Remove ads
From Wikipedia, the free encyclopedia
జగత్ ప్రకాష్ నడ్డా, (జ:960 డిసెంబరు 2) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, న్యాయవాది.అతను 2019 జూన్ 19 నుండి 2020 జనవరి 20 వరకు బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్గా[1] [2] 2020 జనవరి 20 నుండి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు [3] అతను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను నిర్వహించిన కేంద్ర మంత్రి. [4] హిమాచల్ ప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికయ్యాడు. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు కార్యదర్శిగా వ్యవహరించాడు [5] గతంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. [6]
జె.పి.నడ్డా | |
---|---|
11th President of the Bharatiya Janata Party | |
Incumbent | |
Assumed office 20 జనవరి 2020 | |
ఉపాధ్యక్షుడు | Raman Singh, Vasundhara Raje, Raghubar Das, Radha Mohan Singh, Baijayant Panda, D. K. Aruna, A. P. Abdullakutty, Rekha Verma, M. Chuba Ao, Bharti Shiyal |
అంతకు ముందు వారు | Amit Shah |
Member of Parliament, Rajya Sabha | |
Incumbent | |
Assumed office 3 ఏప్రిల్ 2012 | |
అంతకు ముందు వారు | Viplove Thakur |
నియోజకవర్గం | హిమాచల్ ప్రదేశ్ |
Working President of the Bharatiya Janata Party | |
In office 17 జూన్ 2019 – 20 జనవరి 2020 | |
అధ్యక్షుడు | Amit Shah |
అంతకు ముందు వారు | Position Established |
తరువాత వారు | Position Abolished |
Minister of Health and Family Welfare | |
In office 9 నవంబరు 2014 – 30 మే 2019 | |
ప్రధాన మంత్రి | Narendra Modi |
అంతకు ముందు వారు | Harsh Vardhan |
తరువాత వారు | Harsh Vardhan |
Member of Legislative Assembly ,Himachal Pradesh Cabinet Minister | |
In office 2007 –2012 | |
Chief Minister | Prem Kumar Dhumal |
Ministry | Forest, Environment, Science and Technology |
In office 1998 –2003 | |
Chief Minister | Prem Kumar Dhumal |
Ministry | Health & Family Welfare and Parliamentary Affairs |
Member of Himachal Pradesh Legislative Assembly | |
In office 2007 –2012 | |
అంతకు ముందు వారు | Tilak Raj Sharma |
తరువాత వారు | Bumber Thakur |
నియోజకవర్గం | Bilaspur |
In office 1993 –2003 | |
అంతకు ముందు వారు | Sada Ram Thakur |
తరువాత వారు | Tilak Raj Sharma |
నియోజకవర్గం | Bilaspur |
వ్యక్తిగత వివరాలు | |
జననం | Jagat Prakash Nadda 1960 డిసెంబరు 2 Patna, Bihar, India |
జాతీయత | Indian |
రాజకీయ పార్టీ | Bharatiya Janata Party |
ఇతర రాజకీయ పదవులు | National Democratic Alliance |
జీవిత భాగస్వామి | Mallika Banerjee (m. 1991) |
సంతానం | 2 |
బంధువులు | Jayashree Banerjee (mother-in-law) |
కళాశాల |
|
ఆయన నుండి 2024లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[7] జగత్ ప్రకాశ్ నడ్డా 2024 ఏప్రిల్ 06న రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[8] ఆయన 2024 జూన్ 24న రాజ్యసభాపక్ష నేతగా నియమితుడయ్యాడు.[9][10]
నడ్డా 1960 డిసెంబరు 2న బీహార్లోని పాట్నాలో ఒక హిందూ కుటుంబానికి [11] చెందిన నారాయణ్ లాల్ నడ్డా, కృష్ణ నడ్డా దంపతులకు జన్మించాడు. [12] [13] అతనికి జగత్ భూషణ్ నడ్డా అనే సోదరుడు ఉన్నాడు. [14] నడ్డా పాట్నాలోని సెయింట్ జేవియర్స్ పాఠశాలలో చదివాడు.ఆ తర్వాత బిఏ చేశాడు. పాట్నా కళాశాల, పాట్నా విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి., హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం, సిమ్లా నుండి, ఫ్యాకల్టీ ఆఫ్ లా పూర్తిచేసాడు. అతని చిన్నతనంలో ఢిల్లీలో జరిగిన అఖిల భారత జూనియర్స్ సిమ్మింగ్ పోటీలలో బీహార్ తరుపున ప్రాతినిధ్యం వహించాడు. నడ్డా 1991 డిసెంబరు 11న మల్లికా నడ్డా (నీ బెనర్జీ)ని వివాహం చేసుకున్నాడు.వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.[13] అతని అత్త జయశ్రీ బెనర్జీ 1999లో లోక్సభకు ఎన్నికయ్యింది. [15] [16]
నడ్డా 2020 డిసెంబరు13న కొవిడ్ లక్షణాలను లక్షణాలను అనుభవించిన తర్వాత తనకు కొవిడ్-19 పాజిటివ్ అని తేలిందని తన అనుచరులకు ట్విట్ చేసాడు [17]
నడ్డా తొలిసారిగా 1993లో బిలాస్పూర్ నుంచి హిమాచల్ ప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు . 1998లో తిరిగి ఎన్నికయ్యాడు. అతని మొదటి పదవీకాలంలో 1994 నుండి 1998 వరకు హిమాచల్ ప్రదేశ్ శాసనసభలో తన పార్టీ గ్రూపు నాయకుడిగా పనిచేశాడు.అతను రెండవసారి ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేసాడు. [18]
2007 ఎన్నికలలో నడ్డా మరొకసారి ఎన్నికయ్యాడు. తరువాత ప్రేమ్ కుమార్ ధుమాల్ ఏర్పాటుచేసిన ప్రభుత్వంలోని మంత్రివర్గంలో నడ్డా అటవీ, పర్యావరణం,శాస్త్రీయ, సాంకేతిక విజ్ఞాన శాఖకు మంత్రిగా 2008 నుంచి 2010 వరకు బాధ్యత వహించాడు. [18]
నడ్డా 2012లో శాసనసభకు తిరిగి ఎన్నిక కావడానికి ప్రయత్నించలేదు. దానికి బదులుగా హిమాచల్ ప్రదేశ్ నుండి భారత పార్లమెంటు ఎగువ సభ రాజ్యసభకు ఎన్నికయ్యాడు. [18] 2014లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆరోగ్య శాఖ మంత్రిగా నడ్డాను నియమించాడు.[19]
2019 జూన్ లో నడ్డా బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యాడు. 2020 జనవరి 20 జనవరి 20న అతను బిజెపి జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై, అమిత్ షా నుండి బాధ్యతలు స్వీకరించాడు. [20] 2021 జనవరిలో పశ్చిమ బెంగాల్లోని బర్ధమాన్లో ఏక్ ముతీ చావల్ యోజన అనే కొత్త పథకాన్ని నడ్డా ప్రారంభించాడు.[21] 24 జూన్ 2024 సోమవారం న రోజున కేంద్రమంత్రి జే.పీ నడ్డా రాజ్యసభ పక్ష నేతగా నియమితులైయ్యారు[22].
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.