చంద్రశేఖర్ శంకర్ ధర్మాధికారి
భారతీయ స్వాతంత్ర ఉద్యమకారుడు , న్యాయవాది ,న్యాయమూర్తి మరియు రచయిత From Wikipedia, the free encyclopedia
చంద్రశేఖర్ శంకర్ ధర్మాధికారి భారతదేశానికి చెందిన న్యాయమూర్తి, స్వాతంత్ర్య సమరయోద్యుడు, న్యాయవాది, రచయిత. ఆయన బొంబాయి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. చంద్రశేఖర్ శంకర్ ధర్మాధికారి 2003లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది.[1][2] ఆయన హిందీ, మరాఠీ & గుజరాతీ భాషల్లో అనేక పుస్తకాలు రచించాడు.
జస్టిస్ చంద్రశేఖర్ శంకర్ ధర్మాధికారి | |
---|---|
![]() | |
జననం | రాయపూర్ , మధ్యప్రదేశ్, భారతదేశం | 1927 నవంబరు 20
మరణం | 3 జనవరి 2019 91) | (aged
జాతీయత | భారతదేశం |
విద్య | ఏం.ఏ.ఎల్.ఎల్.బి, నాగపూర్ యూనివర్సిటీ, మహారాష్ట్ర. |
వృత్తి | న్యాయమూర్తి, స్వాతంత్ర సమరయోద్యుడు, న్యాయవాది, రచయిత |
ఉద్యమం | క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942 |
జీవిత భాగస్వామి | తార ధర్మాధికారి |
పిల్లలు | డా.అరుణ పాటిల్, సత్యరంజన్ ( బొంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి), అశుతోష్ (న్యాయవాది) |
తల్లిదండ్రులు | దమయంతి ధర్మాధికారి , ఆచార్య దాదా ధర్మాధికారి |
పురస్కారాలు | పద్మభూషణ్ |
భారత స్వాతంత్ర ఉద్యమకారుడు
చంద్రశేఖర్ శంకర్ ధర్మాధికారిని స్వాతంత్ర్య సమరయోద్యుడిగా మహారాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చింది.[3]
జననం, విద్యాభాస్యం
చంద్రశేఖర్ శంకర్ ధర్మాధికారి 1927 నవంబరు 20న దమయంతి ధర్మాధికారి, ఆచార్య దాదా ధర్మాధికారి దంపతులకు రాయపూర్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మించాడు. ఆయన ఎస్.బి. సిటీ కాలేజీ, నోషర్ మహావిద్యాలయ & నాగపూర్ యూనివర్సిటీ లా కాలేజీ నుండి ఏం.ఏ..,, ఎల్.ఎల్.బి పూర్తి చేశాడు.
న్యాయమూర్తిగా
చంద్రశేఖర్ శంకర్ ధర్మాధికారి నాగపూర్ యూనివర్సిటీ లా కాలేజీ నుండి ఏం.ఏ. ఎల్.ఎల్.బి పూర్తి చేశాడు. ఆయన 1956 అక్టోబరు 25 న నాగ్‌పూర్ హైకోర్టు న్యాయవాదిగా, బొంబాయి హైకోర్టులో 1958 జూలై 21లో & సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 1959 జూలై 20లో పేరు నమోదు చేసుకున్నాడు.
ఆయన 1965 ఆగస్టులో నాగ్‌పూర్‌లో ప్రభుత్వ అసిస్టెంట్ ప్లీడర్‌గా, 1970 అక్టోబరులో బొంబాయి, నాగ్‌పూర్ బెంచ్‌లో అదనపు ప్రభుత్వ ప్లీడర్ హైకోర్టుగా నియమితులయ్యాడు. చంద్రశేఖర్ శంకర్ ధర్మాధికారి 1965 నుండి 1972 వరకు బొంబాయి, నాగ్‌పూర్ బెంచ్ హైకోర్టు ప్రభుత్వ ప్లీడర్‌గా, 1972 జూలై 13న బొంబాయి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 1972 నవంబరు 24 నుండి ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడై, 1989 నవంబరు 20న పదవీ విరమణ చేశాడు. ఆయన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన తరువాత 1991 జూలై 7 నుండి 1992 నవంబరు 20 వరకు మహారాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఛైర్మన్‌గా పనిచేశాడు.[3]
మరణం
చంద్రశేఖర్ శంకర్ ధర్మాధికారిని 2019 జనవరి 3న గుండెపోటుతో మరణించాడు.[4]
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.