కొబ్బరి ఒక ముఖ్యమైన పామ్ (Palm) కుటుంబానికి చెందిన వృక్షం. దీని శాస్త్రీయ నామం 'కోకాస్ న్యూసిఫెరా' (Cocos Nucifera). కోకాస్ ప్రజాతిలో ఇది ఒక్కటే జాతి ఉంది. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. కొబ్బరి చెట్టు 30 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. కొబ్బరి కాయ రూపంలో కొబ్బరి చెట్ల నుండి లభిస్తుంది. హిందువులకు ఒక ముఖ్యమైన పూజా ద్రవ్యం. దీనినే నారికేళం, టెంకాయ అని కూడా పిలుస్తారు. దీనిని రకరకాల ఆహార పదార్థాలలో రకరకాల రూపాలలో వినియోగిస్తారు. కొబ్బరి చెట్లనుండి వివిధరకాల పదార్ధాలు అనేకమైన పద్ధతులలో ఉపయోగపడుతున్నాయి. ప్రతి సంవత్సరం సెప్టెంబరు 2న ప్రపంచ కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు.[1][2]

త్వరిత వాస్తవాలు కొబ్బరి, Conservation status ...
కొబ్బరి
Thumb
Coconut Palm (Cocos nucifera)
Conservation status
Secure
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Arecales
Family:
Genus:
కోకాస్
Species:
కో. న్యూసిఫెరా
Binomial name
కోకాస్ న్యూసిఫెరా
మూసివేయి
Thumb
విశాఖపట్నంలో కొబ్బరి చెట్లు
Thumb
కొబ్బరికాయ

వివరాలు

కొబ్బరి చెట్లు కోస్తా ప్రాంతాలలోనూ, ఇసుక ప్రాంతాలలోను ఎక్కువగా పెరుగుతాయి. సారవంతం కాని నేలలో కూడా ఇవి పెరుగుతాయి. ఈ చెట్టు సుమారు 100 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇవి సుమారు 100 సంవత్సరాలపాటు జీవించి వుంటాయి. 7 సంవత్సరాల వయసు రాగానే ఈ చెట్టు నెలనెలా చిగురిస్తూ, పూతపూస్తూ ఉంటుంది. భారతదేశపు సాంస్కృతిక జీవనంలో కొబ్బరి చెట్టుకు ఒక ముఖ్యమైన స్థానం ఉంది. దీనిని కల్పవృక్షం - స్వర్గానికి చెందిన చెట్టు అంటారు. ఇది మనకు కావలసిన ఆహారాన్నీ, పానీయాన్నీ, తలదాచుకునే చోటునీ, జీవితానికి కావలసిన ఇతర నిత్యావసర వస్తువులనూ ప్రసాదిస్తుంది. ఉష్ణ ప్రాంతంలో నివసించేవారికి ఇదొక శుభకరమైన చెట్టు. పూజలలో, పెళ్ళిళ్ళలో, ఇతర ఉత్సవాల సమయంలో దీనిని వాడడం జరుగుతుంది.

శాస్త్రీయ విశ్లేషణ

కొబ్బరికాయలో నీరు, కండ ఉంటాయి. నీరు, కండ, గట్టితనంగల నారతో కప్పబడి ఉంటుంది. కొబ్బరి బోండాలోని నీళ్ళు చాలా పౌష్టిక గుణాలను కలిగి ఉంటాయి. దీనికి ఔషధగుణాలు కూడా ఉన్నాయి. బలహీనంగా ఉన్న వ్యక్తికి గ్లూకోజ్ దొరకనప్పుడు డ్రిప్స్‌గా కొబ్బరి నీళ్ళను ధారాళంగా వాడతారు. ఈ నీళ్ళు శరీరంలోని వేడిని తగ్గించి కావలసిన చల్లదనాన్ని ఇస్తాయి. ఇది దప్పికను కూడా తీరుస్తుంది. ఇందులో గ్లూకోజ్‌తోపాటు పొటాషియం, సోడియంలాంటి ఖనిజాలు ఉంటాయి. ఆ కారణంగా దీన్ని నెల శిశువు కూడా ఇవ్వవచ్చు. ఇది సులభంగా జీర్ణం అవుతుంది. కొబ్బరి [3]

