డల్లాస్ రాధాకృష్ణ దేవాలయం
అమెరికా, టెక్సాస్‌లోని అలెన్‌లో ఉన్న ఒక హిందూ దేవాలయం. From Wikipedia, the free encyclopedia
డల్లాస్ రాధాకృష్ణ దేవాలయం, అమెరికా, టెక్సాస్‌లోని అలెన్‌లో ఉన్న ఒక హిందూ దేవాలయం. స్వామి ముకుందానంద నేతృత్వంలో ఈ దేవాలయం స్థాపించబడింది.
డల్లాస్ రాధాకృష్ణ దేవాలయం | |
---|---|
రాధాకృష్ణ చిత్రం | |
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 33.121133°N 96.680161°W |
దేశం | యునైటెడ్ స్టేట్స్ |
రాష్ట్రం | టెక్సాస్ |
ప్రదేశం | అలెన్ |
సంస్కృతి | |
దైవం | రాధ శ్రీకృష్ణుడు |
ముఖ్యమైన పర్వాలు | శ్రీకృష్ణ జన్మాష్టమి, రాధాష్టమి |
చరిత్ర, నిర్వహణ | |
నిర్మించిన తేదీ | 2017 జూలై 4 |
సృష్టికర్త | స్వామి ముకుందానంద |
వెబ్‌సైట్ | http://radhakrishnatemple.net |
ప్రారంభం
2017 జూలై 4 నుండి 11 వరకు ఎనిమిది రోజులపాటు దేవాలయ ప్రారంభ వేడుకలు, ఉత్సవాలు జరిగాయి. ఈ వేడుకకు అలెన్, ఫ్రిస్కో మేయర్‌లు, ఇతర ప్రముఖులు, సమీపంలోని హిందువులు హాజరయ్యారు.[1] [2] 2017 జూలై 9న[3] రాధ, కృష్ణుల నిలువెత్తు విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. కొంతకాలం తరువాత శ్రీరాముడు, సీత, హనుమంతుడు, వినాయకుడు విగ్రహాలు ఆవిష్కరించబడ్డాయి.
నిర్మాణం
శిల్పశాస్త్రంలో నిర్దేశించిన దేవాలయ నిర్మాణ మార్గదర్శకాల ప్రకారం ఈ దేవాలయ నిర్మాణం జరిగింది.
కార్యక్రమాలు
ఈ దేవాలయంలో దీపావళి, హోలీ, రాధాష్టమి వంటి అన్ని ప్రధాన హిందూ పండుగలు జరుపబడుతాయి.[4][5] దేవాలయంలో సంస్కృతి, యోగా వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతాయి. దేవాలయం హిందీ, ప్రోగ్రామింగ్, టోస్ట్‌మాస్టర్‌ల వంటి శిక్షణ తరగతులను కూడా అందిస్తోంది.
2020, మే నెలలో భూమి పూజన్ వేడుకతో సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ నిర్మాణం ప్రారంభమైంది. 20,000 చదరపు అడుగుల భవనంలో సాంస్కృతిక కార్యక్రమాలు, వివాహ వేడుకలు, వర్క్‌షాప్‌లు, తరగతులు, యోగా, ధ్యాన తరగతులు, ఇతర కమ్యూనిటీ కార్యకలాపాలకు సౌకర్యంగా ఉంటుంది.[6]
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.