ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం From Wikipedia, the free encyclopedia
తాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలో గలదు. ఇది నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలో భాగం.
తాడేపల్లిగూడెం | |
— శాసనసభ నియోజకవర్గం — | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
దేశము | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి |
ప్రభుత్వం | |
- శాసనసభ సభ్యులు |
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]
సంవత్సరం | శాసనసభ నియోజకవర్గం సంఖ్య | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2024[2] | 62 | తాడేపల్లిగూడెం | జనరల్ | బోలిశెట్టి శ్రీనివాస్ | పు | జనసేన పార్టీ | 116443 | కొట్టు సత్యనారాయణ | పు | వైఎస్సార్సీపీ | 53951 |
2019 | 62 | తాడేపల్లిగూడెం | జనరల్ | కొట్టు సత్యనారాయణ | పు | వైఎస్సార్సీపీ | 70741 | ఈలి వెంకట మధుసూదనరావు (ఈలి నాని) | M | టీడీపీ | 54275 |
2014 | 62 | Tadepalligudem | జనరల్ | పైడికొండల మాణిక్యాలరావు | M | BJP | 73339 | టీపీ గోపాల సత్యనారాయణ | M | YSRC | 59266 |
2009 | 181 | Tadepalligudem | జనరల్ | ఈలి వెంకట మధుసూదనరావు (ఈలి నాని) | M | PRAP | 48747 | కొట్టు సత్యనారాయణ | M | INC | 45727 |
2004 | 67 | Tadepalligudem | జనరల్ | కొట్టు సత్యనారాయణ | M | INC | 72477 | పసల కనక సుందరరావు | M | తె.దే.పా | 47544 |
1999 | 67 | Tadepalligudem | జనరల్ | యర్రా నారాయణస్వామి | M | తె.దే.పా | 60666 | కొట్టు సత్యనారాయణ | M | INC | 50175 |
1994 | 67 | Tadepalligudem | జనరల్ | పసల కనక సుందరరావు | M | తె.దే.పా | 57994 | కొట్టు సత్యనారాయణ | M | INC | 50061 |
1989 | 67 | Tadepalligudem | జనరల్ | పసల కనక సుందరరావు | M | తె.దే.పా | 54938 | ఈలి వరలక్ష్మి | F | INC | 53342 |
1987 | By Polls | Tadepalligudem | జనరల్ | ఈలి వరలక్ష్మి | FM | INC | 42062 | పసల కనక సుందరరావు (Bojji) | M | తె.దే.పా | 42031 |
1985 | 67 | Tadepalligudem | జనరల్ | యర్రా నారాయణస్వామి | M | తె.దే.పా | 49900 | ఈలి వరలక్ష్మి | F | IND | 29025 |
1983 | 67 | Tadepalligudem | జనరల్ | ఈలి ఆంజనేయులు | M | IND | 61310 | Mylavarapu Rajabhaskararao | M | INC | 18616 |
1978 | 67 | Tadepalligudem | జనరల్ | చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు | M | INC (I) | 39128 | ఈలి ఆంజనేయులు | M | INC | 31455 |
1972 | 67 | Tadepalligudem | జనరల్ | ఈలి ఆంజనేయులు | M | IND | 36604 | Kosuri Kanakalakshmi | M | INC | 32404 |
1967 | 67 | Tadepalligudem | జనరల్ | A. Krishnarao | M | INC | 24129 | Y. Anjaneyulu | M | IND | 20529 |
1962 | 74 | Tadepalligudem | జనరల్ | Alliuri Krishna Row | M | INC | 16847 | Gada Raghunayakulu | M | IND | 14712 |
1955 | 57 | Tadepalligudem | జనరల్ | నంబూరి శ్రీనివాసరావు | M | INC | 43157 | కె.ఎస్.రెడ్డి | M | సి.పి.ఐ | 31750 |
కిలాంబి వెంకట కృష్ణావతారం | పు | INC | 40412 | ఎన్.పోతురాజు | M | సి.పి.ఐ | 32510 | ||||
1952 | 57 | Tadepalligudem | జనరల్ | చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు | M | INC | 19844 | కిలాంబి వెంకట కృష్ణావతారం | పు | కృషీకార్ లోక్‌పార్టీ | 19359 |
1955లో నిర్వహించిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నంబూరి శ్రీనివాసరావు తన సమీప అభ్యర్థి శ్రీమత్ కిళాంబి వెంకట కృష్ణావతారంపై 2745 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నంబూరి శ్రీనివాసరావు 43157 ఓట్లు సాధించగా వెంకటకృష్ణావతారం 40412 ఓట్లు పొందారు.
