From Wikipedia, the free encyclopedia
మహబూబ్ నగర్ జిల్లా లోని గిరిదుర్గాలలో చంద్రగఢ్ కోట ఒకటి. ఇది జిల్లాలోని నర్వ మండలంలో చంద్రఘడ్ అనే గ్రామ సమీపంలో ఉంది.[1]
చంద్రగఢ్ | |
---|---|
సాధారణ సమాచారం | |
దేశం | భారత దేశము |
భౌగోళికాంశాలు | 16.23°N 77.42°E |
నిర్మాణ ప్రారంభం | 18 వ శాతాబ్దం |
చంద్రఘడ్ గ్రామానికి ఉత్తరదిశలో ఎత్తైన కొండ ఉంది. ఆ కొండ మీద రెండు అంచెలుగా ఈ కోటను నిర్మించారు. చుట్టు పక్కల పది కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ నుండి చూసినా ఈ కొండ, కొండ మీది కోట కనిపిస్తాయి. ఈ కోట మొత్తం నిర్మాణమంతా రాతితోనే ఉండటం విశేషం. ఈ నాటికి చెక్కుచెదరని రాతికట్టడం చూపరులను ఆకట్టుకుంటుంది. దీనిని 18 వ శతాబ్దిలో మరాఠా పీష్వా మొదటి బాజీరావు కాలంలో, ఆత్మకూరు సంస్థానములో పన్నుల వసూలు కొరకు నియమించబడిన చంద్రసేనుడు ఈ కోటను నిర్మించాడంటారు. కొండపై మొదటి భాగంలో విశాలమైన ఆవరణాన్ని చుట్టి రక్షణగోడ ఉంది. దానిని దాటి మరింత పైకి వెళ్తే, మరింత ఎత్తులో అద్భుత నిర్మాణంతో కూడిన రాతికోట కనిపిస్తుంది. దీనికి రెండు ద్వారాలు ఉన్నాయి. ఒకటి పశ్చిమం వైపు ప్రధాన ద్వారం, ఉత్తరం వైపు మరో ద్వారం. ఉత్తర ద్వారం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కాని ఇక్కడ ప్రవేశం లేదిప్పుడు. ఒకప్పుడు ఇది అత్యవసర ద్వారం లాగా ఉండేదేమో! కోట వెనుకంతా కొండ మీద ఏక శిలలా కనిపించే బండ ఉంది. ఆ బండమీదే కోట వెనుక భాగపు గోడను నిర్మించారు. పై కోట ఎక్కడా శిథిలమైనట్టు కనిపించదు.
కోట లోపల శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. అలయం చుట్టూ 8 ఊట బావులున్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికీ స్వచ్ఛమైన నీటి ఊటతో తాగునీరును అందిస్తున్నాయి. శ్రీరామలింగేశ్వరస్వామికి ప్రతి శివరాత్రికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే ప్రతి సంవత్సరం నాగుల చవితి నాడు కొండపై జాతర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కబడ్డీ పోటీలను నిర్వహిస్తుంటారు.
Seamless Wikipedia browsing. On steroids.