కొబ్బరి - ఆరోగ్యం

ఇందులో ఎలెక్ట్రోలిటిక్ ఉన్నందువల్ల తక్కువ మూత్ర విసర్జన జరుగుతున్నప్పుడు, జలోదరానికీ, మూత్ర విసర్జన ధారాళంగా జరిగేందుకూ, డయేరియా కారణంగా శరీరంలోని నీరు తగ్గిపోయినప్పుడూ, దిగ్భ్రాంతి కలిగినప్పుడూ, లేత కొబ్బరికాయ నీళ్ళను వాడవచ్చు. అతిసారం, చీము రక్తం భేదులు, శూల వల్ల కలిగే పేగుల మంటను చల్లార్చడానికి దీనిని వాడవచ్చును. హైపర్ అసిడిటి ఉన్నప్పుడు కూడా దీన్ని వాడవచ్చును. కొబ్బరి నీరు వాంతులను, తల తిరగడాన్ని ఆపుచేస్తుంది. కలరా వ్యాధికి ఇది మంచి విరుగుడు. కారణం అతిసారం భేదుల వల్ల, వాంతుల వల్ల శరీరంలో తగ్గిపోయిన పొటాషియాన్ని శరీరానికి సరఫరా చేయగలగడమే. మూత్ర విసర్జనను ఎక్కువ చేయగలగడం వల్ల శరీరంలో ఉన్న విష పదార్ధాలను బయటకు గెంటడం వల్ల అంటురోగాల వల్ల కలిగే జ్వరాలకు ఇది వాడబడుతుంది. లేత కొబ్బరికాయ కొంత ముదిరినప్పుడు అందులో ఉన్న నీరు జెల్లీలాగా తయారవుతుంది. దీనిని "స్పూన్ కోకోనట్" అంటారు. రుచికరంగా ఉంటూ ఇది సులభంగా జీర్ణమవుతుంది. ఇందులో నూనె, పిండిపదార్ధాలు, మాంసకృత్తుల వల పేగులలో కుళ్ళిపోవడం అన్నది జరగదు. ఆ కారణంగా ఇది మెరుగైన మాంసకృత్తులతో కూడిన ఆహారంగా భావించబడుతోంది. అంతేకాదు ఇది శరీరంలో ఎలాంటి విషంతో కూడిన వస్తువును చేరనివ్వదు. ఇందులో ఉన్న మెత్తటి కండను గాయాలకు రాయవచ్చును. ఈ కండకు గాయాలను మాపే ఔషధ గుణం ఉంది.

బాగా పండిన కొబ్బరిలో నూనె ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది భేదిమందుగా, క్రిమినాశనిగా కూడా వాడబడుతుంది. నూనె కడుపులో ఉన్న ఆమ్ల విసర్జనను అణిచిపెడుతుంది. కాబట్టి అసిడిటికి ఇది మంచి మందు. పొడిదగ్గు, ఎదనొప్పి నుండి ఇది మనిషికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కొబ్బరిని తురిమి కూరలకూ, చట్నీలకూ, తీపిపదార్ధాల తయారీకీ వాడతారు. బెల్లంతో కలిపి కొబ్బరిని తింటే మోకాళ్ళ నొప్పులు రావు. కొలెస్టెరాల్ ఎక్కువై బాధపడుతున్న వారు కొబ్బరి తినకూడదు

