From Wikipedia, the free encyclopedia
డేనియల్ నెజర్స్ తెలుగు జానపద కళారూపాలు, ఆంధ్రప్రదేశ్ సామాజిక వ్యవస్థ వంటివాటిపై పరిశోధన చేస్తున్న ఫ్రెంచి సామాజిక శాస్త్రవేత్త.[1]
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
తెలుగుభాష నేర్చుకుని తెలుగు జానపద కళారీతుల్ని ఫ్రెంచి భాషలో వర్ణించి ఐరోపా ప్రజలకు పరిచయం చేసిన వక్త. డేనియల్ నెజర్స్ పుట్టి పెరిగింది పారిస్ లో
1963 లో లిష్ కెర్, భద్రిరాజు కృష్ణమూర్తి వ్రాసిన ఇంట్రడక్షన్ టూ స్పోకెన్ తెలుగు చదిని భాషగురించి తెలుసుకున్నారు. తెలుగు పాత సినిమాలు భూకైలాస్, జయభేరి చూసి యన్ టి రామారావు, అక్కినేని నాగేశ్వరరావు నటనకు సంతసించారు. అక్కడే ఓ తెలుగు మిత్రుడు 'గ్రహణం' సినిమా వీసీడీ బహుమతిగా ఇచ్చారు. వాళ్ళ బాబుకి ఐదునెలల వయస్సులో పెద్దాపురం వెళ్ళారు చుట్టుపక్కల వారు పిల్లవాడికి పెరుగన్నం పెట్టేవారు. ఇప్పుడతనికి 26 సంవత్సరాలు దాటాయి ఇటీవలె పెళ్ళయింది, ఇప్పటికీ పెదుగన్నం చాలా ఇష్టంగా తింటాడు. పెద్దాపురం నుండి పెళ్ళికి కొంతమంది హాజరయ్యారు.
ఓ ఫ్రెంచి దేశస్తుడు తెలుగు నేలపై కొన్నాళ్ళుండి తెలుగు నేర్చుకోవడమేకాకుండా మన జానపద పద్యాలను ఇతర సాహిత్యాన్ని ఫ్రెంచిలోకి అనువదించి ఇతరదేశస్తులకు పరిచయం చేశాడంటే తెలుగువారు గర్వించదగ్గ విషయం..
నేషనల్ ఇనిస్టిటూట్ అఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అండ్ సివిలైజేషన్ విశ్వవిధ్యాలయంలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. అక్కడి విద్యార్థులకు తెలుగు నేర్పిస్తున్నారు. అక్కడ తెలుగు భాషకు గుర్తింపు దక్కేలాగా ప్రయత్నం చేస్తున్నారు.
యానాం లోవుండే ప్రెంచి సంతతి ప్రజలు తెలుగు గురించి వివరించేవారు. అలా తెలుగంటే ఆసక్తి పెరిగింది.
దేనియల్ చక్కటి తెలుగు మాట్లాడుతారు. [పరిశోధనలో జానపదకళారూపాలగురించి, బొబ్బిలి, పల్నాటి చరిత్ర గురించి ఫ్రాన్సు దేశస్తులకు వివరించి చెప్పటం జరిగింది. పెద్దాపురంలో వుండగా నిత్యం తెలుగులో మాట్లాడేవారు. అలా తెలుగు నేర్చుకుని అప్పుడు ఫ్రాన్సు అధీనంలో వుండే యానాం. అక్కడ ఇప్పటికీ ప్రెంచి సంతతి ప్రజలు వున్నారు అక్కడికి వెళ్ళి రెండు నెలలు యానాంలో గడిపారు.
వేమన పద్యాలు, చింతామణి నాటకాన్ని మొదలైన 150 శతకాలు ప్రెంచి భాషలోకె అనువదించారు.
[పారిస్]]లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఎంఫిల్ ధీసిస్ పనిమీద తూర్పుగోదావరి జిల్లా పెద్ధాపురం 1983 లో వచ్చి రెండునెలలు ఉన్నారు. 1985 లో ఎంఫిల్ ధీసిస్ సమర్పించారు. తరువాత 5 నెలల వయస్సున్న బాబుతొ కలిసి 1986 నుండి 1990 వరకు పెద్దాపురంలో ఉన్నారు. జానపద కళారూపాలైన బుర్రకథలు, హరికథలు, తోలుబొమ్మలాట, గొల్లసుద్దులు మొదలగు అంశాలపై (పి హె చ్ డీ) పరిశోధనచేశారు.వందలమంది కళాకాఅరులను, రచయితలను కలుసుకొని సమాచారం సేకరించారు. 1997 లో పి హె చ్ డీ ధీసిస్ సమర్పించారు.
ఫ్రాన్సులో పురాతన కట్టడాలను చెక్కుచెదరకుండా రక్షించుకుంటారు. హైదరాబాదు మీద అతని అభిప్రాయం: పురాతన కట్టడాలు చాలావున్నాయి, కొన్ని కనుమరుగవుతున్నాయి. కాలుష్యము ఎక్కువ. ఒక్కోసారి 10-20 నిమిషాలు జాప్యం తప్పదు. ఫ్రాన్సులో ప్రజారవాణాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఫ్రాన్సులో దాదాపు 400-600 తెలుగు కుటుంబాలుంటాయి. వారిలో ఎక్కువగా యానాం ప్రాంతం నుండి వచ్చినవారే.
ఈ రచయిత హైదరాబాదు, బంజారాహిల్స్ లోని, ఫ్రెంచి కన్సులేట్ ఆఫీసులో డేనియల్ నెజర్స్ ను పోయిన ఏడాది కలిసి ముచ్చటించడం, ఫ్రెంచి భాషలోకి అనువదించిన వేమన పధ్యాల కొన్ని పేజీలను తీసుకోవటం జరిగింది.
ఆయన ఫ్రెంచిభాషలోకి అనువదించిన కొన్నిపద్యాలు
గుణయుతునకు మేలు గోరంత చేసిన
కొండయగును వాని గుణము చేత
కొండయంత మేలు గుణహీనుడెరుగునా
విశ్వదాభిరామ వినురవేమ!
Un rien de bienfait a un homme de bien
S'erige haute colline en vertu de sa qaualite
Que voit un belitre d'une colline de bienfait?
Visvadabhirama vinura vema
నిండునదులు పారు నిల్చి గంభీరమై
వెఱ్ఱివాగు పాఱు వేగబొర్లి
అల్పుడాడురీతి నధికుండు నాడునా
విశ్వదాభిరామ వినురమేమ1
Fleuves majestueux rivieres roulent en leur clos
Torrents tortueuxx impetueux crepitent lelurs flots
Hommes bien s'ebrouent-ils comme gens de peu?
Visvadaabhirama vinura vema
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.