From Wikipedia, the free encyclopedia
గుమ్మా (చెట్టి) తనుజా రాణి భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అరకు నియోజకవర్గం నుండి తొలిసారి ఎంపీగా లోక్‌సభకు ఎన్నికైంది.[1]
గుమ్మా తనుజా రాణి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 | |||
ముందు | గొడ్డేటి మాధవి | ||
---|---|---|---|
నియోజకవర్గం | అరకు | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 1993 అడ్డుమండ, హుకుంపేట మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | వైఎస్ఆర్సీపీ | ||
తల్లిదండ్రులు | జి శ్యామా సుందర రావు, వరలక్ష్మి | ||
జీవిత భాగస్వామి | చెట్టి వినయ్ | ||
బంధువులు | చెట్టి ఫాల్గుణ (మామ) | ||
సంతానం | 1 | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
తనుజా రాణి 1993లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హుకుంపేట మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అడ్డుమండ గ్రామంలో జి శ్యామా సుందరరావు, వరలక్ష్మి దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి తండ్రి బీఎస్ఎన్ఎల్ అధికారి, పదవీ విరమణ తర్వాత ఆ అడ్డుమండ గ్రామానికి సర్పంచ్‌గా పని చేశాడు. తల్లి వరలక్ష్మి పాడేరులో హెడ్ నర్సుగా పని చేసింది. ఆమె ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్-ఇంటర్నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ కిర్గిజ్స్తాన్ (ISM-IUK), బిష్కెక్ నుండి మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీనిపొంది ఎపిడెమియాలజిస్ట్‌గా పని చేసింది.[2][3]
తనుజా రాణి వృత్తిరీత్యా వైద్యురాలైన ఆమె అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ కుమారుడు వినయ్ ను వివాహం చేసుకుంది. తనుజ రాజకీయాల్లోకి రాకముందు పాడేరులోని ఐటీడీఏ, ఏఎస్ఆర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఐసీడీఎస్ పరిధి ఎపిడిమిక్ విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిపై వైద్యాధికారిగా పని చేసింది.
తనుజా రాణి రాజకీయ నేపధ్యమున్న కుటుంబం నుండి వైఎస్ఆర్సీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అరకు నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతపై 50,580 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎంపీగా లోక్‌సభకు ఎన్నికైంది. ఈ ఎన్నికల్లో ఆమెకు 4,77,005 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 4,26,425 ఓట్లు వచ్చాయి.[4]
Seamless Wikipedia browsing. On steroids.