From Wikipedia, the free encyclopedia
చెవి లేదా కర్ణం (Ear) జంతుజాతులలో శబ్దాల్ని గ్రహించే జ్ఞానేంద్రియం. మనిషికి రెండు చెవులు తలకి ప్రక్కగా ఉంటాయి. చెవులు వినడానికే కాకుండా, శరీరపు సమతాస్థితి ని గ్రహించడానికి తోడ్పడుతాయి.
తెలుగు భాషలో చెవి పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] చెవి నామవాచకంగా An ear. A key అని అర్ధాలున్నాయి. ఉదా: మాట చెవిని పెట్టు to give ear to, to hearken. చెవులు గడియలు పడ్డవి his ears were ringing through faintness. పత్రము యొక్క చెవి the tip or margin of a written bond. పత్రపు చెవి చించు to cancel a bond by tearing the leaf so as to disengage it from the cord on which palm leaf volumes are strung. చెవికొన or చెవికొణక the tip of the ear. చెవిటి (చెవి+అవిటి) adj. విశేషణంగా Deaf. n. A deaf man. బథిరుడు అని అర్ధం. ఉదా: చెవిటి వ్యవహారము an unspeakable or unutterable iniquity, lit. one which makes one story one's ears. చెవిటిమూగ n. A deaf mute. చెవుడును మూగతనమును గలవాడు. చెవినిల్లు గట్టుకొని చెప్పు to reiterate a precept, as though keeping ti always dwelling in the ear. ఉదా: "నిచ్చలు చెవినిలల్లు గట్టుకొని చాటితి నన్నుగణింప వైతి పెన్బలియుని తోడి పోరిది." చెవియాకు లేదా చెవ్వాకు n. An ear ornament ఒక రకమైన చెవికి ధరించే ఆభరణం. చెవికట్టు n. The iron ring on an axle tree. చెవుడు (చెవి + అవుడు) n. Deafness. (The inflected form is చెవిటి.) చెవుడుపడు v. n. To become deaf. చెవుడుపరుచు to deafen. చెవులపిల్లి n. The black-naped Hare, Lepus nigricollis. (F.B.I.) కుందేలు. చెవులపోతు n. A buck hare కుందేలు, శశకము.
సకశేరుకాలలో, ముఖ్యంగా క్షీరదాలలో చెవి నిర్మాణం క్లిష్టంగా ఉంటుంది. చెవిలో బాహ్య చెవి లేదా వెలుపలి చెవి, మధ్య చెవి, లోపలి చెవి అని మూడు భాగాలుంటాయి.
కొన్ని చేపలలోను, ఉభయచరాలలోను, చాలా సరీసృపాలలోను వెలుపలి చెవి లోపిస్తుంది. మానవ చెవి గుర్తించలేని కొన్ని శబ్దాలను కొన్ని జంతువులు గుర్తిస్తాయి. ఉదాహరణకు అల్ట్రాసోనిక్ శబ్దాలు. ఒక్కో జంతువుకు ఒక్కోరకం శబ్దాలను గ్రహించగల శక్తి ఉంటుంది.
మానవుని చెవి ఒక నిర్ణీత పరిధిలోని శబ్దాలను మాత్రమే వినగలుగుతుంది. అంతకు మించిన పెద్ద పెద్ద శబ్దాలను విన్నపుడు కర్ణభేరి పగిలిపోవచ్చు. నీళ్ళు ఎక్కువగా లోపలికి వెళ్ళడం వల్ల కూడా చెవి లోపలి భాగం దెబ్బతినే అవకాశం ఉంది. చెవి బాగా శుభ్రం చేయకపోవడం వల్ల గులిమి చేరి నొప్పి వేసే అవకాశం ఉంది.
హెడ్‌ఫోన్స్ అనేవి చెవులపై ధరించే లేదా ప్రైవేట్‌గా ఆడియోను వినడానికి చెవులలోకి చొప్పించబడే ఆడియో పరికరాలు. ఇవి సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్‌లు, టాబ్లెట్‌లు, మ్యూజిక్ ప్లేయర్‌ల వంటి వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలతో ఉపయోగించబడతాయి. చుట్టుపక్కల వాతావరణం నుండి ఆడియోను వేరుచేయడం ద్వారా హెడ్‌ఫోన్‌లు మరింత లీనమయ్యే, వ్యక్తిగత శ్రవణ అనుభవాన్ని అందిస్తాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.