కొబ్బరి

Thumb
కొబ్బరి చెట్టు

ప్రాచీన కాలంలో విశ్వమంతటా ఆరోగ్య పరిరక్షణకు వాడిన సహజ ఫలము కొబ్బరి . నేటి ఆధునిక మేధావి వర్గం కొబ్బరి అనేక ఆరోగ్య సమస్యలకి సమాదానమంటావుంది . సాంకేతికముగా కొబ్బరిని కోకోస్ న్యుసిఫేరా (CocosNeucifera) అంటారు . నుసిఫెర అంటే పొత్తుతో కూడుకున్నదని అర్ధము (Nutbearing) ప్రపంచములో మూడవ వంతు జనాభా వాళ్ల ఆహారములోను, ఆర్థిక సంపత్తులోను, ప్రతి పూజా-పవిత్ర కార్యక్రమములోను చాల భాగము కొబ్బరితోనే ముడిపడి ఉన్నది . కొబ్బరికాయను అందరూ శుభప్రధముగా భావిస్తారు. మనదేశములో శుభకారార్యాలకు కొబ్బరికాయ తప్పనిసరి. కొబ్బరికాయ లేని పండుగ లేదంటే అతిశయోక్తి కాదు. కేరళీయులకైతే రోజూ అన్నింటిలోనూ కొబ్బరికాయ, కొబ్బరినూనె తప్పనిసరిగా వుండి తీరవలసినదే . వారి ఆరోగ్యమూ, సంపదా కొబ్బరిపంట మీద అదారపడివున్నాయి . కోట్లాదిమంది జనం కొబ్బరిపంటనే జీవనాదారం చేసుకుని వుంటున్నారు . కొబ్బరికాయలో నలబైతొమ్మిది శాతం లారిక్ యాసిడ్ వుంటుంది . ఇది తల్లి పాలకు దాదాపు సరిసమానం అంట. కొబ్బరినూనెలో వుండే పాటియాసిడ్స్, వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్ వంటి మానవజాతి ఎదుర్కునే రుగ్మతలను తగ్గించడములో సహాయపడతాయి. పోషకాలతో కూడిన ఆహారాన్ని, పానీయాన్ని అందిచడముతో పాటు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది . కొబ్బరిచెట్టులో ప్రతీ భాగము అన్నిరకాలగాను ఉపయోగపడుతొంది . అందుకే దీనిని మానవుల పాలిట కల్పవృక్షము అంటారు . మీకు తెలుసా ? కొబ్బరికాయకు కూడా ఒక రోజు ఉందని .అదే ప్రపంచ శ్రీ ఫల దినోత్సవము (కోకోనట్ డే) ప్రతీ సంవత్సరము సెప్టెంబరు రెండు న జరుపుతారు .

Thumb
కుంభమేళా వద్ద కొబ్బరికాయలు
దస్త్రం:కొబ్బరి , అల్లం చట్నీలు.jpg
కొబ్బరి, అల్లం చట్నీలు

కొబ్బరి నీరు

ఏ ఋతువులో అయిన తాగదగినవి కొబ్బరి నీరు . లేత కొబ్బరి నీటిలో కార్బోహైడ్రేట్స్ తక్కువ గాను, క్రొవ్వులు అస్సలుండవు, చెక్కెర పరమితం గాను ఉండును . కొబ్బరి బొండం నీటిలో పొటాసియం ఎక్కువగా ఉంటుంది . శరీరములో నీటి లేమిని (Dehydration) కరక్ట్ చేస్తుంది .

కొబ్బరి నీరు (Coconut Water) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వేసవిలో శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు కొబ్బరి నీళ్లను తప్పనిసరిగా తాగాలి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాలేయం కూడా ఆరోగ్యం (health) గా ఉంటుంది. కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. రోజూ కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరంలోని అనేక రకాల టాక్సిన్స్ బయటకు వస్తాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల గుండె (Heart Health) ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. బరువు తగ్గాలంటే కొబ్బరి నీళ్లు కూడా తాగాలి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసుకుందాం.[4]

వైద్య పరంగా

Thumb
మామిడి, కొబ్బరి రోటి పచ్చడి

జీర్ణకోశ బాధలతో బాధపడే చిన్నపిల్లలకు కొబ్బరి నీరు మంచి ఆహారము, విరేచనాలు అయినపుడు (diarrhoea) ఓరల్ రి-హైద్రాషన్ గా ఉపయోగపడుతుంది, (Oral re-hydration), పొటాసియం గుండె జబ్బులకు మంచిది, వేసవి కాలములో శరీరాన్ని చల్లబరుస్తుంది, వేసవిలో చెమట కాయలు, వేడి కురుపులు, అమ్మవారు జబ్బు పొక్కులు తగ్గేందుకు కొబ్బరినీతిని లేపనం గావాడాలి . కొన్ని రకల పొట్టపురుగులు కొబ్బరి నీటివల్ల చనిపోతాయి,, ముత్రసంభందమైన జబ్బులలోను, కిడ్నీ రాళ్ళు సమస్యలలో ఇది మంచి మందుగా పనిచేస్తుంది . మినెరల్ పాయిజన్ కేసులలో పాయిజన్ ని క్లియర్ చేస్తుంది.

