From Wikipedia, the free encyclopedia
డియెగో గార్సియా అనేది హిందూ మహాసముద్రం లోని ఒక ద్వీపం. ఇది చాగోస్ ద్వీపసమూహంలో ఒకటి. ఇది బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీలో ఉన్న అనేక ద్వీపాల్లో ఇది ఒకటి. ఇదే అత్యంత పెద్దది కూడా. బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీ మొత్తం విస్తీర్ణం 60 చ.కి.మీ. కాగా ఒక్క డియెగో గార్సియా విస్తీర్ణం 27 చ.కి.మీ. ఉంటుంది. 1965 లో మారిషస్ కు స్వాతంత్య్రం ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఈ ద్వీపాన్ని (ద్వీపసమూహాన్ని) బ్రిటిషు వారు స్వాధీన పరుచుకున్నారు. ఇది కన్యాకుమారికి 1796 కి.మీ దూరంలో ఉంది.
2017లో ఐరాస ఈ ద్వీపం వివాదాన్ని అంతర్జాతీయ న్యాయస్థానానికి సమీక్షించడానికి పంపింది.[1] అయితే 2019 లో ధర్మాసనం ఈ ద్వీపాన్ని తిరిగి మారిషస్ కు ఇవ్వాల్సిందిగా తీర్పు ఇచ్చింది.[2] కానీ బ్రిటిషు వారు ఇంకా ఈ ద్వీపాన్ని వారి ఆధీనంలోనే ఉంచుకున్నారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రిటిషు వారు ఈ ద్వీపాన్ని ఒక ఒప్పందం ప్రకారం అమెరికాకి లీజు కిచ్చింది. 2036 వరకు ఈ ఒప్పందం అమలులో ఉంటుంది. అప్పటి వరకూ ఇక్కడి నుండి తప్పుకునే ఆలోచనేదీ లేదని అమెరికా ప్రకటించింది. [3]
Seamless Wikipedia browsing. On steroids.