Remove ads
From Wikipedia, the free encyclopedia
జై రామ్ థాకూర్ (జననం: 1965 జనవరి 6) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.[1]
జై రామ్ ఠాకూర్ | |||
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 27 డిసెంబర్ 2017 – 8 డిసెంబర్ 2022 | |||
గవర్నరు | బండారు దత్తాత్రేయ | ||
---|---|---|---|
ముందు | వీరభద్ర సింగ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | మండీ, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం | 1965 జనవరి 6||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | సాధన థాకూర్ | ||
సంతానం | చంద్రిక, ప్రియాంక | ||
నివాసం | తండి గ్రామం, మండీ, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం |
థాకూర్ మంది తుంగా ప్రదేశంలోని తండి గ్రామంలోని ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ఇతనికి ఇద్దరు సోదరీమణులు, ఇద్దరు సోదరులు. ఇతని తండ్రి జేతు రామ్ సుతారి పని చేసే వాడు, తల్లి బ్రికు దేవి. జై రామ్ థాకూర్ కురణిలోని ప్రాథమిక పాఠశాలలో తన విద్యాభ్యాసం ప్రారంభించాడు. ఆ తరువాత 1987లో వల్లభ్ ప్రభుత్వ పాఠశాల నుండి బి.ఏ పూర్తి చేసాడు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ చదువు పూర్తి చేసాడు.
థాకూర్ ఎబివిపిలో తన సహచారిగా ఉన్న సాధన థాకూర్ని వివాహం చేసుకున్నాడు, వీరికి ఇద్దరు కుమార్తెలు.[2]
థాకూర్ తన గ్రాడ్యుయేషన్లో ఉండగా ఎబివిపి కార్య కలాపాలలో పాల్గొనేవాడు. జైరాం ఠాకూర్ తొలిసారిగా చచ్యోట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత 1998లో మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, అప్పటి నుండి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. జైరాం ఠాకూర్ మండి జిల్లాలోని సెరాజ్ నియోజకవర్గం నుండి 2022లో ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేత్రామ్పై 21వేల మెజార్టీతో గెలిచాడు.[3] [4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.