కొబ్బరి పాలు

పచ్చికొబ్బరిలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. కొబ్బరి నీళ్లు, పాలు మంత్ర జలంలా పనిచేస్తాయి. దీనిలో విటమిన్ ఎ, బి, సి, రైబోఫ్లెవిన్, ఐరన్, కాలసియం, ఫాస్పరస్, పిండిపదార్థాలు, కొవ్వు, ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. కొబ్బరి కాయ ముదిరిపోయాక లోపల పువ్వు వస్తుంది. అది గర్భాశయానికి మేలు చేస్తుంది. బాలింతలు అధిక రక్తస్రావముతో ఇబ్బంది పడుతుంటే కొబ్బరి పువ్వు జ్యూస్‌ను తాగితే సత్వర ఉపశమనం కలుగుతుంది. నిత్యం కొబ్బరి నీళ్లు తాగితే మూత్రపిండాల సమస్యలు దరిచేరవు. శరీరానికి చల్లదనం లభిస్తుంది. గొంతు మంట, నొప్పిగా ఉన్నప్పుడు కొబ్బరిపాలు తాగితే తగ్గుతుంది.

కొబ్బరి నూనె

Thumb
కొబ్బరి కురిడీ
Thumb
కొబ్బరి కుడకలు (ఎండుకొబ్బరి)

కొబ్బరి నూనెలో యాబై శాతం లారిక్ ఆసిడ్ ఉంటుంది. దీన్ని వంటల్లో అధికంగా ఉపయోగిస్తే గుండెకు రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. కొవ్వు శాతము పెరగదు. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొబ్బరి నూనెలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కోమలంగా తయారు చేస్తుంది. రోజూ రెండు చెంచాలు నూనే తీసుకుంటే జీర్ణ వ్యవస్థకు మంచిది. థైరాయిడ్ సమస్యలూ ఉండవు. పొడి చర్మము ఉన్నవారు పచ్చికొబ్బరి తింటే శరీరానికి సరిపడా తేమ అందుతుంది, కొబ్బరి పాలు చర్మానికి పట్టిస్తే మృతకణాలు, మురికి తొలగిపోతాయి. మేను ప్రకాశవంతముగా మెరుస్తుంది. ఇది జుట్టుకు మేలు చేస్తుంది. కొబ్బరి పాలు తలకు పట్టిస్తే, కేశాలు కాంతి వంతముగా తయారౌతాయి.

లక్షణాలు

  • శాఖారహిత కాండంతో పెరిగే వృక్షం.
  • పొడవుగా దీర్ఘవృత్తాకారంలో పొడిగించిన కొనతో ఉన్న అనేకమైన పత్రకాలు గల సరళ పిచ్ఛాకార సంయుక్త పత్రాలు.
  • సంయుక్త స్పాడిక్స్ పుష్పవిన్యాసాక్ష పీఠభాగంలో అమరిన ఆకుపచ్చరంగు స్త్రీ పుష్పాలు, కొనభాగంలో అమరిన మీగడరంగు పురుష పుష్పాలు.
  • పీచు వంటి మధ్య ఫలకవచం ఉన్న టెంకగల ఫలాలు.

ఉపయోగాలు

ఆహారపదార్ధం

Thumb
కొబ్బరి బొండం పానీయం
  • కొబ్బరి నీరు మంచి పానీయం. ముదురు కొబ్బరిలో కంటే లేత కొబ్బరి బొండంలో ఎక్కువగా నీరు ఉంటాయి. దీనిలోని లవణాలు వేసవికాలంగా చల్లగా దాహం తీరుస్తాయి.
  • కొబ్బరి పుష్పవిన్యాసాల చివరి భాగాన్ని కాబేజీ లాగా వంటలలో ఉపయోగిస్తారు. వీటి మూలం నుండి కల్లు తీస్తారు.

