Remove ads
From Wikipedia, the free encyclopedia
జితేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు.[1] 1999లో 13వ లోక్సభకు భారతీయ జనతా పార్టీ తరపున, 2014లో 16వ లోక్సభకు తెలంగాణ రాష్ట్ర సమితి తరపున మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం పార్లమెంటు సభ్యుడిగా వహించాడు.[2][3]
జితేందర్ రెడ్డి | |||
మాజీ ఎం.పి. | |||
పదవీ కాలం సెప్టెంబర్ 1, 2014 – 2019 | |||
నియోజకవర్గం | మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | నాగర్ కర్నూల్, తెలంగాణ, భారతదేశం | 1954 జూన్ 26||
ఇతర రాజకీయ పార్టీలు | తెలంగాణ రాష్ట్ర సమితి | ||
జీవిత భాగస్వామి | రాజేశ్వరి రెడ్డి | ||
సంతానం | ముగ్గురు | ||
నివాసం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | ఉస్మానియా విశ్వవిద్యాలయం | ||
వృత్తి | వ్యాపారవేత్త | ||
డిసెంబరు 17, 2016నాటికి | మూలం |
జితేందర్ రెడ్డి 1954, జూన్ 26న రామచంద్రారెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా, మానవపాడ్ మండలం, పెద్ద ఆముద్యాలపాడు గ్రామంలో జన్మించాడు.[4]
హైదరాబాదు లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.కాం చదివాడు.
1981, డిసెంబరు 19న రాజేశ్వరి రెడ్డితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.