ఝార్సుగూడా

ఒడిశా రాష్ట్రం, ఝార్సుగూడా జిల్లా ముఖ్యపట్టణం From Wikipedia, the free encyclopedia

ఝార్సుగూడా ఒడిశా రాష్ట్రం, ఝార్సుగూడా జిల్లాకు చెందిన పట్టణం, ఈ జిల్లా ప్రధాన కార్యాలయం. ఇది ప్రధానంగా లోహ పరిశ్రమలతో కూడిన పారిశ్రామిక కేంద్రం. ఇది రైలు నెట్‌వర్క్ ద్వారా భారతదేశంలోని ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది. ఇటీవల ప్రారంభించబడిన ఝార్సుగూడా విమానాశ్రయం, ఇప్పుడు వీర్ సురేంద్ర సాయి విమానాశ్రయంగా పేరు మార్చబడింది. సమృద్ధిగా ఉన్న పరిశ్రమ, ఎక్కువగా సమీపంలోని థర్మల్ పవర్ ప్లాంట్ల కారణంగా దీనిని "ఒడిశా పవర్‌హౌస్" అని పిలుస్తారు. విభిన్న జనాభా, భాష, సంస్కృతుల కారణంగా జార్సుగూడను "లిటిల్ ఇండియా" అని పిలుస్తారు.

త్వరిత వాస్తవాలు ఝార్సుగూడా ఒడిశా పవర్‌హౌస్, దేశం ...
ఝార్సుగూడా
ఒడిశా పవర్‌హౌస్
Nickname: 
JSG
Thumb
ఝార్సుగూడా
ఒడిశా పటంలో పట్టణ స్థానం
Coordinates: 21.85°N 84.03°E / 21.85; 84.03
దేశం India
రాష్ట్రం ఒడిశా
జిల్లాఝార్సుగూడా
జనాభా
 (2011)[1]
  Total1,24,500
భాషలు
  అధికారికఒరియా
Time zoneUTC+5:30 (IST)
PIN
768201
Vehicle registrationOD-23 (Previously OR-23)
మూసివేయి

భౌగోళికం, శీతోష్ణస్థితి

ఝార్సుగూడా పశ్చిమ ఒడిశాలో, 21.85°N 84.03°E / 21.85; 84.03 వద్ద,[2] సముద్రమట్టం నుండి 218 మీ. ఎత్తున ఉంది. రాష్ట్ర రహదారి 10, జాతీయ రహదారి 69 (NH-69) ఈ పట్టణం గుండా వెళతాయి. ఝార్సుగూడా పట్టణానికి పశ్చిమాన ఇబ్ నది ప్రవహిస్తోంది. దక్షిణాన భేడెన్ నది ప్రవహిస్తోంది. పట్టణ వైశాల్యం 70.47 km 2, జనాభా 1,24,500.[3]

మరింత సమాచారం శీతోష్ణస్థితి డేటా - Jharsuguda (1981–2010, extremes 1951–2012), నెల ...
శీతోష్ణస్థితి డేటా - Jharsuguda (1981–2010, extremes 1951–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 35.0
(95.0)
38.4
(101.1)
42.7
(108.9)
46.1
(115.0)
48.0
(118.4)
47.1
(116.8)
41.7
(107.1)
36.2
(97.2)
37.1
(98.8)
36.2
(97.2)
35.6
(96.1)
32.8
(91.0)
48.0
(118.4)
సగటు అధిక °C (°F) 27.8
(82.0)
30.8
(87.4)
35.7
(96.3)
40.1
(104.2)
41.0
(105.8)
36.8
(98.2)
31.9
(89.4)
31.2
(88.2)
32.0
(89.6)
32.2
(90.0)
30.2
(86.4)
27.8
(82.0)
33.1
(91.6)
సగటు అల్ప °C (°F) 12.6
(54.7)
15.4
(59.7)
19.7
(67.5)
24.4
(75.9)
26.9
(80.4)
26.5
(79.7)
25.0
(77.0)
24.8
(76.6)
24.4
(75.9)
21.4
(70.5)
16.5
(61.7)
12.6
(54.7)
20.9
(69.6)
అత్యల్ప రికార్డు °C (°F) 5.6
(42.1)
7.2
(45.0)
11.1
(52.0)
15.8
(60.4)
18.7
(65.7)
16.3
(61.3)
17.4
(63.3)
16.6
(61.9)
16.7
(62.1)
12.1
(53.8)
8.4
(47.1)
6.1
(43.0)
5.6
(42.1)
సగటు వర్షపాతం mm (inches) 19.0
(0.75)
19.5
(0.77)
14.6
(0.57)
24.5
(0.96)
37.9
(1.49)
221.2
(8.71)
421.7
(16.60)
386.3
(15.21)
233.3
(9.19)
64.8
(2.55)
15.7
(0.62)
8.7
(0.34)
1,467.2
(57.76)
సగటు వర్షపాతపు రోజులు 1.3 1.3 1.6 2.2 3.5 9.8 16.6 17.0 11.3 3.7 0.9 0.6 69.9
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 43 34 26 23 29 54 77 81 76 64 53 47 51
Source: India Meteorological Department[4][5]
మూసివేయి

రవాణా

వలసరాజ్యాల కాలం నుండి నగరంలో అభివృద్ధి చెందిన రవాణా సదుపాయాలున్నాయి. ప్రాథమిక రవాణా మార్గాలు ఆటో రిక్షాలు, టాక్సీలు, ప్రైవేట్, ప్రభుత్వ బస్సులు ఉన్నాయి.

ఝార్సుగూడా విమానాశ్రయం దుర్లగాలో 2019 నుండి పనిచేస్తోంది. ఇక్కడ బ్రిటిషు కాలం నుండి ఎయిర్‌స్ట్రిప్‌ ఉంది. దీన్ని ప్రస్తుతం పూర్తి స్థాయి విమానాశ్రయంగా అప్‌గ్రేడ్ చేసారు. 2018 సెప్టెంబరు 22 న VSS విమానాశ్రయాన్ని (వీర్ సురేంద్ర సాయి విమానాశ్రయం) ప్రారంభించారు.[6]

2019 ఫిబ్రవరి 28 న, చౌక విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ఉడాన్ పథకం కింద ఝార్సుగూడా నుండి కోల్‌కతా, హైదరాబాద్, న్యూ ఢిల్లీ వంటి వివిధ రాష్ట్ర రాజధానులకు విమాన సౌకర్యం కలిగించింది.[7] 

ఝార్సుగూడా రైల్వే స్టేషను హౌరా-నాగ్‌పూర్-ముంబై లైన్‌లోని టాటానగర్-బిలాస్‌పూర్ సెక్షన్‌లో, జార్సుగూడ-విజయనగరం లైన్‌లో ఒక ముఖ్యమైన రైల్వే కూడలి. ఈ రైల్వే స్టేషను సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలోకి వస్తుంది.

Thumb
ఝర్సుగూడా రైల్వే స్టేషన్

ఝార్సుగూడా రాష్ట్ర రహదారి 10 (ప్రస్తుతం బిజు ఎక్స్‌ప్రెస్‌వేలో భాగం), జాతీయ రహదారి 49 ద్వారా రాష్ట్రాలలోని వివిధ పట్టణాలకు అనుసంధానించబడి ఉంది.

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.