ఇతరమైనవి

వ్యక్తిగత ఉపయోగాలు

  • కొబ్బరి నూనె పొడి చర్మంతో సహాయం, ఒక చర్మం మాయిశ్చరైజర్ గా ఉపయోగిస్తారు. జుట్టు వాడినప్పుడు ప్రోటీన్ నష్టాన్ని తగ్గించడానికి ఒక అధ్యయనంలో చూపబడింది.
  • విద్యుత్ లైటింగ్ ఆవిష్కరించడానికి ముందు, కొబ్బరి నూనె ప్రధాన చమురు భారతదేశంలో ప్రకాశం కోసం ఉపయోగిస్తారు. నూనె కొచ్చిన్ ఎగుమతి అయింది.
  • కొబ్బరి నూనె, సబ్బు తయారీలో ముఖ్యమైన ముడి పదార్ధం. కొబ్బరి నూనెతో చేసిన సబ్బు ఇతర నూనెలతో చేసిన సబ్బు కంటే ఎక్కువ నీరు నిలుపుకుంటుంది. అందువలన తయారీదారు దిగుబడి పెరుగుతుంది. అయితే, కష్టం ఉంటుంది. ఇది కఠిన జలం (క్షార జలం) లో మరింత సులభంగా నురుగు ఇస్తూ ఇతర సబ్బుల కంటే ఉప్పు నీటిలో మరింత కరుగుతుంది.
  • కొబ్బరి నూనె సంతృప్త, అసంతృప్త కొవ్వు ఆమ్లాల యొక్క గొప్ప మూలం. వీటిలో, లారిక్ యాసిడ్ పాల్మిటిక్, స్టెరిక్, లినోలెయిక్ యాసిడ్‌లతో పాటు సమృద్ధిగా ఉంటుంది. ఇది చిట్లిన జుట్టును మృదువుగా చేయడానికి, చీలిక చివరలను రిపేర్ చేయడానికి, క్యూటికల్ పొరను మూసివేయడానికి, అవసరమైన తేమలో ట్రాప్ చేయడానికి సహాయపడుతుంది. ఇది రఫ్, డ్యామేజ్ అయిన జుట్టును కండిషన్ చేయడంలో సహాయపడుతుంది, జుట్టు విరగకుండా చేస్తుంది.
  • పరిశోధన ప్రకారం, కొబ్బరి నూనె SPF విలువ 8ని కలిగి ఉంది, ఇది ఆముదం, బాదం, నువ్వులు, ఆవనూనె వంటి ఇతర నూనెల కంటే తులనాత్మకంగా ఎక్కువ. ఇది కొబ్బరి నూనెను సహజమైన సన్-బ్లాకర్‌గా చేస్తుంది, ఇది జుట్టుకు వర్తించినప్పుడు సూర్యరశ్మిని నిరోధించడంలో సహాయపడుతుంది.[5]
  • ఫోలిక్యులిటిస్, రింగ్‌వార్మ్, ఇతరులు వంటి బాక్టీరియల్, శిలీంధ్ర ఇన్ఫెక్షన్‌లను కొబ్బరి నూనె, దాని సూత్రీకరణలతో సులభంగా చికిత్స చేయవచ్చు. కొబ్బరి నూనె యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉన్నట్లు నివేదించబడింది, సూక్ష్మజీవుల నిరోధక జాతులకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
  • కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్, మిరిస్టిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మాన్ని మృదువుగా, తేమగా మార్చే ఒక మృదువుగా చేస్తుంది. ఇది చర్మం పొడిబారడం, ఆకృతిని మెరుగుపరచడానికి ట్రాన్స్‌పిడెర్మల్ నీటి నష్టాన్ని (TEWL) తగ్గిస్తుంది.
  • ఎలుకలపై జరిపిన ఒక అధ్యయనంలో పచ్చి కొబ్బరి నూనె కొల్లాజెన్ అభివృద్ధిని, గాయం మానడాన్ని ప్రోత్సహిస్తుందని కనుగొంది. కొబ్బరి నూనెలోని కొవ్వు ఆమ్లాలు, ఇతర భాగాలు ఫైబ్రోబ్లాస్ట్‌లను (కొల్లాజెన్-ఉత్పత్తి చేసే కణాలు) ప్రేరేపిస్తాయి, గాయాలను నయం చేయడానికి యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్ కార్యకలాపాలను మెరుగుపరుస్తాయి.[6]
  • మొటిమలు లేదా మచ్చలు వంటి చర్మానికి సంబంధించిన అన్ని సమస్యలను తొలగించడానికి కొబ్బరి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రాత్రి పడుకునే అరగంట ముందు పచ్చి కొబ్బరిని తీసుకోవడం వల్ల చర్మానికి సంబంధించిన అన్ని సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

సంస్కృతి

  • హిందువుల సంస్కృతి, సంప్రదాయాలలో కొబ్బరి కాయకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇవి వివిధ పూజలలో దేవతలకు ముఖ్యంగా సమర్పిస్తారు. ఇంచుమించు అన్ని శుభకార్యాలలో కొబ్బరి కాయను పగుల కొడతారు. దీనిని ఆత్మసమర్పణంతో సమానంగా భావిస్తారు.
  • భారతదేశంలో కేరళ రాష్ట్రం కొబ్బరికాయలకు ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ కొబ్బరికి చాలా ప్రసిద్ధి.

ఇవి కూడ చూడండి

మోదక్

మూలాలు

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.