From Wikipedia, the free encyclopedia
రామాయణం నాటి జాంబవంతుడి కుమార్తె జాంబవతి. జాంబవంతుడు తనకు దొరికిన శమంతకమణి జాంబవతికి బహూకరిస్తాడు. జాంబవంతుడిని 28 రోజుల యుధ్ధంలో ఓడించి, జాంబవతిని చేపడతాడు శ్రీకృష్ణుడు. ఈమె శ్రీకృష్ణుని ఎనిమిదుగురు భార్యలలో ఒకతే. ఈమె గొప్ప వీణా విద్వాంసురాలు.
జాంబవతికి పది మంది కుమారులు. వారిలో పెద్దవాడు సాంబుడు. ఆ తరువాత వారు సుమిత్రుడు, పురుజితుడు, సత్యజితుడు, సహస్రజితుడు, విజయుడు, చిత్రకేతు, వసుమంతుడు, ద్రవిడ, కృతు. జాంబవంతీ పుత్రులపై కృష్ణునికి ప్రత్యేక అభిమానమున్నది.[1]
శ్రీ కృష్ణదేవరాయలు జాంబవతీ ఇతివృత్తం ఆధారంగా సంస్కృతములో జాంబవతీ కళ్యాణము అనే కావ్యాన్ని రచించాడు.
Seamless Wikipedia browsing. On steroids.