1962 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అల్లూరి కృష్ణారావు తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి గాదె రఘునాయకులుపై 2135 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో అల్లూరి కృష్ణారావు 16,847 ఓట్లు, గాదె రఘునాయకులు 14712 ఓట్లు పొందారు.
1967లో నిర్వహించిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అల్లూరి కృష్ణారావు తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి ఈలి ఆంజనేయులుపై 3600 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కృష్ణారావుకు 24129 ఓట్లు, ఈలి ఆంజనేయులుకు 20529 ఓట్లు నమోదయ్యాయి.
1972లో నిర్వహించిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ఈలి ఆంజనేయులు తన సమీప ప్రత్యర్థి అభ్యర్థిని కోసూరి కనకలక్ష్మిపై 4200 ఓట్ల మెజారిటీతో గెలుపొంది శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. ఎన్నికలో ఈలి ఆంజనేయులు 36604 ఓట్లు, కోసూరి కనకలక్ష్మి 32404 ఓట్లు సాధించారు.
1978 ఎన్నికల్లో కాంగ్రెస్ (ఐ) అభ్యర్థిగా పోటీచేసిన చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు తన సమీప ప్రత్యర్థియైన కాంగ్రెస్ అభ్యర్థి ఈలి ఆంజనేయులు 7673 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు (కాంగ్రెస్ (ఐ) కు 39,128 ఓట్లు, ఈలి ఆంజనేయులు (కాంగ్రెస్) కు 31455 ఓట్లు నమోదయ్యాయి.
1985 శాసనసభ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి యర్రా నారాయణస్వామి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిని ఈలి వరలక్ష్మిపై 20వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
1987లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా పోటీచేసిన ఈలి వరలక్ష్మి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన పసల కనకసుందరరావుపై 31 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 1985లో గెలుపొంది శాసనసభ్యునిగా కొనసాగుతూ ఉన్న యర్రా నారాయణస్వామి (తెదేపా) 1987లో తన పదవికి రాజీనామా చేసి జిల్లాపరిషత్ ఎన్నికల్లో పోటీచేయడంతో ఉప ఎన్నిక నిర్వహించారు. ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించిన ఎన్నికలో నారాయణస్వామి గెలుపొంది జిల్లాపరిషత్ అధ్యక్ష పదవి చేపట్టారు. సాధారణంగా జిల్లాపరిషత్ ఎన్నికల్లో పరోక్ష పద్ధతిలో జిల్లా చైర్మన్‌ని ఎన్నుకుంటారు. ప్రత్యక్ష పద్ధతిలో పశ్చిమగోదావరిజిల్లాకు ఎన్నికైన ఏకైక జిల్లా పరిషత్ చైర్మన్‌గా యర్రా నారాయణస్వామి నిలిచారు.
1989లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పసల కనకసుందరరావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈలి వరలక్ష్మిపై గెలుపొంది శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.
1994లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీచేసిన పసల కనకసుందరరావు తన సమీప ప్రత్యర్థి ఐన కాంగ్రెస్ అభ్యర్థి కొట్టు సత్యనారాయణపై గెలుపొందారు.
1999 శాసనసభ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థి యర్రా నారాయణస్వామి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణపై గెలుపొంది ఎన్నికయ్యారు. యర్రా నారాయణస్వామి ఈ విజయంతో రెండవసారి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో రాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కనక సుందరరావుపై 24933 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. సత్యనారాయణకు 72477 ఓట్లు లభించగా, సుందరరావు 47544 ఓట్లు పొందినాడు.
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన యీలి వెంకట మధుసూదనరావు (నాని) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణపై గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ముళ్ళపూడి బాపిరాజు, భారతీయ జనతా పార్టీ తరఫున కైరం అప్పారావు, లోక్‌సత్తా పార్టీ అభ్యర్థిగా కె.ఎస్.రామచంద్రారావు పోటీచేశారు.[3]
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం అభ్యర్థి యీలి వెంకట మధుసూదనరావు (నాని) తన ప్రత్యర్థి కె.సత్యనారాయణ పై విజయం సాధించారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.