డెంగూ వైరస్
From Wikipedia, the free encyclopedia
డెంగూ వైరస్ దోమల ద్వారా వ్యాపించి డెంగూ జ్వరం కలుగజేస్తుంది. డెంగ్యూ వైరస్లు సోకిన ఈడిస్ జాతి (ఎ. ఈజిప్టి లేదా ఎ. ఆల్బోపిక్టస్) దోమ కాటు ద్వారా ప్రజలకు వ్యాపిస్తాయి. ఈ దోమలు జికా, చికున్ గున్యా, ఇతర వైరస్ లను కూడా వ్యాప్తి చేయగలవు. ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది, సుమారు 400 కోట్ల మంది డెంగూ ముప్పు ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రతి సంవత్సరం 40 కోట్ల మంది డెంగ్యూ వైరస్ బారిన పడుతున్నారు. డెంగ్యూ వైరస్ వ్యాప్తితో 100 మిలియన్ల మంది ప్రజలు సంక్రమణతో అనారోగ్యానికి గురవుతారు,40,000 మంది ప్రమాదకరమైన డెంగ్యూతో మరణిస్తున్నారు.డెంగూ వైరస్ 1, 2, 3, 4. డెంగూ వైరస్ నాలుగు సంబంధిత వైరస్ లలో ఏదో ఒకదాని వల్ల సంభవిస్తుంది. ఒక వ్యక్తి తన జీవితంలో అనేకసార్లు డెంగూ బారిన పడవచ్చు[1].
డెంగూ వైరస్ | |
---|---|
![]() | |
ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినితో డెంగూ చిత్రపటం. | |
Virus classification | |
Group: | Group IV ((+)ssRNA) |
Family: | Flaviviridae |
Genus: | Flavivirus |
Species: | Dengue virus |
అవలోకనం
డెంగూ (డెంగూ-గీ) జ్వరం అనేది దోమల ద్వారా వ్యాపించే అనారోగ్యం, ప్రపంచంలోని ఉష్ణమండల, ఉపఉష్ణమండల ప్రాంతాలలో సంభవిస్తుంది. తేలికపాటి డెంగ్యూ జ్వరం అధిక జ్వరం, ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుంది. డెంగూ జ్వరం తీవ్రమైన రూపం "డెంగూ హెమరేజిక్ ఫీవర్" అని పిలుస్తారు, ఎక్కువగా రక్తస్రావం, రక్తపోటు ఆకస్మికముగా తగ్గడం,మరణానికి కారణమవుతుంది.
ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో డెంగూ వైరస్ సంక్రమణ కేసులు రావడం జరిగుతున్నది. డెంగూ జ్వరం ఆగ్నేయాసియా, పశ్చిమ పసిఫిక్ దీవులు, లాటిన్ అమెరికా, ఆఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వ్యాధి ఐరోపా, యునైటెడ్ స్టేట్స్ దక్షిణ ప్రాంతాలలో సహా కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తోంది.
డెంగూ జ్వరం వ్యాక్సిన్లపై పరిశోధకులు పరిశోధనలు చేస్తున్నారు. ప్రస్తుతానికి, డెంగూ జ్వరం సాధారణంగా ఉన్న ప్రాంతాలలో, సంక్రమణను నివారించడానికి ఉత్తమ మార్గాలు దోమల కాటుకు గురికాకుండా ఉండటం, దోమల సంఖ్యను తగ్గించడానికి చర్యలు తీసుకోవడం. డెంగు భాదితులు చాలా మంది సంక్రమణ సంకేతాలు లేదా లక్షణాలను తెలుసుకోలేరు. అవి ఇతర అనారోగ్యాలు - ఫ్లూ వంటివి - అని తప్పుగా రోగులు భావిస్తారు. బాధితునికి సోకిన దోమ కాటు వేసిన నాలుగు నుండి లక్షణాలు 10 రోజుల తర్వాత ప్రారంభమవుతాయి.చాలా మంది వారం రోజుల్లోనే కోలుకుంటారు. కొన్ని సందర్భాల్లో, లక్షణాలు తీవ్రమవుతాయి ఇవి ప్రాణాంతకం కావచ్చు. దీనిని డెంగూ హెమరేజిక్ ఫీవర్ లేదా డెంగూ షాక్ సిండ్రోమ్ అంటారు[2].
