అస్సాంకు చెందిన భారతీయ రాజకీయ నాయకుడు From Wikipedia, the free encyclopedia
దేవ్ కాంత్ బారూవా, (1914 ఫిబ్రవరి 22- 1996 జనవరి 28) అస్సాంకు చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. భారతదేశ అత్యవసర స్థితి సమయంలో (1975-77) భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. అతను అస్సాం నుండి జాతీయ కాంగ్రెసుకు మొదటి అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి.
డి. కె. బారువా | |
---|---|
భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు | |
In office 1975–1977 | |
అంతకు ముందు వారు | శంకర్ దయాల్ శర్మ |
తరువాత వారు | ఇందిరా గాంధీ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1914 ఫిబ్రవరి 22 |
మరణం | 1996 జనవరి 28 81) | (వయసు
జాతీయత | భారతీయ |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
బారువా 1914 ఫిబ్రవరి 22న అస్సాం ప్రావిన్స్ (ప్రస్తుత అస్సాం) లోని డిబ్రూగర్లో నీల్కాంత బారువాకు జన్మించాడు.అతను నౌగాంగ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు.
బారువా భారత స్వాతంత్ర్య పోరాటంలో చేరిన తర్వాత అతను 1930, 1941, 1942 లలో ఖైదు చేయబడ్డాడు.[1].బారువా రాజకీయ జీవితం రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా (1949-1951) ప్రారంభమైంది.[2] అతను అప్పుటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీని గురించి "భారతదేశం ఇందిరా - ఇందిరా భారతదేశం." అని తన సి.1974లో ప్రకటన చేసాడు.[3] ఏదేమైనా అతను తరువాత ఆమె నుండి విడిపోయాడు. కాంగ్రెస్ (యు) లో చేరాడు. తరువాత అది భారత (సోషలిస్ట్) గా పేరు మారింది. అతను 1971 ఫిబ్రవరి 1 నుండి 1973 ఫిబ్రవరి 4 వరకు బీహార్ గవర్నర్‌గా పనిచేసాడు.అస్సాం రాష్ట్ర శాసనసభ సభ్యుడుగా, (1957-62, 1962-67 1967-72) మూడు పర్యాయాలు పనిచేసాడు. కొంతకాలం అస్సాం ప్రభుత్వంలో విద్య, సహకార మంత్రిగా పనిచేసాడు. లోక్‌సభ సభ్యుడుగా (1952-57) పనిచేసాడు. ఆ కాలంలో పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ చీఫ్ విప్‌గా కూడా పనిచేసాడు. రాజ్యసభ సభ్యుడుగా (1973-74, 1974—77) పనిచేసాడు. కేంద్ర పెట్రోలియం, రసాయనాల మంత్రి (1973-74) చేసాడు.1954, 1955 1974 లలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు బృందం సభ్యుడుగా, న్యూజిలాండ్ కామన్వెల్త్ సమావేశానికి ప్రతినిధిగా వ్యవహరించాడు.[4]
బారువా ఒక ప్రముఖ కవి. అతని అస్సామీ కవితా సంకలనం, సాగర్ దేఖిసా (সাগৰ দেখিছা ) ఇప్పటికీ చాలా ప్రజాదరణలో ఉంది.అతను ప్రముఖ అస్సామీ కవి నబకాంత బారువాకు అన్నయ్య అవుతాడు.
అతను న్యూఢిల్లీలో 1996 జనవరి 28న మరణించాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.