Remove ads
ఒడిశా లోని గంజాం జిల్లాకు ముఖ్యపట్టణం From Wikipedia, the free encyclopedia
ఛత్రపూర్ (ఛతర్పూర్ అని కూడా పిలుస్తారు) ఒడిషా రాష్ట్రం, గంజాం జిల్లా లోని పట్టణం. ఇది గంజాం జిల్లా ముఖ్యపట్టణం. దీని పరిపాలనను నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ చూస్తుంది. ఛత్రపూర్ ఒడిషాలోని గంజాం జిల్లాలో ఒక తహసీల్ / బ్లాక్ (CD).
2011 జనగణన ప్రకారం,[3] ఛత్రపూర్ జనాభా 20,288. ఇందులో పురుషులు 51% కాగా, స్త్రీలు 49%. పట్టణ అక్షరాస్యత 89%, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ. పురుషుల్లో అక్షరాస్యత 85% కాగా, స్త్రీలలో ఇది 73%. జనాభాలో 10%,మంది ఆరెళ్ళ లోపు పిల్లలు.
ఛత్రపూర్లో మతం[4] | ||||
---|---|---|---|---|
హిందువులు | 97.31% | |||
ముస్లిములు | 1.78% | |||
క్రైస్తవులు | 0.72% | |||
సిక్కులు | 0.04% | |||
బౌద్ధులు | 0.00% | |||
జైనులు | 0.05% | |||
చెప్పనివారు | 0.10% | |||
ఇతరులు | 0.00% |
ఛత్రపూర్ దక్షిణ ఒడిషాకు ముఖద్వారం. పట్టణంలో బాగా అభివృద్ధి చెందిన రవాణా వ్యవస్థ ఉంది. ఈ మార్గంలో వెళ్ళే అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు ఇక్కడ ఆగుతాయి. ఇది కోల్కతా మద్రాస్ జాతీయ రహదారితో బాగా అనుసంధానించబడి ఉంది కాబట్టి అన్ని లగ్జరీ బస్సులు కూడా పట్టణం గుండా వెళతాయి.
జాతీయ రహదారులు NH-16 ( చెన్నై - కోల్కతా ), NH-59 ( ఖరియార్ - బెర్హంపూర్ ), స్టేట్ హైవే 36 (ఒడిషా) (సురడ నుండి హింజిలికట్ మీదుగా ఛత్రపూర్) ఛత్రపూర్ గుండా వెళ్తూ, పట్టణాన్ని ఒడిషాలోని ఇతర నగరాలు, పట్టణాలతో కలుపుతున్నాయి. పట్టణం లోపల మూడు చక్రాల ఆటో టాక్సీలు అత్యంత ముఖ్యమైన రవాణా మార్గం. టాక్సీలు కూడా తిరుగుతాయి.
చత్రపూర్ రైల్వే స్టేషన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే లైన్లో ఉంది, ఇది కోల్కతా, చెన్నై లను కలిపే ప్రధాన మార్గంలో ఉంది. ఇక్కడి నుండి నేరుగా న్యూఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, బెర్హంపూర్, చెన్నై, కటక్, ముంబై, నాగ్పూర్, పూణే, పూరీ, విశాఖపట్నం, హైదరాబాద్, కోల్కతా, రాయ్పూర్, సంబల్పూర్ వంటి అనేక నగరాలకు రైలు సౌకర్యం ఉంది. భువనేశ్వర్ - ఛత్రపూర్ రైలు రాజధాని నగరం భువనేశ్వర్ చేరుకోవడానికి ఒక సౌకర్యం.
ఛత్రపూర్లో ఛత్రపూర్ స్టేషన్, ఛత్రపూర్ కోర్ట్ స్టేషన్ అనే రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి.
వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రత 37 °C; శీతాకాలపు కనిష్ఠ ఉష్ణోగ్రత 16 °C. సగటు రోజువారీ ఉష్ణోగ్రత 33 నుండి 38 °C వరకు ఉంటుంది. మే అత్యంత వేడిగా ఉండే నెల; డిసెంబరు అత్యంత చలిగా ఉంటుంది. సగటు వార్షిక వర్షపాతం 1250 mm. ఈ ప్రాంతంలో జూలై నుండి అక్టోబరు వరకూ ఉండే రుతుపవనాల కాలంలో కుండపోతగా వానలు కురుస్తాయి.
శీతోష్ణస్థితి డేటా - Chhatrapur, Odisha | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
సగటు అధిక °C (°F) | 27 (81) |
30 (86) |
34 (93) |
36 (97) |
37 (99) |
34 (93) |
32 (90) |
31 (88) |
32 (90) |
32 (90) |
30 (86) |
28 (82) |
32 (90) |
సగటు అల్ప °C (°F) | 16 (61) |
19 (66) |
23 (73) |
27 (81) |
29 (84) |
28 (82) |
27 (81) |
27 (81) |
26 (79) |
23 (73) |
20 (68) |
16 (61) |
23 (74) |
సగటు వర్షపాతం cm (inches) | 1.2 (0.5) |
1.70 (0.67) |
1.90 (0.75) |
1.50 (0.59) |
4.00 (1.57) |
15.00 (5.91) |
28.20 (11.10) |
27.30 (10.75) |
18.00 (7.09) |
9.30 (3.66) |
3.30 (1.30) |
1.90 (0.75) |
113.3 (44.64) |
Source: MSM Weather |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.