From Wikipedia, the free encyclopedia
జాన్ గిల్పిన్ (John Gilpin) (18వ శతాబ్దం) ప్రసిద్ధిచెందిన ఆంగ్ల హాస్య రచన.[1] దీనిని విలియం కూపర్ (William Cowper) 1782 లో "The Diverting History of John Gilpin" అను పేరుతో రచించాడు. కూపర్ ఈ కథను తన స్నేహితురాలైన లేడీ ఆస్టిన్ నుండి విన్నట్లుగా పేర్కొన్నాడు.
గిల్పిన్ లండన్ సమీపంలో నివసిస్తున్న ఒక ధనిక వస్త్ర వ్యాపారి. ఇతనికి బకింగ్హాంషైర్ లో ఒక స్వంత స్థలంలో నివసించాడు. ఈ రచనలో గిల్పిన్, అతని భార్య, పిల్లలతో ఎడ్మంటన్ కు ప్రయాణిస్తూ దారితప్పిపోయారు, తరువాత గుర్రం అదుపుతప్పి పది మైళ్లు దాటి వేర్ అనే పట్టణానికి చేరారో వివరించాడు.
కందుకూరి వీరేశలింగం పంతులు ఈ రచననే జాన్ గిల్పిన్ పేరున తెలుగులోకి పద్యరూపంలోనే అనువదించారు. ఇందులోని మొదటి పద్యం ఇలా:
గీ. లండ ననియెడుపట్టణ మొండుగలదు,
దాన, గన్యతయుఁ బ్రసిద్ధితద్దగలిగి,
యుద్ధవేళనె పనిచేయు యోధవరుఁడు,
జానుగిల్పిను వసియించు సంతమును. 1
ఈ క్రింది లింకులలో పూర్తి పద్యాలు ఉన్నాయి:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.