జ్వరం లక్షణాలు
డెంగూ లక్షణాలు వైరస్ సంక్రమణ తర్వాత నాలుగు నుండి ఆరు రోజుల వరకు మొదలై 10 రోజుల వరకు ఉంటాయి, ఈ లక్షణాలలో ఆకస్మిక, ఎక్కువగా జ్వరం, తలనొప్పి, కళ్ళ వెనుక నొప్పి,న కీళ్ళు,కండరాల నొప్పులు అధికంగా ఉండటం, అలసట, వికారం, వాంతి వచ్చేలా ఉండటం, జ్వరం వచ్చిన రెండు నుంచి ఐదు రోజుల తర్వాత కనిపించే చర్మము పై దద్దుర్లు,తేలికపాటి రక్తస్రావం (ముక్కు నుండి రక్తస్రావం, చిగుళ్ళ నుండి రక్తస్రావం) వంటివి ఉంటాయి[3] .
చికిత్స
డెంగ్యూ సంక్రమణకు నిర్దిష్ట మందు లేదు. డెంగ్యూ జ్వరం ఉందని తెలిస్తే ఎసిటమినోఫెన్తో నొప్పి నివారణలను ఉపయోగించాలి, ఆస్పిరిన్ మందులను నివారించాలి, ఎందుకంటే ఈ ఆస్పిరిన్ మందు రక్తస్రావాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. రోగి విశ్రాంతి తీసుకోవడం, నీరు, ద్రవ పదార్థాలు ఎక్కువ గా త్రాగాలి, తొందరగా వైద్యుడిని కలవాలి.
నివారించడం
వ్యాధిని నివారించడానికి ఉత్తమ మార్గం సోకిన దోమల కాటును నివారించడం, ప్రజలకు సోకకుండా నిరోధించడానికి ప్రస్తుతం వ్యాక్సిన్ లేదు. ఇంటి లోపల,ఆరుబయట ఉన్నప్పుడు, నిలువైన షర్టులు, ప్యాంట్లను,సాక్స్ ధరించడం. ఇంటి లో ఉన్నప్పుడు, అందుబాటులో ఉంటే ఎయిర్ కండిషనింగ్ ఉపయోగించవలెను. ఇంటి తలుపులకు. కిటికీలకు దోమలు రాకుండా మెష్ వేయడం , ప్రజలు దోమతెరలను ఉపయోగించడం, పరిసరాలను శుభ్రతగా ఉంచుకోవడం వంటివి ప్రజలు డెంగ్యూ జ్వరం బారిన పడకుండా చేసుకోవాలి. డెంగ్యూ లక్షణాలు ఉంటే, ఎటువంటి అశ్రద్ధ చేయకుండా వైద్యుడిని కలవడం వంటివి చేయవలెను.
జాతీయ డెంగీ దినోత్సవం
ప్రతి సంవత్సరం మే 16న జాతీయ డెంగీ దినోత్సవం జరుపుకుంటారు. వ్యాధి నివారణకు అవగాహన కల్పించడానికి, ప్రోత్సహించే చర్యలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏటా మే 16 న జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని చేపట్టిన కార్యక్రమం. జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా పలు స్థాయిల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. భారతదేశంలో ఎక్కువగా ప్రబలుతున్న దోమల ద్వారా సంక్రమించే వ్యాధులలో డెంగ్యూ ఒకటి. 2023 సంవత్సరం ప్రజలకు ఇచ్చిన పిలుపు (థీమ్ ) 'డెంగీపై పోరాడండి, ప్రాణాలను కాపాడండి'[4].
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.