జాజుల సురేందర్

From Wikipedia, the free encyclopedia

జాజుల సురేందర్

జాజల సురేందర్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2][3]

త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
జాజుల సురేందర్
Thumb


పదవీ కాలం
2018 - 2023 డిసెంబర్ 03
ముందు ఏనుగు రవీందర్‌ రెడ్డి
తరువాత కె. మదన్ మోహన్ రావు
నియోజకవర్గం ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1973, మార్చి 25
నల్లమడుగు, లింగంపేట్ మండలం, కామారెడ్డి జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు నర్సయ్య - హనుమవ్వ
జీవిత భాగస్వామి భార్గవి
సంతానం ఇద్దరు కుమారులు
మూసివేయి

జననం, విద్య

సురేందర్ 1973, మార్చి 25న నర్సయ్య - హనుమవ్వ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, లింగంపేట్ మండలంలోని నల్లమడుగు గ్రామంలో జన్మించాడు. హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని సర్దార్ పటేల్ కాలేజ్ నుండి 1995లో గ్రాడ్యుయేషన్ (బికాం) పూర్తి చేశాడు.[4][5]

వ్యక్తిగత జీవితం

సురేందర్ కు భార్గవితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

రాజకీయ విశేషాలు

కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సురేందర్, 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పై ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి చేతిలో 24,000 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[6] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిపై 31,000 వేలకు పైగా ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు.[7][8] 2018లో శాసన సభ్యునిగా గెలుపొందిన తరువాత కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[9][10] ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నాడు.[11]

ఇతర వివరాలు

నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు సందర్శించాడు.

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.