″N 77°57′28″E |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | "వైత్తమానిది" పెరుమాళ్(నిక్షిప్తవిత్తన్) |
ప్రధాన దేవత: | కోళూర్ వల్లి తాయార్ |
దిశ, స్థానం: | తూర్పు ముఖము |
పుష్కరిణి: | కుబేర పుష్కరిణి, తామ్రపర్ణీనది |
విమానం: | శ్రీకర విమానము |
కవులు: | నమ్మాళ్వార్లు |
ప్రత్యక్షం: | కుబేరునకు, మధురకవి యాళ్వార్లకు |
ఈ దివ్యదేశ పెరుమాళ్ల విషయమై ఆళ్వార్లు "వైత్తమానిదియామ్ మదుశూదనైయే యలత్తి" ("నిక్షిప్తవిత్తన్" (నిధివలెనున్నస్వామి) అగు మధుసూదనుని ఆర్తితో జపించి) " అని అపత్పఖత్వమను గుణమును(అనగా ఆపదలో ఆదుకొనుట) ప్రకాశింపజేసిరి. మఱియు ఈ దివ్యదేశమునకు "పుకుమూర్" అను విలక్షణమైన తిరునామమును కృపజేసిరి. అనగా ఇచటి స్వామియొక్క నిరుపమాన సౌందర్యమును సేవించినవారు వెనుదిరిగి వెళ్లలేరని భావము. నవనిధులు ఇచట దాగియున్నవని అధర్మము కుబేరునితో కొండెములు చెప్పెనట. ఆకారణమున ఈ క్షేత్రమునకు కోళూరు అను పేరు కలిగెనని చెప్పుదురు. ఇది మధురకవి ఆళ్వార్ల అవతారస్థలము
శ్లో. శ్రీకోళూర్ నగరే కుబేర సరసీ శ్రీ తామ్రపర్ణీ తటే
యుక్తే శ్రీ కర దేవయాన నిలయో భోగేశయ: ప్రాజ్ముఖ:|
శ్రీకోళూరు లతా పరిష్కృత వపు ర్నిక్షిప్త విత్త:ప్రభు:
కౌబేరాక్ష్యతిథి శ్శఠారి మునినా సంకీర్తితో రాజతే||
పా. ఉణ్ణుమ్ శోఱు పరుగునీర్; తిన్నుమ్ వెత్త్తిలైయు మెల్లామ్
కణ్ణన్; ఎమ్బెరుమానెన్ఱెన్ఱే; కణ్గళ్ నీర్ మల్గి;
మణ్ణి నుళవన్ శీర్ వళమ్మిక్క; వనూర్ వినవి;
తిణ్ణిమెన్నిళమాన్ పుగుమూర్;తిరుక్కోళూరే.
నమ్మాళ్వార్-తిరువాయిమొழி 6-7-1
ఏవం శ్రీ పాండ్య దేశస్థ స్థలానాం వర్ణితో మయా|
పురాణ సూక్త్యా యుక్తానాం వర్ణిత: శ్రీశ భక్తిత:||
శ్రియ: పతియందు గల భక్తితో పాంద్యదేశములోని దివ్యదేశములు వర్ణింపబడినవి.
మళయాళ దివ్య దేశములు
మలయాళ మహాదేశ దివ్య క్షేత్రేషు సంభవమ్|
విజ్ఞాపయామి విభవం యతిరాజ కటాక్షత:||
శ్రీ భగవద్రామానుజుల వారి కృపచే మలయాళ దేశము నందు గల దివ్య స్థలముల యొక్క వైభవమును ఇకపై విన్నవింతును.
ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
"వైత్తమానిది" పెరుమాళ్ (నిక్షిప్తవిత్తన్) | కోళూర్ వల్లి తాయార్ | కుబేర పుష్కరిణి, తామ్రపర్ణీనది | తూర్పు ముఖము | భుజంగ శయనము | నమ్మాళ్వార్లు | శ్రీకర విమానము | కుబేరునకు, మధురకవి యాళ్వార్లకు |
తెన్ తిరుప్పేరై నుండి ఆళ్వార్ తిరునగరి పోవు మార్గమున చిన్నకాలిబాట మార్గములో ఈ క్షేత్రము గలదు.
సింహమాసం పునర్వసు తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము జరుగును. తెన్ తిరుప్పేరై ఈ దివ్యదేశమునకు 3 కి.మీ దూరమున గలదు