చంద్రోదయ దేవాలయం, భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, మయాపూర్ (మయపుర) లో ఉంది. [1] [2] [3]దీనిని గతంలో మియాపూర్ అని పిలిచేవారు. ఇది బామన్పుకుర్ పొరుగు ప్రాంతం, రెండు నదుల సంగమం వద్ద, నబద్వీప్ ప్రక్కనే ఉంది. ఇక్కడ జలంగి నది జలాలు గంగతో కలిసిపోతాయి.ఇది కోల్‌కతాకు ఉత్తరాన 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. నబద్వీప్తో పాటు, గౌడియా వైష్ణవిజం అనుచరులు దీనిని ఆధ్యాత్మిక ప్రదేశంగా భావిస్తారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయం. పశ్చిమ బెంగాల్లో వున్న ఈ ఆలయ నిర్మాణం గావించింది ఒక పరదేశీయుడు. ఆ వివరాలు తెలిపేదే ఈ కథనం.
ఆలయ నిర్మాణానికి ప్రేరణ
ప్రపంచ స్థాయి కార్ల కంపెనీ ఫోర్డ్. ఆ కంపెనీ వ్వవస్థాపకుడు హెన్రీ ఫోర్డ్. అతని తనయుడు ఆల్ఫ్రెడ్ ఫోర్డ్. అతనిది రాజా లాంటి జీవితం. కాని అతనికున్న సంపద, పేరు ప్రఖ్యాతులు అతనిని చిరకాలం సంతోషపెట్టలేక పోయాయి. కొత్తదనం కోసం వెతుకులాటలో మావోయిజం, బౌద్ధం ఇలా అన్ని ఇజాలను చూశారు. కానీ అవేవీ ఇతనిని సంతోషపెట్టలేక పోయాయి. అప్పటివరకు భగవద్గీత అంటే తెలియని అతను మొదటిసారిగా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమాజం (ఇస్కాన్) వ్యవస్థాపకులైన ప్రభు పాదులు రచించిన భగవద్గీతను చదివారు. అందులో శ్రీకృష్ణుని గొప్ప వ్వక్తిగా చిత్రించిన తీరు ఫోర్డ్ ను అమితంగా ఆకట్టుకుంది. దాంతో 1975 లో అతను శ్రీకృష్ణుని భక్తుడైపోయాడు. అంతే కాక, హిందువుగా మారి తన పేరును అంబరీషగా మార్చుకున్నాడు. ప్రభుపాదుల వారి సూచనల ప్రకారం మద్యం, మాంసం మానేసి శాకాహారియై తన ఆహారాన్ని తానే వండుకోవడం మొదలెట్టాడు. తన మతమార్పిడికి తల్లి దండ్రులు మొదట్లో అభ్యంతర పెట్టినా చివరికి ఒప్పుకున్నారు.
ఎవరు నిర్మించారు
ఫోర్డ్ డెట్రాయిట్‌లో ఒక పెద్ద భవంతిని కట్టించి దాన్ని కృష్ణ మందిరంగా మార్చాడు. దాని ప్రారంబోత్సవానికి ఫోర్డ్ తల్లిదండ్రులతో బాటు ప్రభుపాదులు కూడా వచ్చారు. ఆ సందర్భంలో ప్రభుపాదుల ఇస్కాన్ ప్రధాన కేంద్రమైన పశ్చిమ బెంగాల్ లోని మాయాపూర్లో అంతర్జాతీయ స్థాయి దేవాలయాన్ని నిర్మించాలని వున్న తన మనసులోని మాటను ఫోర్డ్‌కి చెప్పాడు. ఫోర్డ్ ఆ కోరికను నెరవేర్చాలనుకున్నారు. ఆ కట్టడ నిర్మాణం 2010 లో మొదలెట్టి మూడేండ్లలో పూర్తి చేశారు. 400 కోట్ల అంచనా వ్యయంలో 300 కోట్లు ఫోర్డ్ భరించగా, మిగిలిన 100 కోట్లు దాతల ద్వారా సమకూరింది.
ఆలయం ప్రదేశం
భారతదేశంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మాయాపూర్ లో ఉంది. ఇస్కాన్ ప్రధాన కేంద్రం శ్రీధామం కూడా ఇక్కడే ఉంది.
ఆలయ విశేషాలు
ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ విశాలమైన దేవాలయంతో పాటు ఇక్కడ మూడు వందల మంది కూర్చోడానికి సరిపడేంత వైశాల్యంలో ప్లానెటేరియం, వైదిక విజ్ఞాన కేంద్రం నిర్మించారు.
ఫోర్డ్ కుటుంబం
1980 లో సిడ్నీలో ఇస్కాన్ కార్యక్రమాలలో భాగమైన రథయాత్రలో శ్రీ కృష్ణ తత్వం అలవడిన ఫోర్డ్ పాల్గొన్నాడు. ఆ సందర్భంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన ప్రవాస భారతీయురాలైన షర్మిల పరిచయమైంది. ఆమెకూడ కృష్ణ భక్తురాలు కావడముతో ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి. అలా 1983 లో వారి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. వారు అమృత, అనీష. పిల్లలు పుట్టాక పోర్డ్ దంపతులు పిల్లలతో సహా ఉత్తర అమెరికాలోని గెయింస్ విల్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ ఉత్తర అమెరికాలోకెల్ల అతి పెద్ద శ్రీకృష్ణ మందరిరం ఉంది. అక్కడ వుంటే తమ పిల్లలకు కృష్ణ తత్వం బాగా అలవడుతుందని వారి అభిప్రాయం.
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.