తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు మరియు మాజీ ఎమ్మెల్యే From Wikipedia, the free encyclopedia
చింతా ప్రభాకర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.[2] చింతా ప్రభాకర్ 2022 జనవరి 26న టిఆర్ఎస్ పార్టీ, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[3]
చింతా ప్రభాకర్ | |||
చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్[1] | |||
పదవీ కాలం 12 సెప్టెంబర్ 2022 – 05 డిసెంబర్ 2023 | |||
ఎమ్మెల్యే | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 నుండి 2018 వరకు 03 డిసెంబర్ 2023 - ప్రస్తుతం | |||
నియోజకవర్గం | సంగారెడ్డి | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 1959 ఆగస్టు 10 సదాశివపేట, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలంగాణ రాష్ట్ర సమితి | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
చింతా ప్రభాకర్ 1959 ఆగస్టు 10న తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, సదాశివపేటలో జన్మించాడు. ఆయన సదాశివపేట లోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశాడు.[4]
చింతా ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన సదాశివపేట మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్గా పనిచేశాడు. చింతా ప్రభాకర్ 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్ రెడ్డి చేతిలో 6772 ఓట్ల తేడాతో ఓటమి పాల్యయాడు. ఆయన 2011లో టిఆర్ఎస్ లో చేరి సంగారెడ్డి టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితుడయ్యాడు.
చింతా ప్రభాకర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్ రెడ్డి పై 29,814 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[5][6][7] ఆయన 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్ రెడ్డి చేతిలో 2589 ఓట్ల తేడాతో ఓటమి పాల్యయాడు.[8]
చింత ప్రభాకర్ 2022 సెప్టెంబరు 12న తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమితుడై [9][10] 2022 సెప్టెంబరు 27న బాధ్యతలు స్వీకరించాడు.[11] ఆయన 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి[12], డిసెంబరు 05న తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశాడు.[13]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.